20 - 1 -92
ప్రియమ్తెన రఘుగారికి
నమస్తే
మీ వుత్తరం ఆ మధ్య వొచ్చింది. ప్రత్యేకం వెంటనే జవాబు రాయల్సిందేమి లేనందుననుకుంటాను - ఆలస్యం.
creativity లో a bsolute Novelty వుండదు గాని - Absolute Novelty అంటూ వుండనందున - Authentic Novelty వుంటుంది. నా ' d and l' లో సూచించాను. you may further go deep into it. యీ spondilysis లేకపోతే ఈ సెలవుల్లో వొచ్చేవాణ్ని.
గోవా నుంచి యీరోజున వో అభిమాన పాఠకురాలి నుంచి వుత్తరం వొచ్చింది. నేవీ ఆఫీసర్ భార్య. రెండు దశాబ్దాలుగా అప్పడప్పడు వుత్తరాలు రాస్తుంటారు. (గోవా చూడటానికి రమ్మని చాలాసార్లు పిలిచారు. వీలుపడలేదు) Defence Acad-ఏమి లోకి వాళ్ళబ్బాయి (only son) సెలక్టయ్యి - trainingలో - బహుశా drugs వల్లనేమో - నాటికి నేటికి జాడలేదు. 20 యేళ్ళ తరవాత - మళ్ళి వో బాబుని కన్నారు - మూడేళ్ళక్రితం. దురదృష్టం - భర్త యిటీవల road accident లో పోయారట. యింతపెద్ద వయసులో పసిపిల్లాడితో వొంటరి జీవితం సాగిస్తూ పిల్లాన్ని పెంచుకోవాలి. ఆమె అక్కడే సెటిల్ కాదలిస్తే మీకు రాస్తాను - మీ సంసారం కొంత 'తోడు'గా వుండొచ్చు - in case you all like her, (నాకు ఆమెగూర్చి బొత్తిగా తెలియదు. నా రచనల అభిమాని. అంతకుమించి ఆమె, ఆమె గురించి ఏమి తెలియదు). ఆ వార్త చదివి - చాలా దిగులుగా అనిపించింది. ముక్కు మొహం తెలియని వ్యక్తి ఐనా. కాకపోతే she has excellent aesthetic grasp and feeling అని తెలుసు వుత్తరాల ద్వారా. నేనేమి చదవటం లేదు. యింకో ఆర్నెల్లు యింతేనేమో
మీ యిరువురికి శుభాకాంక్షలు. వాత్సల్యకు దీవనలు.
-వడ్డెర చండీదాస్
12 - 7 - 92
రఘుగారికి,
మీ వుత్తరం.
అపోలోలో చూపెట్టినందుకు మరేమీ కాదని తేల్చి చెప్పినందుకు సంతోషం. సింపుల్ యబ్స్ స్ ఐతే కొన్నాళ్ళు యిబ్బంది అంతే.
గోవాలో మా పాఠకురాలు వాళ్ళు అక్కడినుంచి వెళ్ళిపోయారు.
మీ కవితలు దినపత్రికకి పంపించాలన్నారు. కొన్న్తేనా అచ్చావుతాయని తలుస్తాను. ఐతే చూసి పంపిస్తాను. (ఆదివారం ఆంద్రజ్యోతి చూస్తుంటాను)
నా గోవా ప్రయాణం అలా వాయిదా పడుతూవుంది కదా!
మీ ముగ్గురికి శుభాకాంక్షలతో,
-వడ్డెర చండీదాస్.
20-7-92
డియర్ రఘు,
మీ వుత్తరం.
క్లర్క్ ని ప్తెలు తిసి చూసి చెప్పుమన్నాను. యెప్పటిదో నిరుటిది. ఆఖరితేది ఇపోయి యేడాది కావొస్తోంది. ఫారాలూ లేవు. నా అనుమానం జరగలేదేమోనని, shelve చేస్తారేమో. అది సంగతి.
మీ ముగ్గురికి శుభాకాంక్షలతో,
-వడ్డెర చండీదాస్.
తిరుపతి - 517501
321, మిద్దెమీద, భవాని నగర్
11- 12 - 92
రఘు గారికి,
నా నడుంనొప్పి యింకా అలాగానే వుంది. వంట కూడా చెయ్యటంలేదు. కిరణ్ గారింట్లోంచే.
డాక్టర్ విద్యాసాగర్ గారు మళ్ళి యెప్పడు చూపెట్టమన్నారు? యేం చెప్పారు? మీరు టైఫాయిడ్ నిరసాన్నుంచి కోలుకున్నారని తలుస్తాను.
-వడ్డెర చండీదాస్ .
5 -8 - 93
రఘుగారికి,
నమస్తే,
poly myositis అని కండరాల జబ్బు - సడన్ గా వొచ్చింది. కాళ్ళు పట్టు యివ్వవు. యిటివలె కోలుకున్నాను. ఆ వెంటనే సిమ్లా వుత్తరం రాశాను.
హైదరాబాద్ లో చేరినందుకు సంతోషం.
మీ ముగ్గురికి శుభాకాంక్షలతో ,
-వడ్డెర చండీదాస్.
11 - 11 -94
ప్రియమ్తెన రఘుగారికి,
నమస్తే,
మీ వుత్తరం; వ్యాసం.
వ్యాసం అద్బుతంగా వుంది. ఆ విశ్లేషణ చాలా చాలా బావుంది. (ఆ వ్యాసాలు చదివాను)
d &l పని కొనసాగుతున్నందుకు సంతోషం.
ప్రేమతో,
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
10 - 2- 96
రఘుగారికి,
మీ వుత్తరం.
మ్తెదానం వ్యాసం బావుంది. యడాగమసంధి "యుంచి" "యుండి" పరిహరించాలి.
d &l exposition సామాన్య పాఠకులకు జటిలంగా అనిపిస్తుంది. Dialogues లోకి incorporate చేస్తే సరిపుచ్చుకుంతుంది. ప్తేనల్ కాఫీ తప్ప పంపనవసరం లేదు. please go ahead. 'వార్త' కి వ్యాసం రాయండి.
ముగ్గురికి శుభాకాంక్షలు. మీకు రిగార్డ్స్.
-వడ్డెర చండీదాస్ .
తిరుపతి
23 - 4- 96
రఘుగారికి
నమస్తే.
మీ వ్యాసం అందింది. నాకు చెప్పిన దానికంటే బాగా వొచ్చింది.
శుభాకాంక్షలు.
మీ రాకకోసం యెదురుచూస్తూ,
-వడ్డెర చండీదాస్ .
తిరుపతి 3 - 7 - 96
రఘుగారికి,
నమస్తే,
మీ వుత్తరం అందింది,
your commantary is elusive. వోపని చేసి చూడండి. Dialogues ని tentatively గా accept చేసి sadilak dialogue కి సందర్చం వున్నచోట్ల మీ commentary ని జోడిస్తూ వెళ్ళండి. 1 st draft తయారవుతుంది - to modify it into final draft. యిలా ప్రయత్నించి చూడండి. లేకపోతే సరే మీ యిష్టం.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
12 - 10 - 9 6
రఘుగారికి,
నమస్తే
మీ వుత్తరం DO as you can and as you wish. try to be still more elaborate - if necessary take తే help of Dialogues. when you come here next time bring all the material. l will have అ glance at it.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
- వడ్డెర చండీదాస్ .
