Previous Page Next Page 
ప్రేమతో ....వడ్డెర చండీదాస్ పేజి 12

   
                                                                                                      తిరుపతి    
                                                                                                    22-7-02
    రఘుగారికి, నమస్తే.
    న్యూయార్క్ లో  నాకు నచ్చిందిక్కటే-statue of Liderty (తెలిసిన 1970నుంచి యిష్టం) ఆమెకి జుట్టు కత్తిరించకండా వెనక పక్కన ముడి వెయ్యటం చాలా బావుంది. అట్లాంటిక్ సముద్రంలో వుంది. ఫెర్రీలో వెళ్ళాలి.  ప్రయాణమంతా వెళ్ళేప్పుడు  వొచ్చేప్పడు కనిపిస్తూ వుంటుంది. దగ్గిరి కెళ్ళాక యింకా బావుంది. నాకు అమితానందాన్నిచ్చింది. మా అమ్మాయి వొక చిన్న ప్రతిమ కొని యిచ్చింది.
    గత వారమంతా నన్ను హృద్యంగా ఆవరించే వాళ్ళని చూశాను. మినాకుమారి, వ్తెజయంతిమాల, రేఖ, జయప్రద, మౌఘమీ  చటర్జీ .(పాటలు).
    కొందరు కొన్నిటిలో అద్భుతంగా వుంటారు వుదాహరణకి Umrao jaan లో రేఖ, మదుమతిలో వ్తెజయంతిమాల.
    (తెలుగులో  అన్వేషణలో భానుప్రియ చాలా బావుంటుంది)
    నిన్న బిర్జు మహారాజ్ వెనకటి ప్రదర్శన చూశాను. మహదానందంగా అనిపించంది. కథక్ నాకిష్టం.
    మీ నలుగురికి శుభాకాంక్షలు.
                                                                                 -వడ్డెర చండీదాస్.

                                                                                               తిరుపతి
                                                                                              2-8-02
    రఘుగారికి,
    నమస్తే.
    తెలుగులోనూ హిందీలోనూ యెందరో తియ్యని గొంతుల మహానుభావులు. మధుర బాణీలు సృష్టించిన యెందరో మహానుభావులు.
    అందరికి వందనాలు.
    (యే.ఆర్.రహ్మాన్ బాణీలు  గొంతులూ తెలుగుభాష తియ్యదానన్ని ఖూని చేస్తున్నాయి)
    అరవపాటలు కూడా చూస్తుంటాను. తమిళ హిరోయిన్ లు బావుంటారు.
    తెలుగుపాటలు  చూడటంలేదు. కొత్తపాటలే  వేస్తున్నారు. కొత్తవి చూడటానికి వినటానికి  గోరం.
    యిప్పటి వరకూ యింగ్లీషులో హిందిలో వొచ్చిన POP Music Albumsists. UMI, VOl.2,Universal 2002
    PS. వెనకటి తెలుగు హిందీ దేవదాస్ లు చూశారనుకుంటాను. యిప్పడోచ్చన  సంజయ్ లిలాబాన్ సాలి హిందీ దేవదాస్ తప్పక చూడండి.
    మీ నలుగురికి శుభాకాంక్షలు.
                                                                                    -వడ్డెర చండీదాస్.


                                                                                                         తిరుపతి  
                                                                                                      10-8-02
    రఘుగారికి,
    నమస్తే.
    మీ వుత్తరం  వొచ్చింది. యెందుకో హ్తెదరాబాద్  నుంచి ఐదారు రోజులకి చేరతాయి. d &l ఎప్పటిక్తేనా  Motilal Banarasidas  వాళ్ళకి  చిక్కుతుందను కుంటున్నాను.
    28తేదికి వొస్తున్నారని యెందుకో చూస్తున్నాను.
    సినిమాల్లో పాటలెలా వున్నా వాటిల్లో ప్రక్రుతి శోభ బావుంటుంది.
    మొన్నోకరోజునCLASH లేకండా మూడు channels లో లినాచందావార్కర్  సినిమాలు చూశాను. యింతకుముందు చాలసార్లు చూసినవే. సినిమా చూడను.  sound muteలో screen మీదికి ఆమె వొచ్చినప్పుడు చూస్తాను. లినా చందావార్కర్ నాకు యిష్టం. చాలా యిష్టం.  చాలా చాలా యిష్టం. యెంత సేప్తెనా అలా చూస్తూ వుండగలను.
    (వెనుకటి మధుబాల అంటే కూడా అంతే ).
    మీ నలుగురికి శుభాకాంక్షలు.
                                                                                         -వడ్డెర చండీదాస్.

                                                                                                       తిరుపతి
                                                                                                      25-8-02
           రఘుగారికి,
    నమస్తే.
    దేవాదాస్ సినిమాల గురించి నాలుగుముక్కలు రాస్తాను. శరత్బాబు దేవదాస్. యే విశిష్టతా లేని అతి మామూలు నవల. యెందుకో సినిమా వాళ్ళకి ప్రత్యేకించి  ఆసక్తి కలిగింది. హిందీలో తెలుగులో వొచ్చిన సినిమాలన్నీ చూశాను.
    హిందిలో వెనక స్తెగల్ దేవదాస్  వొచ్చింది. ఆ తరవాతేప్పడో  దిలీప్ కుమార్  దేవదాస్ వొచ్చింది. దిలీప్ కుమార్ దేవదాస్ కి ముందే ANR దేవదాస్ వొచ్చింది.
    ఆ తరవాత కృష్ణ దేవదాస్ వొచ్చింది.
    స్తెగల్ వొ మాదిరిగా వున్నాడు. దిలీప్ కుమార్ చప్పగా వున్నాడు. నటనయేమి  బాగోలేదు. (దాన్లో చంద్రముఖిగా  వ్తెజయంతిమాల బాగా చేసింది).
    ANR దేవదాస్ కి  సరితూగే సినిమా యింతవరకు రాలెదు. వొ మామ్మూలు  నవల అత్యంత గొప్పగా అయ్యింది. సినిమా మొత్తం  బాగా  వుంది. సావిత్ర పార్వతిగా బావుంది. అందరూ బాగా నటించారు.  సంగీతం చాలా బావుంది.ANR నటన  అధ్బుతం. యేవరితోనూ పోల్చటానికి వీల్లేదు. ఆ తరవాత  పోటిగా కృష్ట దేవాదాస్ తీశాడు. సినిమా గోరం. కృష్ణ నటన గొరతి గోరం.
    యింక కొత్తగా వొచ్చిన దేవదాస్ గురించి: శరత్ బాబు నవలలో లేని imagination ని యీ కాలంరిత్యా  పట్టుకొచ్చి గొప్పగా  పిక్చర్తేజ్  చేశాడు డ్తెరక్టరు. షారుఖ్ఖాన్  నటన గురించి చెప్పకోవాల్సిందేమి  లేదు. హిందీలో costliest cinema అట అది సినిమా అంతాటా  కనిపిస్తుంది.
    ANR దేవదాస్ యిప్పటికి యెన్నోసార్లు చూశాను. టివిలో వొస్తే మళ్ళి చూస్తుంటాను!
    మానసికంగా -చిన్నప్పటినుంచి యిప్పటివరకు నా వయసు యెప్పుడు  ముప్పుయ్ సంవత్సరాలు.
    సినిమా పాటల్లో హీరోయిన్స్ కి  కాళ్ళకి చెప్పులు యెప్పడోతప్ప  వుండవెందుకో? కొలంబియా pop Singer shakira వి నాకు తెలిసిన అతి నల్లని కళ్ళు.
    భారతనాట్యపు  దొడ్డికాళ్ళ భంగిమ నాకు నచ్చదు. కదలికల్లో లాలిత్యం వుండదు.
    సంగీతం దర్శకుడు ఆర్.డి. బర్మన్ కి అర్హమ్తెనా దానికంటే మించి సంగితఖ్యాతి వొచ్చింది. (ఆశాభోస్లే ప్రాబల్యం కారణంగానేమో!)
    మీ నలుగురికి శుభాకాంక్షలు.
                                                                                            -వడ్డెర చండీదాస్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS