9-7-99
రఘుగారికి,
నమస్తే,
రిజిస్టరు వుత్తరం అందింది. అప్లికేషనుంది. ప్రత్యేకంinstructions లేదు.13,14 yes/no అర్ధమవలేదు, టిక్కు పెట్టటానికి. మీకు తెలిస్తే సరే, లేకపోతే ఆఫీసులో అడిగి టిక్కు పెట్టండి. రేషనుకార్డు లేదు. ఐదేళ్ళ Bank passBook పంపుతున్నాను. వకటోది ఆఖరుది పేజీలు కూడాxerox చెయించాను. Bank pass Book నాకు వాపసు పంపనవసరంలేదు. మీ దగ్గరే వుంచోచ్చు.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
__వడ్డెరచండీదాస్ 20-7-99
రఘుగారికి,
నమస్తే,
మీ వుత్తరం అందింది.paper cutting యెందుకు వుంచుతారండి. lucklyవుంది.G.O.లోone or more News paper అని వుంటే వకదాన్లోనే అచ్చువేశాను. The Hindu july 19,1975,cutting మిద తేది వుంది. Name change No- taryఆ మొన్న మాdaughter కోసం తీసుకున్నాను. ఆ కాపి వుంది. అది పంపుతున్నాను. అలా కుదరదంటే మళ్ళి తీసుకునిoriginalపంపుతాను.Name change G.O.S.S.C.(H.S.C)certificates originalsపంపుతున్నాను.Retire ఐనప్పుడు కూడా వక్క సర్టిఫికేట్ కూడా అడుగలేదు. వీళ్ళు తెగ విసిగిస్తున్నారు.
మీ నలుగురికి శుభాకాంక్షలు. -వడ్డెర చండీదాస్.
2-8-99
రఘుగారికి,
నమస్తే,
నాకు విసుగు.మీకు శ్రమ ఆఫిసువాళ్ళు sadists నోటారి నెమ్ చేన్జ్ కి తీసుకుని పంపుతున్నాను. తేది మారుతుంది. ఈ రోజు తేది. కాపి కూడా పంపుతున్నాను.
మీ నలుగురికి శుభాకాంక్షలు. -వడ్డెర చండీదాస్.
PS.నా10th class,Name change certificates originals జాగ్రత్త.
17-8-99
రఘుగారికి,
నమస్తే,
రిజిస్టరుత్తరం చేరింది.Name change paper cutting zerox వక పక్కనే వుంది. రెండో వ్తెపున పేపరు పేరూ తేది వున్నాయి. ఐనా అవసరంలేదు.visaఅప్పుడుName change paper cutting originalఅవసరం అవుతుంది.
PS.విజయవాడ మోహనప్రసాద్ గారికి రాస్తే తెలుస్తుకున్నారు. హిమజ్వాల D.T.P.తీసిన negativenపోయినందువాళ్ళనట. మళ్ళి మొదలెట్టి సెప్టెంబరు, డిశంబరులో తిసుకురావాలనుకుంటున్నారట. __వడ్డెరచండీదాస్.
22-8-99
రఘుగారికి,
నమస్తే ,
విణానాదం యిష్టం. చాలా యిష్టం. చాల చాలా యిష్టం.
వెనకటి కాలంలో మధుబాల ఆ తరువాత లినాచందావార్కర్ యిష్టం.
Dream and Rrality in telugu cinema songs గురించి రాయకూడదూ!
మీ నలుగురికి శుభాకాంక్షలు. -వడ్డెర చండీదాస్.
18-10-99
రఘుగారికి,
నమస్తే ,
పాస్ పోర్ట్ వొచ్చింది. Name change paper cutting, Affidavit originalsవాళ్ళ దగ్గిరే వుండిపోయాయి.VISAకావాలంటే అవి అవసరం అవుతాయి. అడిగి తీసుకోండి. (File no.A.64887date 10-8-99) (Affidavitమిద Advocateసంతకం గ్రీన్ యింక్లో వుంటుంది)
ప్రస్తుతం యేం వర్క్ చేస్తున్నారు? D & L?
మీ నలుగురికి శుభాకాంక్షలతో. -వడ్డెర చండీదాస్.
P.S. paper cutting Affidavit తీసుకుని మీ దగ్గరే వుంచండి. వెంటనే నాకు పంపనక్కరలేదు.మీరు యిటు వొచ్చినప్పుడు తిసుకురావోచ్చు.
2-11-99
మిత్రులు రఘుగారికి,
మీ వుత్తరం అందింది. passport officeవాళ్ళు యివ్వకపోతే పోనీండి. యీ మాత్రానికి సదాశివరావుగారిని అడగటం దేనికి?paper cutting వాళ్ళు అడిగారు గాని, యెవరూ అడగరు. Affidavitకు వొ నూటపాతిక ఖర్చు. అవసరం ఐనప్పుడు మరొకటి తిసుకోవోచ్చు.
మీ నలుగురికి శుభాకాంక్షలు. -వడ్డెర చండీదాస్.
8-4-00
రఘుగారికి,
చాలారోజుల్తెంది మీకు రాసి (విశేషాలేం లేక.)
Titanicచూడమని సూచించారు. ఆమధ్య చూశాను. సూంచించినందుకు మీకు క్రుతజ్ఞతలు. సినిమాలు చూడటం మానేసిన నాకు యీ సినిమా చూడటం యెంతో సంతోషంగా అనిపించింది. అధ్బుతం, వొక్క మాటలో చెప్పాలంటే.
మీ నలుగురికిశుభాకాంక్షలు. -వడ్డెర చండీదాస్. 1-7-00
రఘుగారికి,
క్రితం వారం New york వొచ్చాను నాలుగు నెలలు వుంటాను. యింకా ప్రదేశాలు చూడలేదు. రబ్బరు స్టాంపు నొక్కిన మీ emailపని చెయ్యలేదు. emailఅడ్రసు రాయండి.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
యిక్కడి అడ్రసు, email. కింద యిస్తున్నాను.
-వడ్డెర చండీదాస్.
vaddara chandidas
c/o Dr. gopi k.Gundumalla, M.D.,
94, Amity street,
Apt#3F, BROOKYN
NEW YORK 11201
rsgopi @ aol.com
