30-10-00
రఘుగారికి,
నమస్తే,
నీరు విడిచిన చేపలాగా న్యూయార్క్ లో వుండి మొన్న తిరిగి వచ్చాను. statue of liberyనాకు చాలా నచ్చింది.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
20-11-00
ప్రియమైన రఘుగారికి,
నమస్తే,
దయక్రిష్టగారికి D & L పట్ల సంద్బావంలేదు. నాకు యీ విషయం పాతికేళ్ళనాడు తెలుసు.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
_ వడ్డెచండీదాస్.
తిరుపతి
[తేది లేదు 15-3-01న చేరింది]
ప్రియమైన రఘుగారికి,
నమస్కారం,
వీణానాదం యిష్టం. చాలా చాలా యిష్టం. సంగీతం రేడియోల్లోనూ cassettesలోను వింటూంటాను.
తెలుగు T.V.channelsప్రసారం చెయ్యరు. కన్నడ ఛానెల్స్ కూడా ప్రసారం చెయ్యరు. తమిళ private channels ప్రసారం చెయ్యరు . తమిళ D.D. ప్రసారం చేస్తారు. మాకిక్కడ మూడు మలయాళం చానల్స్ వొస్తాయి. ముగ్గురూ ప్రసారం చేస్తారు.
హిందీ -లతామంగేష్కర్ పాటలు వింటుంటాను. పాటలదేముంది మ్యూజిక్ డ్తెరెక్టర్లు కూర్చుతారు. ఆ గొంతు. చాలా యిష్టం. చాలా చాలా యిష్టం.
so -called music channels సంగీతం ప్రసారం చెయ్యవు. (pop music తప్ప ) zee music మాత్రం రోజూ అరగంట classical music, Hindustani and carnati ప్రసారం చేస్తుంది. (సినిమాలూ సిరియాల్సూ చూడను)
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
321మిద్దెమిద, భవాని నగర్
తిరుపతి-517501
9-4-01
రఘుగారికి,
నా తదనంతరం నా రచనలన్నిటి మిద రేవతీదేవిగారి శిలాలోలిత మిద సర్వహక్కులూ మీకు దఖలు పరుస్తున్నాను.
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
2-7-01
రఘుగారికి,
నమస్తే,
మీ వుత్తరం వొచ్చింది.
I hope your New efforts will be fruitful. And above all your Lon- don trip. I hope, will definetely be most successful and satisfactory.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
26-11-01
రఘుగారికి,
నమస్తే,
మీ దగ్గిరనుంచి వుత్తరం వొచ్చి చాలా కాలమ్తెంది. మీ యింగ్లాండ్ ప్రయాణం యెప్పుడు?
సంగీతంతో రోజు గడిచిపోతుంది. శ్రావ్యంగా వుంటే సినిమా పాటలు కూడా.
నాకు నచ్చని సంగీతం దర్శకులలో ముఖ్యులు-హిందిలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ తెలుగులో చక్రవర్తి.
తెలుగులో చిత్ర గొంతు యిష్టం. చాలా యిష్టం. చాలా చాలా యిష్టం. తెలుగు భాషలోని తియ్యదనం మార్ధవం ఆమె లేత గొంతులో వుంటాయి. మలయాళీలు వొత్తులు మధురంగా స్పుటంగా మృదువుగా పలుకుతారు.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
15-12-01
రఘుగారికి,
మీ వ్యాసం పంపిన వుత్తరం చేరింది. వెంటనే చదివి, వెంటనే జవాబు రాస్తున్నాను. మీరు వుదహరిచిన వాళ్ళందరూ నాకు తెలియకపోయినా మీ వ్యాసం నాకు అర్ధమ్తెంది. I am really & highly delighted. అద్బుతంగా వుంది.
మీ కామెంటరి అచ్చయితేనో, desire and lideration ని abandon చేస్తేనో తప్ప మీకు అర్ధమ్తెంది. I am really& highly delighted. అద్బుతంగా వుంది.
మీ కామెంటరి అచ్చయితేనో, desire and liberation చేస్తేనో తప్ప మీకు 'విముక్తి' వుండదు.
desire and liberation లోని మెళుకువలు రాసిన మాకన్నా మీకు యెక్కువగా తెలుసుననిపిస్తోంది.
Reading 'pace' చదివేప్పుడు speedspeed conformity వుండటం, తరువాత విడిచి చదవటం నాకు తెలియని విషయం. చాలా సంతోషంగా అనిపించింది నాకు.
యీ వ్యాసం తెలుగులోకి అనువాదించి అచ్చు వెస్తే బావుంటుంది.
కొన్ని అచ్చుతప్పలనుకుంటాను. మొదటి పేజిలో glitches; మూడో పేజిలో aspires, they; పదకొండో పేజిలో though; పన్నెండో పేజిలో married to women లో to NY లో వున్నప్పడే అడిగాను వాళ్ళు అశక్తత తెలియజేశారు.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్
తిరుపతి
20-01-02
రఘుగారికి ,
వ్యాసం చదివి వెంటనే మీకు వుత్తరం రాశాను. తెలుగులోకి అనువదిస్తే బావుంటుంది.
మూడేళ్ళ తరవాత తిరుపతిలో వర్షాలు కురిశాయి. భారతరత్న - యం.యస్. సుబ్బలక్ష్మికి, బోస్మిల్లా ఖాన్ కి, లతా మంగేష్కర్ కి యిచ్చినందుకు గౌరవం.
నోబెల్ ప్త్రేజ్ - D.H. లారెన్స్ కి జేమ్స్ జాయిస్ కి (శాంతికి) గాంధికి యివ్వనందుకు గౌవరం లేదు.
యిప్పటి పాటలు వినలేకపోతున్నాను. మెలోడి వొదిలేశారు. cacopho- nous. non -mellifluous గోంతులోచ్చాయి. వుదిత్ నారాయణ్ గొంతు, తెలుగు భాష మార్ధవాన్ని ఖూని చేస్తుంది.
'ఘర్షణ' లో చిత్ర పాడిన "నిన్ను కోరి" వినండి.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
