Next Page 

మమత పేజి 1

                                                   మమత

                                                                  - Dr Bharti muktevi

పచ్చిబాలెంత సుమతి పసివాడిని గుండెలకి హత్తుకుని గాఢ నిద్రలో వుంది.
అమ్మపాలు కడుపునిండా తాగి, అలసిపోయిన శశికాంత్ ఎర్రటి పెదవులు నిద్రలో కదులుతున్నాయి. పుట్టి నెలరోజులు కాకపోయినా ఆ పసిగుడ్డు కనుముక్కు తీరు తీర్చిదిద్దినట్టుండడం ఆశ్చర్యంగా చూస్తూ, పసివాడి లేతబుగ్గల్ని నిమిరాడు సైంటిస్ట్ రాజీవ్. సృష్టిక్రమం ఎంత చిత్రమైందో, పుట్టడం పుట్టడమే ఆకలిని ఏడుపుని తోడు తీసుకొస్తాడు ప్రాణి! రెంటినీ గెలిచినావాడెవడూ-
రాజీవ్ చటుక్కున లేచి కూర్చున్నాడు.
అరే, అదేమిటీ, నీళ్ళు.... నీళ్ళు.... గదినిండా - అయ్యో అన్ని గదుల్లో..!
కిటికీలోంచి బయటకి చూసాడు... రోడ్డంతా నీళ్ళు! ...ఎలాగ!!
"లే, లే-నీళ్ళు..."ఖంగారుగా భార్యని లేపాడు.
"అబ్బ, ఏమిటీ" నిద్రలో అటు ఒత్తిగిల్లింది సుమతి.
అలా అలా చూస్తుండగానే నీళ్ళు గడపలకి పెట్టిన ఎర్రని పట్టీలు దాకా వచ్చేసాయి.
సుమతి గబుక్కున లేచింది-
ఏం చేద్దాం... ఈ నీళ్ళు ఇలాగే పెరిగిపోతే...హమ్మో!! పసివాణ్ని గబుక్కున ఎత్తుకుని, మంచం మధ్య కూర్చుంది.
"తగ్గుతోందిలే వర్షం - కంగారుపడకు" అన్నాడు రాజీవ్. అతని గుండెల్లో భయం మూటగట్టి దాస్తూ.
హైదరాబాద్ లో ఇలాటి వరదా!- "సుమతీ - సుమతీ వెళ్ళిపోదాం లే" - రాజీవ్ పిల్లాడిని ఎత్తుకున్నాడు.
"ఎక్కడికీ..?" అంది భయంగా.
"మేడ మీదకి!" - పై పోర్షన్ లో రామం ఇంట్లోకి రాజీవ్ గబగబా నడుస్తుంటే, వరద జోరు ఎక్కువైపోయింది.
"అయ్యో ఎలాగండీ... గాడ్రెజ్ బీరువాలోకి నీళ్ళొస్తే..?"
"ఏమన్నాకానీ- ముందు ప్రాణం, తర్వాత తక్కినవి!"   
                                             *         *        *
తూర్పు రేఖలు విచ్చుకుంటున్నాయి...
మేడపై నిలబడ్డాడు రాజీవ్.
బీభత్సంగా కనిపిస్తున్న దృశ్యం! కొట్టుకొస్తున్న కార్లు, టీవీలు, సైకిళ్ళు, పెట్టెలు.
రాజీవ్ కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి. తను పైనున్నాడు కాబట్టి బతికిపోయాడు. ఎన్ని గుడిసెలు కొట్టుకుపోయాయో, మరెన్ని ఇళ్ళు కూలిపోయాయో! ఎందరు వరదలో కలిసిపోయారో!! ఎందుకు కోపమొచ్చింది ప్రకృతికి!! మానవుడిపై అసహ్యమేసి, వీడి రోగం ఇంకా కుదర్చాలనుకుందా?!
రాజీవ్ పెదాలపై చిన్న నవ్వు!! - లాతూర్ భూకంపం!! బాబోయ్ - ప్రకృతి విలయతాండవం- ఒకవిధంగా ఇదే! సృష్టి స్థితి లయల్లో మూడోది!!
ఒక్కసారి విషాదంలో రాజీవ్ మనసు పసిగుడ్డు శశికాంత్ వైపుకి మళ్ళింది.
'ఈ ప్రకృతి వైపరీత్యాలనుంచి నా పిల్లవాడిని రక్షించు తండ్రీ!' అప్రయత్నంగా ఎదురుగా కనిపిస్తున్న సూర్యుడికి నమస్కారం పెట్టాడు.
ఎర్రగా ఎండెక్కింది... ఇంట్లో అడుగుపెట్టాలంటే భయంగా వుంది సుమతికి. ఎక్కడ చూసినా గోడలన్నీ తడిసిపోయాయి. తన పుస్తకాల షెల్ఫ్ లో రెండు వరసలు ముద్దలు ముద్దలై కన్నీరు కాల్వలైనట్లుగా నీళ్ళోడుతున్నాయి... వీధి గుమ్మం తలుపు తీయాలంటే భయంగా ఉంది. ఎంత చెత్తా చెదారం కొట్టుకొచ్చిందో..!!
ఒళ్ళో పిల్లాడు అటూఇటూ కదులుతున్నాడు. రాజీవ్ పైజమా మోకాళ్ళ పైకి మడిచి నెమ్మదిగా తలుపు తీసాడు... ఇలా తలుపు తీయటం, అలా ఉలిక్కిపడి వెనక్కి అడుగేశాడు.
'సుమతీ...' పెద్దగా కేక పెట్టాడు.
పిల్లాడిని మంచంమీద పడుకోబెట్టి ఒక్క ఉదుటున పరిగెత్తుకుంటూ వచ్చింది సుమతి.
"అటు చూడు!" రాజీవ్ కన్నార్పకుండా చూస్తున్నాడు.
సుమతి నోట మాటరాలేదు. నిశ్చేష్టురాలైపోయింది.
"బాబోయ్..!" అంది మరుక్షణంలో.
కొద్దిగా కదలిక వుంది, కళ్ళు చిట్లించింది, నల్లని జుత్తు.... ఒంటిపై పాత జుబ్బా భార్యా భర్త ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
మళ్ళీ వర్షం మొదలైంది. సుమతి అలాగే నిలబడింది.
కదులుతూ, కదులుతూ, అలా మెట్ల పక్కకి చేరింది. పడిపోతే! రాజీవ్ గబుక్కున వెళ్ళి ఎత్తుకున్నాడు. నెలలోపు! అప్రయత్నంగా కళ్ళల్లో తిరిగిన నీళ్ళు ఆపుకోలేకపోయాడు.
సుమతి లోపల గదిలోకొచ్చి కూలబడిపోయింది! ఏం చేయాలిప్పుడు?
- నీళ్ళలో కొట్టుకొచ్చింది కాదు, అలా కొట్టుకొస్తే ఈపాటికి ప్రాణాలు పోయేవే!! మరి ఎవరు ఇక్కడ వదిలి వెళ్ళిపోయారు?! సుమతి భయంతో వణికిపోయింది.
రాజీవ్ గబగబా లోపలికొచ్చాడు... తువ్వాలుతో ఒళ్ళంతా తుడిచాడు. శశికాంత్ చొక్కా - కాస్త పెద్దది.. గబగబా తొడిగాడు. చేతులెందుకో వణుకుతున్నాయి!! తడిసి జుట్టు మళ్ళీమళ్ళీ తుడిచాడు.
సుమతి అలాగే చూస్తోంది...
ఒక్క క్షణం అయింది. గుక్క పెట్టి ఏడుస్తోంది- ఆమూడు నెలల పసికూన..!
ఏం చేయాలి... ఆకలి... ఎలా తీర్చాలీ!!
ఎదురుగా సుమతి కళ్ళప్పగించి చూస్తోంది. పిల్ల ఏడుపు పెరిగిపోతోంది.
మరో సందు చివర వదిలేస్తే!!
సుమతి ఆ పిల్లవంక చూస్తోంది.... వేలు నోట్లో పెట్టుకు చప్పరిస్తోంది... నల్లని చిన్న కళ్ళు మెరుస్తున్నాయి!! రాజీవ్ చేతుల్లో ఆగటంలేదు.
క్షణంలో మళ్ళీ ఏడుపు... ఆ ఏడుపు చూస్తే భయమేసింది రాజీవ్ కి.
పచ్చి బాలింత సుమతి వైపు చూసాడు.... పసివాడు శశికాంత్ తల్లి దగ్గర పాలెక్కువ తాగేసి కక్కేసిన దృశ్యం కళ్ళముందు కదిలింది. పల్చటి బాలెంత చెక్కిళ్ళు మెరుస్తున్నాయి....ఎత్తైన వక్షోజాలు, బరువైన వక్షోజాలు... చీర కొంగుచాటున దాగలేక పోతున్నాయి.....రాజీవ్ చూపులు సుమతి పమిట లోపలికెళ్ళిపోయాయి. సుమతి కళ్ళలోకి చూసాడు పమిటవైపు చూసాడు.... చేతిలో పిల్ల గొంతు పెంచి కక్కటిల్లిపోయింది.
రాజీవ్ గబుక్కున లేచాడు - క్షణంలో సుమతి ఒళ్ళో పిల్ల!!
"ఛీ..." పక్కన పెట్టేసింది పిల్లని!!
రాజీవ్ గుండె ఆగినంత పనైంది.
"సుమతీ, నువ్వు తల్లివి..! ఈ పసిగుడ్డు..."
"ఛీ, మాట్లాడకండి... ఆ సందు చివర వదిలేసి రండి - నేను పాలివ్వాలా, మీకు పిచ్చిపట్టిందా?" సుమతి పమిట నిండుగా కప్పుకుంది.
పిల్ల ఏడుపు పెరిగిపోతోంది. ఏడ్చి ఏడ్చి పిల్ల చచ్చిపోతే!!
రాజీవ్ ఆ పసిగుడ్డుని సుమతి ఒళ్ళో పెట్టాడు. కప్పుకున్న పమిట తీసిపారేశాడు. పసిగుడ్డు పాలకోసం తడుముకుంటోంది...రాజీవ్ ఇక ఆగలేకపోయాడు!! సుమతి జాకెట్టు సర్రున చించేశాడు. పసిగుడ్డు సుమతి గుండెల్ని కరుచుకుంది... పాలు ధారలై పొర్లిపోయాయి.
గబగబా గుటకలు గుటకలు మింగేస్తూ, పసిగుడ్డు క్షణాల్లో తేరుకుంది... నల్లని కనుగుడ్లు కదిపింది.
సుమతి అచేతనంగా చూస్తోంది. పసిగుడ్డు పాలు తాగుతుంటే అప్రయత్నంగా ఆ పిల్ల జుట్టు నిమిరింది.
పొట్టనిండా పాలు తాగిన పిల్ల క్షణాల్లో నిద్రపోయింది.
"నేను రాక్షసుణ్ణి కాదు సుమతీ, మనిషిని - ఓ పసికూనని బతికించావ్ - నీ జన్మ ధన్యమైపోయింది - సుమతీ, నన్ను క్షమించు!"
సుమతి మాట్లాడలేదు. ఓ చాప తెచ్చి పిల్లని పడుకోబెట్టింది. రాజీవ్ దీర్ఘంగా నిట్టూర్చాడు!!
పేపర్ల నిండా ఇవే విశేషాలు, ఇవే ఫోటోలు!! వరదలో కొట్టుకొచ్చిన శవాలు! కళ్ళు మూసుకున్నాడు రాజీవ్!!
శశికాంత్ కు పాలిస్తూ, నీళ్ళు నిండిన కళ్ళు తుడుచుకుంది సుమతి....'భగవంతుడు తనకెందుకింత పెద్ద శిక్ష విధించాడు!! ఈ పిల్లని తను పెంచాలా!!'
"...ఇదిగో - ఈ పిల్లని ఎక్కడ దింపుతారో మీ యిష్టం, ఒక్క గంట టైమిస్తున్నానంతే!" సుమతి మంచంమీద పడుకుని భర్త రాజీవ్ వైపు చూస్తూ అంది.
"అంటే...?"
"అదే - పోలీసు స్టేషన్ లోనో, అనాధ శరణాలయంలోనో, లేకపోతే చెత్తకుండీలోనో - మీ యిష్టం!" అంది సుమతి పళ్ళు కొరుకుతూ.


Next Page 

array(15) { [0]=> array(8) { ["cat_id"]=> string(4) "1765" [0]=> string(4) "1765" ["cat_name"]=> string(7) "Midunam" [1]=> string(7) "Midunam" ["thumb_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" [2]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" ["big_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" [3]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" } [1]=> array(8) { ["cat_id"]=> string(4) "1741" [0]=> string(4) "1741" ["cat_name"]=> string(20) "Prema Pelli Vidakulu" [1]=> string(20) "Prema Pelli Vidakulu" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" [2]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" [3]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" } [2]=> array(8) { ["cat_id"]=> string(4) "1739" [0]=> string(4) "1739" ["cat_name"]=> string(23) "Nari Nari Naduma Murari" [1]=> string(23) "Nari Nari Naduma Murari" ["thumb_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" [2]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" ["big_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" [3]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" } [3]=> array(8) { ["cat_id"]=> string(4) "1737" [0]=> string(4) "1737" ["cat_name"]=> string(11) "First Crush" [1]=> string(11) "First Crush" ["thumb_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" [2]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" ["big_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" [3]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" } [4]=> array(8) { ["cat_id"]=> string(4) "1731" [0]=> string(4) "1731" ["cat_name"]=> string(15) "40 Years of TDP" [1]=> string(15) "40 Years of TDP" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" [2]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" [3]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" } [5]=> array(8) { ["cat_id"]=> string(4) "1729" [0]=> string(4) "1729" ["cat_name"]=> string(23) "Vasundara Short Stories" [1]=> string(23) "Vasundara Short Stories" ["thumb_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" [2]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" ["big_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" [3]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" } [6]=> array(8) { ["cat_id"]=> string(4) "1728" [0]=> string(4) "1728" ["cat_name"]=> string(21) "Diviseema Uppena 1977" [1]=> string(21) "Diviseema Uppena 1977" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" [2]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" [3]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" } [7]=> array(8) { ["cat_id"]=> string(4) "1702" [0]=> string(4) "1702" ["cat_name"]=> string(17) "Trick Trick Trick" [1]=> string(17) "Trick Trick Trick" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" [2]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" [3]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" } [8]=> array(8) { ["cat_id"]=> string(4) "1701" [0]=> string(4) "1701" ["cat_name"]=> string(17) "Pelli Chesi Chudu" [1]=> string(17) "Pelli Chesi Chudu" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" [2]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" [3]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" } [9]=> array(8) { ["cat_id"]=> string(4) "1700" [0]=> string(4) "1700" ["cat_name"]=> string(28) "Chikati Podduna Velugu Rekha" [1]=> string(28) "Chikati Podduna Velugu Rekha" ["thumb_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" [2]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" ["big_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" [3]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" } [10]=> array(8) { ["cat_id"]=> string(4) "1699" [0]=> string(4) "1699" ["cat_name"]=> string(13) "Agni Pariksha" [1]=> string(13) "Agni Pariksha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" } [11]=> array(8) { ["cat_id"]=> string(4) "1698" [0]=> string(4) "1698" ["cat_name"]=> string(19) "D Kameswari Kathalu" [1]=> string(19) "D Kameswari Kathalu" ["thumb_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" [2]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" ["big_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" [3]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" } [12]=> array(8) { ["cat_id"]=> string(4) "1696" [0]=> string(4) "1696" ["cat_name"]=> string(13) "Cine Bethalam" [1]=> string(13) "Cine Bethalam" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" [2]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" [3]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" } [13]=> array(8) { ["cat_id"]=> string(4) "1695" [0]=> string(4) "1695" ["cat_name"]=> string(20) "Teeram Cherina Naava" [1]=> string(20) "Teeram Cherina Naava" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" [2]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" [3]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" } [14]=> array(8) { ["cat_id"]=> string(4) "1694" [0]=> string(4) "1694" ["cat_name"]=> string(13) "Intinti Kadha" [1]=> string(13) "Intinti Kadha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" } }