Previous Page Next Page 
ప్రేమతో ....వడ్డెర చండీదాస్ పేజి 13

                                                                                                          తిరుపతి                                                                                                                      6-9-02

    రఘుగారికి,
    నమస్తే,
    ఆగస్టు 28న పెళ్ళికి వొస్తున్నాను, కలుస్తాను - అని నెలక్రితం రాసారు. యెదురుచూశాను. యెందుకు రాలేదో కారణం తెలియదు. వుత్తరం కూడా రాయలేదు. ఆకస్మిక తీవ్ర అనారోగ్యం వల్ల అనుకుంటున్నాను. దిగులుగా అనిపించింది.
    నాకు క్రితంవారం నడుంనొప్పి బాగా యెక్కువ ఐంది. చాలా యిబ్బంది పెట్టింది. యిప్పుడు కాస్త మేలు.
    దేవాదాస్ చూడమని రాశాను. చాశారా?  వీలయితే వెంటనే వుత్తరం రాయండి.
    మీ నలుగురికి శుభాకాంక్షలు.
                                                                                        -వడ్డెర చండీదాస్.
                                 
                                                                                              తిరుపతి
                                                                                           1-10-02
    రఘుగారికి,
    నమస్తే.
    మీ వుత్తరం అందింది. నా నడుంనొప్పి దాదాపు తగ్గింది.
    ఆంధ్రజ్యోతిలో నాకు తెలిసినవాళ్ళంతా చచ్చిపోయారు. వూమామహేశ్వరరావు అని దినపత్రిక లో  పనిచేసే వాడు. నాకు తెలుసు, మళ్ళి చేరవచ్చు. ప్రారంభించాకఫోనుచేసి కనుక్కోండి. వుంటే నా పేరు చెప్పండి,  నేను చెప్పినట్లు. ముందు అనువదించన్తేతే  అనువదించండి.  దేన్లోనో వోకదాన్లో అచ్చవుతుంది.
    మీ నలుగురికి శుభాకాంక్షలు.
                                                                                           -వడ్డెర చండీదాస్.

                                                                                                      తిరుపతి
                                                                                                     16-10-02
    రఘుగారికి, నమస్తే.

    డాక్టర్ యల్ శంకర్ వయొలిన్ మోహన, రాగం తానం పల్లవి విన్నాను.  మనసు మహత్తరంగా వుంది పూట.
    నిన్నటివి లో వొస్తే Umrao jaan మరోసారి చూసాను. నాకు చాలా నచ్చిన సినిమా. చాలా చాలా నచ్చిన సినిమా. యెన్నిసార్ల్తేనా చూడగలనది.
    మౌనంగా కళ్ళతో మాటాడినట్లుంది సినిమా.
    ఖయ్యం సంగీతం; పాటలతో పాటు, నేపధ్యం సంగీతం కూడా అద్బుతం. ఆశాభోస్లె  పాటలు బాగా పాడింది. లతామంగేష్కర్ కి  యెందుకివ్వలేదో తెలియదు.
    సంభాషణలు పలికినతిరు చాలా బావుంది.
    రేఖ అపురూపం, అద్భుతం. ఆమెకి ఆమె సాటి అనిపించుంకుంది.
    ముజప్పర్ ఆలి ఆ కాలపు వివరాలు (నవాబి) గమనిస్తూ గొప్పగా తీశాడు.
    పాదాలలోశనం, చేతుల వయ్యారపు భంగిమలతో కథక్ నృత్యాలు మరింతగా వుండాల్సింది. యిదోక్కటి  లోపంగా అనిపిస్తుంది.
    నాకు కథక్ యిష్టం. కథాకళి ఆహార్యం నచ్చదు. అనిస్ధటికంగా వుంటుంది. కానీ కేరళియుల  ప్రత్యేక నృత్యంలా బాగా ప్రాచుర్యం పొందింది. తమిళంలో యెవరి  పేర్లు తెలియదు. తెలిసిన సిమ్రాన్ యిష్టం.
    మీ యెస్సే  అచ్చయ్యివొచ్చిందా, యింకా లేదా? అనువదించండి తెలుగులోకి  ఆంద్రజ్యోతిలో   ప్రయత్నిద్దాం.
    మీ నలుగురుకి  శుభాకాంక్షలు.
                                                                                      -వడ్డెర చండీదాస్.
   
                                                                                                         తిరుపతి
                                                                                                        1-12-02
    రఘుగారికి,

    మీ వుత్తరం అందింది. విషయాలు తెలిశాయి. యేది యెప్పటికి జరగాలో అప్పటిలో జరుగుతుంది.
    I would say with poetess Lawrence Hope,s Garden  of kama-
    TO ask no question
    To make no prayer
    To take what  Fate or Gods may give.
    నిన్నంతా మంచి తెలుగు పాటలు విన్నాను. తెలుగులో యెక్కువ తియ్యని పాటలు ఘంటాసాల,  సుశీల పాడారు. ఘంటసాల  గొంతు సాక్సోఫోన్ లో తేనె నింపినట్లుంది. చక్రవర్తి  దరువులకి  కాకపోతే సుశీల  గొంతు వీణలాగా వుంటుంది.
    డాక్టర్ కూర్మయ్య అని నాకు తెలిసిన వ్యక్తి TTD publications లో  పనిచేసేవాడు  యిక్కడ.  తరవాత Government Degree colleges లో తెలుగు లెక్చరర్ (నర్సీపట్నం). ఆ మధ్య రాజమండ్రిలో  ఓ సదస్సులో   "అనుక్షణికంలో  మాండలికాల  విశేషాలు- వివిధ పాత్రల విభిన్న భాషాసూక్ష్మాలు"  అని ప్రసంగించాడట.
    తీరిగ్గా వ్యాసం అనివదించండి.
    మీ నలుగురికి శుభాకాంక్షలు.
    PS. మంచి గాయకులు, మంచి సంగీత దర్శకులు కారు. ఘంటసాల మంచి సంగీత దర్శకుడు కూడా. యెన్నో తియ్యని బాణీలు యిచ్చాడు. (హిందిలో హేమంత్ కుమార్)
    యీ తెల్లవారుజామున  గాయత్రిగారి వీణ చూస్తూ విన్నాను. గంటసేపు, చెన్త్నే డి.డి.లో.(ఆ టైంలో హ్తేదరాబాద్ డి.డి.లో సార్వత్రిక విశ్వవిద్యాలయల  పాఠాలో  హ్తేస్కూల్ విద్యార్ధులకు  పాఠాలో మరేవో నిస్సారపు ప్రసంగాలో వుంటాయి!) తమిళులు యేంత్తేనా తమిళులె. పోల్చటానికి లేదు. గాయత్రిగారి వీణ అద్బుతంగా వుంది. ఆమెకి రావల్సినంత పేరు యింకా రాలేదు.

                                                                                        -వడ్డెర చండీదాస్.

                                                                                                          తిరుపతి
                                                                                                          9-12-02
    రఘుగారికి,
    నమస్తే.
    యేలూరు నుంచి అసంఖ్యాకంగా  వుత్తరాలు రాసిన వకతను వక వుత్తరంలో హిమజ్వాలలోని గితాదేవి  శివరాం ల  గురించి రాసింది, నాకెంతో నచ్చింది. "నవలలో శివరాం అనిన మొదటి మాటా చివరి మాటా కలిపితే వాళ్ళ సంబందానికి వ్యాఖ్యనంగా వుంటుంది-అతను అనిన  మొదటి మాట సారి ఆఖరిమాట గీతా- రెండూ కలిపితే సారిగితా!" -అని.
    తియ్యని గొంతు, తియ్యని బాణీ; నాకు ప్రాణం.
    ఆకాశవాణి తెలుగుకేంద్రాలది, పరమ బద్దకపు అనభిరుచి ఘనత. నాకు వినే ప్రయత్నం చెయ్యని విజ్ఞాతుంది.
    తెలుగు "అన్వేషణ" సినిమా చూశారా?  అన్వేషణ తమిళంలో 'కిరావాణి' పాట scv పాటల చానల్లో తరచూ వొస్తూ వుంటుంది. 'కీరవాణి' పాటలో భానుప్రియ అందం అధ్బతుం.
    మొన్న DD  Bharati లో తాన్ సేన్ సంగీత్ సమారొహ్  లో  సితార్ విన్నాను. వాయించటం యేమంత గొప్పగా లేదుగాని-
    సితార్ - జగత్తులోని  సాంద్రతనంతటిని కేంద్రించుకుని,  వెంట్రుకలో వందో వొంతు మృదువ్తెన  సన్నని స్వరంలా  ధ్వనిస్తుంది. యెవరు వాయించారని కాదు, సితారే అధ్బుతం.
    మీ నలుగురికి శుభాకాంక్షలు.
                                                                                                 -వడ్డెర చండీదాస్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS