20-11-96
రఘుగారికి,
రిజిస్టరు పోస్టు అందింది. తెలుగు చెయ్యగలనో లేదో ప్రయత్నిస్తాను.కనీసం, ముఖ్యమ్తెన పదాలు.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
23-12-96
రఘుగారికి,
నమస్తే.
మా అమ్మాయికి వుత్తరం రాస్తూ మీ న్యూజిలాండ్ మిత్రుల ఫోను నంబరు రాయబోతే కనిపించలేదు మీ వుత్తరం,యెంత వెదికినా. శ్రమ అనుకోక నాకు మళ్ళి రాస్తారు కదూ!
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెరచండిదాస్.
తిరుపతి
6-1-97
రఘుగారికి,
మీ వుత్తరం అందింది. నంబర్లు మా అమ్మాయికి పంపిస్తాను. తెలుగులో పదాలు దొరకటంలేదు నాకు. Contradictoriness ని వ్తెరుధ్యత్వం అని రాశాను. రేవతీదేవిగారి ఫోటో పుస్తకం అత్తమీద వుంది కదా? సరే వేరే ఫోటో పంపిస్తున్నాను. వ్తెవిధ్యంగా వుంటుందని.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
7-1-97
రఘుగారికి,
"దిపశిలతో మరోసారి" చదివాను. It' a key to understand Deepasila. చాలా బావుంది. ఆ పుస్తకానికి చాల అవసరమ్తెందినూ.
-వడ్డెరచండీదాస్.
తిరుపతి
25-1-97
రఘుగారికి,
నమస్తే,
"శిలాలోలిత " ప్తె వ్యాసం కోసం "వార్త" తెప్పించాను 18న. రాలేదు.25న తెప్పించాను. రాలేదు. వొచ్చినప్పుడు మిరే Zerox Copy పంపించండి, ప్లీజ్.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెరచండీదాస్.
16-2-97
రఘుగారికి,
నిరుత్సాహపడకండి, పబ్లిషర్స్ కి పంపిస్తూండండి.
-వడ్డెరచండీదాస్.
14-4-97
రఘుగారికి,
నమస్తే,
లక్నో విషయాలు చదివి సంతోషించాను. నిరుత్సాహపడక పబ్లిషర్స్ కి పంపిస్తూండండి. వ్యాసాలు రాయబోతున్నందుకు సంతోషం.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
PS: వ్యాసం పంపిన వుత్తరం అందింది. మరుగున వున్న ముఖ్యాంశాలను వెలికితీసే మీ వ్యాసాలకు ముగ్ధుణ్ణివుతున్నాను.
-వడ్డెర చండీదాస్.
4-6-97
రఘుగారికి,
MY Son-in-law went to New york. And my daughter is about to go. నేను కూడా వెళ్ళాలి.
నాకు Pass-portకావాలి USAకి. daughter అక్కడ వుంది. vaddera chandidas aged 60. అనిచెప్పి pass port application కాగితాలు తీసుకుని నాకు పంపండి. తరవాత stageలో Addl DGP influence తో ప్రయత్నించ వచ్చు.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
p.s. pSSPORT Office Exhibition grounds లో వుంది.
-వడ్డెర చండీదాస్.
