తిరుపతి
02-02-02
రఘుగారికి,
టి.వి.లో వొక సినిమా ప్రకటన చూసి రాస్తున్నాను.
"Aap mujhe acche
lagne lage"
vikram Bhatt direction.
సినిమా యెలా తయారవుతుందో తెలియదు.
ఆ ప్రకటనలో Hrithik Roshan Amisha patel ల ముఖాలు కనిపిస్తాయి. కేవలం నిలకడగా మౌనంగా మొఖాలు కనిపిస్తాయి. చిన్న అధ్బుత కవితలా అనిపించింది. హిందీ మ్యూజిక్ చానల్స్ లో చూపెడుతున్నారు. చూడండి.
కూచిపూడి వయ్యారం యిష్టం. చాలా యిష్టం. చాలా చాలా యిష్టం. పచ్చని చిలకలిష్టం. వాటిక్కూడా అబ్బో యేం వోయ్యరమో!
సరిహద్దు ప్రాంతమ్తెనా కాదు, మలయాళంలో అచ్చతెలుగు పదాలున్నాయి. వుదాహరణకి వుప్పను వుప్ప అంటారు వాళ్ళు.
sony, star plus లలో 5.P.M. కి చూడొచ్చు.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
4-2-02
రఘుగారికి
నేను రాసిన సినిమా ప్రకటన మానేసి మరొకటి (చెత్త) వేస్తున్నారు. అరుదుగా కొన్ని చోట్ల వేస్తున్నారు.
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
11-3-02
రఘుగారికి నమస్తే,
మీ వుత్తరం వొచ్చినప్పుడు వివిధ భారతి వింటున్నాను. ఆకాశవాణి దూరదర్శన్ లలో మంచి కార్యక్రమాలు వుండవు. మధ్యాన్నం వివిధ భారతిలో రెండు గంటలు చాలా మంచి పాటలు వింటాను. అది వాళ్ళ ఘనత కాదు. శ్రోతలు కోరిన పాటాలవి. శ్రోతల మంచి సంగీతాభిరుచివల్ల (యెక్కువ పాటలు 1940 -1970కాలంలోవి). ఆకాశవాణిలో శాస్త్రీయ సంగీతం మాత్రం మంచిది వొస్తుంది. (దూరదర్శన్ లో రామాయణ్ మహాభారత్ లు తప్ప నేనేమి చూడలేదు.) ETVలో అప్పడప్పడు మంచి పాటలు చూస్తాను. (సిరియల్లూ సినిమాలూ చూడను). వార్తలు టి.వి. చానల్స్ లో చూస్తాను.
ఆకాశవాణి వుదయం ప్రారంభ ప్రసార సంగీతం,దూరదర్శన్ లో వుదయం ప్రారంభ ప్రసార ద్రుశ్యం యిష్టం, యెవరు సృష్టిచారో తెలియదు.
మీ నలుగురికి శుభాకాంక్షలు. -వడ్డెర చండీదాస్
సాలిళ్ళ తిరుపతి
[తేది లేదు 15-5-02 చేరింది]
రఘుగారికి, నమస్తే.
యిప్పడే గాయత్రి వీణ విన్నాను. మనసు మహత్తరంగా వుంది.రోజంతా సంగీతంతో గడిచిపోతుంది. నాదస్వరం కంటే షహ్ నాయ్ యిష్టం. షహ్ నాయ్ లో పలికినట్లు సంగితస్వరాలు బాగా పలకవు, నాదస్వరంలో. నాదస్వరం శుభకార్యా సందర్భాలకే పరిమితం కావాలి. దక్షిణాది వేణువు కంటే వుత్తరాది బాసురి యిష్టం.
ప్రస్తుతం చికట్లోంచి చీకట్లోకి అచ్చు పుస్తకం ప్రూఫ్రీడింగ్ చేస్తున్నాను.
యువతీయువకుల పెళ్ళి నిర్ణయానికి అడ్డుతగిలే తల్లిదండ్రులకు కోర్టు వురిశిక్ష విదించాలి. నాకు ఫిలాసఫి సాగిత్య సంస్ధల అనుభవాలు లేవు. మీ unpleasant అనుభవాలు మీ వుత్తరంలో చదివి తెలుసుకున్నాను.
వుత్తరం యిక్కడ ఆగిపోయింది.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
29-05-02
రఘుగారికి,నమస్తే.
యీ సెలవులక్కూడా వూరు రావటం లేదని రాశారు. మిమ్మల్ని చూసి చాలా కాలం ఐనట్లుగా అనిపిస్తుంది.
యిరవ్తేయెళ్ళ తరవాత అనుక్షణికం చదివాను. దాన్లో వుదహరించిన పుస్తకాలన్నీ చదివినవె - యికనమిక్స్ వి తప్ప.
మీ నలుగురికీ శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
20-6-02
రఘుగారికి,
నమస్తే,
ఆగస్టులో మీరిక్కడికి వొస్తున్నందుకు సంతోషంగా అనిపించింది.
నా పుస్తకాలు యెవరూ అచ్చుకి అడగలేదండి.
నేను చదువుతూ చికట్లోంచి వూరికే ప్రూఫ్ రీడింగ్ చెశాను. అంతే.
యిటివాలి వాళ్ళలో సునీత మంచిగోంతు. అందుకే యెక్కువ పాటలు లేవు.
యిక్కడ, జల్లులు మబ్బులు మొదలయ్యాయి. హాయిగా అనిపిస్తోంది వాతావరణం.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
[తేది లేదు 15-7-2002న చేరింది]
రఘుగారికి,
నమస్తే,
రెండేళ్ళ క్రితం నా అమెరికా ప్రయాణం వొ గొప్ప అనుభవం: విమానం మధ్యాహ్నం వేళకి లండన్ చేరింది. ఆ వేళకి కిటికిలోంచి చూస్తే భూమి కనిపించలేదు.
తెల్లవి మేఘాల దొంతరలు, విమానానికి బాగా దిగువగా మెరుస్తూ కడులుతూన్నవి. మేఘాలు అలాగే వున్నాయి. వక అరగంటకి విమానం లండన్ లో దిగింది. దిగాక భూమి కనిపించింది.
తమిళనాడును. సంగితనాడు అనొచ్చు. MGR లాగా సౌందరరాజన్ గొంతు గోరం.
తెలుగులో సావిత్ర,రమ్యకృష్ణ యిష్టం.
తెలుగుభాష యిష్టం. చాలా యిష్టం. చాలా చాలా యిష్టం. తెలుగు తరవాత యింగ్లిషు, మలయాళం యిష్టం.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
