Next Page 

ముక్తేవి భారతి కథలు  పేజి 1

                                   ముక్తేవి భారతి కథలు

                                                                                      డా|| ముక్తేవి భారతి
                                                           వాన
    అనుకోకుండా మొదలైంది వాన. పక్కింటివాళ్ళ పిల్లలు, ఆ పిల్లల తల్లి, ఆవిడ మరిది, ఆ ఇంటాయన కూడా కిటికీలోంచి రోడ్డును చూస్తున్నారు. వానలో తడవటాన్ని లెక్క పెట్టేదేమిటన్నట్లు తడుస్తూ పోతున్న వాళ్ళని, ఆ వానకే మొక్క మొలుస్తామన్నట్లు ఇళ్ళపక్కన, చెట్లకింద తల దాచుకుంటున్న వాళ్ళని, బట్టలమీద వాన నీళ్ళు చిందుతాయేమోనని ముందుగానే భయపడి దిక్కుతోచకుండా పరిగెత్తే పడుచువాళ్ళని చూస్తూ నవ్వుకుంటూ, మధ్య మధ్య జాలిపడుతూ , వెక్కిరిస్తూ, విమర్శిస్తూ ఆ కిటికీలోనే అన్ని తలలూ అవతలకు జరగనీయకుండా అవస్థపడుతున్నారా ఇంటివాళ్ళు.
    వానచినుకు పడిందంటే చాలు ఇందిరకి కోపం !
    'ఎన్నాళ్ళకు వానచినుకు పడిందండి!' అంటుంది, కుంభవృష్టి కురుస్తుంటే పక్కింటావిడ అదేమిటో.
    ఇందిర కిటికీలోంచి చూచింది. 'అమ్మో ! ఆ వానచినుకులు కిటికీలోంచి ఇంట్లోపడితే!' గబుక్కున లేచి కిటికీ తలుపువేసి కూచుంది ఇందిర.
    ఒక్కసారి గదంతా పరిశీలనగా చూచుకుంది. కిటికీకి అందమైన కర్టెనులు, గోడలకి చక్కని పెయింటింగ్స్, మూలల పూలకుండీలు, ఆ పక్కగా రేడియో, దానిమీద డాన్సింగ్ డాలు, ఒక పక్కగా పేజీ కూడా తిరగెయ్యకుండా, నలగకుండా అట్టలువేసి అమర్చిన పుస్తకాల షెల్ఫు, మధ్య టేబుల్ మీద ఖరీదయిన ఆల్ బమ్. అందులో అన్నీ తన పెళ్ళినాటి అందమైన రంగు ఫోటోలు - ఫోటోలు - ఒక్కొక్క పేజీ తిప్పుతోంది ఇందిర.
    తలుపు చప్పుడవటంతో సోఫాలోంచి లేచింది.
    'రెండగ్గిపుల్లలుంటే అమ్మ ఇమ్మంది.' చిన్ని చింపిరిజుట్టు పక్కకు తోసుకుంటూ అడిగింది.
    'ఏం, మీ అన్నయ్య ఇంట్లో లేడా?'
    'ఉన్నాడండీ....కాని వానకదూ, అందుకు కొట్టుకు వెళ్ళలేదు.'
    'అవును, వాన.....' ఇందిరలేచి రెండంటే రెండే అగ్గిపుల్లలు తెచ్చి చిన్ని చేతిలో పెట్టింది. 
    'అబ్బ....ఛీ!' తడిపాదాలు గదిలో అక్కడక్కడా కనిపించాయి. ఇందిర విసుక్కుంటూ గదంతా బట్టతో వత్తింది.
    ఆఫీసునుంచి వచ్చి చాలాసేపయి గదిలో పేపరు చదువుతూ పడుకున్నాడతను.
    'వేడిగా కాఫీ తాగుదామా హాయిగా!' అతని చేతిలో పేపరు పక్కన పడేస్తూ అంది ఇందిర.
    'కాఫీ ఏమిటి....ఈ వానలో వేడిగా పెసరట్లు చేసి పెడితే!'
    'పాపం....కష్టపడతారు!' కాఫీ తాగుతూ చిన్నికిచ్చిన రెండగ్గిపుల్లలు గుర్తొచ్చి నవ్వుకుంది ఇందిర.
                                         *    *    *
    వాన నెమ్మదిగా పెద్దదయింది. అతనికి వానంటే చాలా సరదా. వానలో తడుస్తూ గుమ్మంలో నిలబడడం అతనికి ఇష్టం నిజానికి.... కానీ....
    మళ్ళా తలుపు చప్పుడవటంతో విసుక్కుంది ఇందిర.   
    'ఏం కావాలి?' కాఠిన్యంగా గొంతులో మారుమ్రోగుతొంటే ఇందిర ప్రశ్న.
    'లోపల గుమ్మంలో కూచుంటా.' తడిసిన బట్టలు, నెత్తిన నీరు కారుతూ ముసలాడు.
    'బయట నుంచున్నావు చాలదూ?' దభీమని తలుపేసింది.
    'పోనీ, రానీయకూడదూ- వాన తగ్గాక వాడే పోతాడుగా?'
    'అబ్బా.... మీకంత జాలయితే పిలిచి మీ కోట్లు కూడా రెండు కప్పండి పాపం. వాడి గుడ్డలూ వాడూ....ఛీ, చుట్ట కాల్చుకుంటూ....'
    'పాపం.... ముసలాడు కదూ!' అతను గుమ్మం తెరిచాడు. ఖాళీ గుమ్మం వెక్కిరించింది. ఒక వ్యక్తికి ఒక్క నిముషం ఆశ్రయం ఇవ్వలేడు తను! ఇందిరకేసి చూసి లోపలి కెళ్ళిపోయాడతను. ఒక్క క్షణంలో ముసలాడిని, వాననికూడా మరచిపోయి పుస్తకం చదవడంలో నిమగ్నుడైపోయాడు.
                                      *    *    *
    'తల తుడుచుకో ఈ బట్టతో.' పక్కింటి అత్తయ్యగారి గొంతు.
    'వో అగ్గిపుల్ల యియ్యి బుల్లెమ్మా, చుట్ట కాల్చుకుంటా, కాస్త ఎచ్చగా వుంటుంది....'
    'ఏం పని చేస్తావురా అబ్బీ__' ఇంటాయన ప్రశ్న.
    'కూలి పని బాబయ్యా....'
    'సరేకానీ.... తల బాగా తుడుచుకో.... మళ్ళా జలుబు చేస్తుంది.... తెల్లారితే కూలికి పోవద్దూ....'
    'వానకి తడవటం, ఎండకి ఎండటం అలవాటే తల్లీ.'
    'తాతా, అన్నం తిన్నావా?' చిన్ని చిన్న గొంతు.
    'వాన తగ్గినాక గంజి కాసుకుంటా.' 
    'మరి నీకు ఆకలెయ్యదా.... నేనయితే ఎప్పుడో తినేసా తెలుసా.... తాతా, అమ్మతో చెప్తా అన్నం పెట్టమని.... తింటావా?'
    'వద్దులే బుల్లెమ్మా.... పోతాగా కూసేపాగి!'
    'అన్నం తిని పడుకో.... పొద్దున పోదుగానిలే.'
    అన్నం తిన్నాడు ముసలాడు. విస్తరి మడుస్తూ,
    'మీలాటోళ్ళున్నారు కాబట్టి.... ప్రపంచం ఇట్లా ఉంది... అంతా ఆ పక్కింటమ్మలాటోల్లయితే....' వాడు బ్రేవున త్రేన్చి, విస్తరి వీధిలో విసిరికొట్టాడు.
                        *    *    *
    తలుపు పక్కగదిలో సోఫాలో పడుకుని సంభాషణ వింటున్న ఐశ్వర్యవంతుల ఆడబిడ్డ, ఆధునిక ఆదర్శాల ఆటపట్టు ఇందిరకి షాక్ కొట్టింది.
    వాన ఇంకా ఇంకా పెరిగిపోయింది. భూనభోంతరాళాలు ఏకం చేస్తూ కుంభవృష్టి కురిసింది. ఒక్కసారిగా ఇంట్లో దీపాలు ఆరిపోయాయి. ఆ అంధకారంలో ఒక వాస్తవం కళ్ళముందు మెరిసింది. __చిరిగిపోయిన చాప, ఆకారంలేని వంటగిన్నెలు, పాలుచాలక కక్కటిల్లే పసివాడి ఏడుపు, చిరిగినచీరతో ఆ ఇల్లాలు; బీడీ ముక్క కాలుస్తూ లోతుకుపోయిన కళ్ళతో ఇంటాయన; చింపిరిజుట్టు చిన్ని; నిరుద్యోగి మరిది....వీళ్ళు, వీళ్ళే తన పక్కవాళ్లు__ వీళ్ళుండబట్టి ప్రపంచం ఇంకా ఈ మాత్రం పచ్చగా వుందిట!
    తనుండబట్టి__
    మెట్లులేని అంతస్థునుంచి కిందపడింది ఇందిర.
    'నాన్నా, మన పొట్లపాదు బోల్డు కాయలు కాస్తుంది కదండీ__'
    'అవును తల్లీ!'
    'అవి మనం అందరికీ ఇస్తాం కదండీ నాన్న__ మన పిన్నికీ, మీ ఆఫీసులో అబ్బాయికి, మన పక్క ఇందిర అత్తయ్యగారికి__ అందరికీ ఇయ్యాలి కదండీ....' చిన్ని తియ్యని గొంతు ఇందిరని కదిలించివేస్తోందా చీకట్లో__
    గదిలో సోఫాలు, ఫోను, తన అందమైన పూలకుండీలు, తన డాన్సింగ్ డాలు, తన ఆధునికత - అవే జీవం అనుకుని నమ్మింది__ ఏమిటో అన్నీ జీవం లేకుండా ఉన్నవైనా, ఈరోజు ఒకటితో ఒకటి తనను చూసి వెక్కిరించి నవ్వుకుంటున్నాయ్, గుసగుసలు చెప్పుకుంటున్నాయి.
                                          *    *    *
    తెలతెలవారుతోంది. నిద్ర పట్టని ఇందిర కిటికీలోకి చూచింది.... వాన!
    ఇందిర కళ్ళలో నీళ్ళు నిలిచాయి__
    వాన పడుతుంటే కిటికీలో నుంచుని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకునే పిల్లలు తనకు లేరు. లేరేమిటి - తనే వద్దనుకుంది ఇంతదాకా....తన దొడ్లో పచ్చగా పెరిగిన పొట్లపాదు తనకు లేదు....
    మనిషిగా బతకటానికి కావలసిన ఒక ధర్మం....తనకు లేదు....
    ఈ వాన ఎండిన మానుల్ని చిగురిస్తుంది....
    ఈ వాన తనలో మానవత్వాన్ని....
    వానలో తడిసిన ముసలాడు కళ్ళముందు నిలిచాడు...........ఇందిర ఒణికిపోయింది.*


Next Page 

array(15) { [0]=> array(8) { ["cat_id"]=> string(4) "1765" [0]=> string(4) "1765" ["cat_name"]=> string(7) "Midunam" [1]=> string(7) "Midunam" ["thumb_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" [2]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" ["big_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" [3]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" } [1]=> array(8) { ["cat_id"]=> string(4) "1741" [0]=> string(4) "1741" ["cat_name"]=> string(20) "Prema Pelli Vidakulu" [1]=> string(20) "Prema Pelli Vidakulu" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" [2]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" [3]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" } [2]=> array(8) { ["cat_id"]=> string(4) "1739" [0]=> string(4) "1739" ["cat_name"]=> string(23) "Nari Nari Naduma Murari" [1]=> string(23) "Nari Nari Naduma Murari" ["thumb_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" [2]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" ["big_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" [3]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" } [3]=> array(8) { ["cat_id"]=> string(4) "1737" [0]=> string(4) "1737" ["cat_name"]=> string(11) "First Crush" [1]=> string(11) "First Crush" ["thumb_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" [2]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" ["big_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" [3]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" } [4]=> array(8) { ["cat_id"]=> string(4) "1731" [0]=> string(4) "1731" ["cat_name"]=> string(15) "40 Years of TDP" [1]=> string(15) "40 Years of TDP" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" [2]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" [3]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" } [5]=> array(8) { ["cat_id"]=> string(4) "1729" [0]=> string(4) "1729" ["cat_name"]=> string(23) "Vasundara Short Stories" [1]=> string(23) "Vasundara Short Stories" ["thumb_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" [2]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" ["big_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" [3]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" } [6]=> array(8) { ["cat_id"]=> string(4) "1728" [0]=> string(4) "1728" ["cat_name"]=> string(21) "Diviseema Uppena 1977" [1]=> string(21) "Diviseema Uppena 1977" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" [2]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" [3]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" } [7]=> array(8) { ["cat_id"]=> string(4) "1702" [0]=> string(4) "1702" ["cat_name"]=> string(17) "Trick Trick Trick" [1]=> string(17) "Trick Trick Trick" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" [2]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" [3]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" } [8]=> array(8) { ["cat_id"]=> string(4) "1701" [0]=> string(4) "1701" ["cat_name"]=> string(17) "Pelli Chesi Chudu" [1]=> string(17) "Pelli Chesi Chudu" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" [2]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" [3]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" } [9]=> array(8) { ["cat_id"]=> string(4) "1700" [0]=> string(4) "1700" ["cat_name"]=> string(28) "Chikati Podduna Velugu Rekha" [1]=> string(28) "Chikati Podduna Velugu Rekha" ["thumb_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" [2]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" ["big_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" [3]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" } [10]=> array(8) { ["cat_id"]=> string(4) "1699" [0]=> string(4) "1699" ["cat_name"]=> string(13) "Agni Pariksha" [1]=> string(13) "Agni Pariksha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" } [11]=> array(8) { ["cat_id"]=> string(4) "1698" [0]=> string(4) "1698" ["cat_name"]=> string(19) "D Kameswari Kathalu" [1]=> string(19) "D Kameswari Kathalu" ["thumb_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" [2]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" ["big_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" [3]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" } [12]=> array(8) { ["cat_id"]=> string(4) "1696" [0]=> string(4) "1696" ["cat_name"]=> string(13) "Cine Bethalam" [1]=> string(13) "Cine Bethalam" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" [2]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" [3]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" } [13]=> array(8) { ["cat_id"]=> string(4) "1695" [0]=> string(4) "1695" ["cat_name"]=> string(20) "Teeram Cherina Naava" [1]=> string(20) "Teeram Cherina Naava" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" [2]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" [3]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" } [14]=> array(8) { ["cat_id"]=> string(4) "1694" [0]=> string(4) "1694" ["cat_name"]=> string(13) "Intinti Kadha" [1]=> string(13) "Intinti Kadha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" } }