Next Page 

మొగుడే కావాలా? పేజి 1


                             మొగుడే కావాలా?
    

                                                                               -చందు సోంబాబు


                                     


    వెండి వెన్నెల భూదేవిని మత్తుగా కౌగలించుకొని చల్లని పిల్లగాలిని తోడుగా చేసుకొని ప్రకృతిని మైమరపింపచేస్తోన్న మత్తయిన వేళ.


    ఆకాశంనించి మంచు బిందువులు మంచి ముత్యాల్లా కురుస్తోన్న సొగసైన వేళ -


    ఎక్కడో కొమ్మల చాటునించి తుళ్ళిపడిన కోయిలమ్మ "కుహూ"మని ఆదమరిచి కూసిన మధురమైన వేళ


    యూనివర్శిటీ ఆడపిల్లల హాస్టల్లో తోచనట్టుగా వెలుగుతోంది దీపం.


    సమయం రాత్రి పదకొండు గంటలు దాటికొన్ని చిల్లర నిమిషాలు గడిచినాయి.


    మంచంపైన బోర్లా పడుకొని రెండు అరచేతులని గెడ్డం క్రింద పెట్టుకొని మోకాళ్ళని వెనక్కి మడిచి ఇండియన్ పీనల్ కోడ్ ని దీక్షగా చదువుతోంది మిస్ అవంతి.


    మోకాళ్ళవరకు ఆమె కట్టుకొన్న చీర, ఆ చీరకింద లంగా తొంగి నున్నని ఆమె కాళ్ళపిక్కలు రేడియం కోటెక్ అరటి బోదుల్లా ఉన్నాయి.


    ఆమె మెడలోంని లోనెక్ జాకెట్ లోకి జారిన ఒంటిపేట బంగారపు గొలుసు రెండు వక్షోజాల మధ్య చిక్కుకొని ఆ లోయలోంచి విద్యుల్లతలా తళ తళ లాడుతోంది.


    రెండో మంచంపైన పడుకొని అప్పటివరకూ అవంతిని పరీక్షగా చూస్తోన్న రమణి.


    "ఏమిటే అంత దీక్షగా చదువుతున్నావు?" అని అడిగింది.


    అవంతి తలతిప్పి రమణికేసి చూసింది.


    "సెక్షన్ 375 ఐ.పి.సి" అంది అవంతి.


    రమణి రమణీయంగా నవ్వింది.


    "రేప్ గురించా? ఆ సెక్షన్ ని అంత సీరియస్ గా చదవడం దేనికి?" రమణి ప్రశ్నకి అవంతి మెత్తగా నవ్వింది.


    "ఈ మధ్య మగ మహారాజులు ఎక్కువగా నేరం చేస్తోంది ఈ సెక్షన్ కిందేగా! రేపు డిగ్రీ పుచ్చుకొన్నాక ఈ కేసులు తప్పితే మరోకేసులు దొరకవు!" అంది.


    "ఆడదానివి అలాంటి కేసు వొప్పుకోవడానికి సిగ్గేయదు?" అంది రమణి.


    "ఏం మగాళ్ళకి లేని సిగ్గు ఆడదానికెందుకట? ఇది వృత్తిధర్మం అవుతుంది. తప్పేంలేదు."


    "కాదనను. సమాజంలో ఆడదానికి జరుగుతోన్న దారుణమైన అన్యాయం మానభంగం. ఆ అన్యాయాన్ని అరికట్టడానికి, నేరాన్ని రుజువుచేయడానికి ప్రాసిక్యూషన్ నిలబడుతోంటే ఆడదాన్ని మానభంగం చేసిన దోషిని నిరపరాధిగా నిరూపించడానికి డిఫెన్స్ కి వెళ్ళడం సాటి ఆడదాన్ని అవమానం చేయడం కాదా?" రమణి ఆవేశంగా అడిగింది.


    "నేను స్త్రీ ద్వేషిని కాదు మగాళ్ళంటేనే నాకు పరమరోత. ఆడవాళ్ళ సమస్యల పట్ల సానుభూతి నాకెప్పుడూ ఉంది. మగాళ్ళపైన విరుచుకొని పడాలన్నదే నా జీవితలక్ష్యం. అలాగని వృత్తిధర్మాన్న మర్చిపోకూడదు. నాకు డబ్బు సంపాదించాలనే కోరిక, సొంత ఇల్లు కొనాలనే ఆరాటం, కారు కావాలనే ఆశ..... ఇవన్నీ నాలో జీర్ణించుకొని పోయినాయి.


    రమణి లేచి కూర్చొంది ఆ కూర్చోడంలో పమిట జారి పడింది.


    "ఎందుకే నీ కింత డబ్బు పిచ్చి!"


    అవంతి కాట్ పైన చేవాల్న లేచి కూర్చుంది. ఆమె దుడుకుగా లేవడంతో పమిటచెంగు జారిపోయింది. బ్రాసరీ వేసుకోకుండా వేసుకున్న లోనెక్ జాకెట్లోంచి బయటికి జారుతోన్న ఆమె బంగారు బంతుల్లాంటి గుండెలు కుబేరుడి ధనాగారంలా నిండుగా ఉన్నాయి.


     "నాకు డబ్బుపిచ్చి లేని మనిషి నొకర్ని చూపించు. నీకు మాత్రం అవసరంలేదా డబ్బు? ఆ డబ్బుకోసం నువ్వు, నేనూ, ఏం చేస్తున్నామో తెలిసిన నువ్వే ఈ ప్రశ్న వేయడం సిల్లీగా వుంది" అంది అవంతి.


    అవంతి మాటలకి రమణి తలొంచుకొంది.


    రమణి చిన్నబోవడం చూసి అవంతి ఆవేశాన్ని తగ్గించుకొని అనునయంగా అంది.


    "రమణి నేను బీద కుటుంబంలో పుట్టాను. దరిద్రంలో పెరిగాను. చిన్నతనంనుంచీ కూడా లేమి ఎన్నో అవమానాలకి గురిచేసింది. అందుకే ఈ సమాజమంటె వెగటు కలిగిన వగరైన ఆడపిల్లని నేను.


    నీకు తెలీదు.


    మా అమ్మకి జబ్బుచేస్తే మంచి మందులు కొనలేక ఆనాడు మా నాన్న అమ్మని పోగొట్టుకున్నాడు. ముప్పై అయిదేళ్ళుగా కోర్టు వరండాల్లో ప్లీడర్ల ఫైళ్ళు మోయలేక మోస్తు వీసమెత్తు పెరగని ప్లీడరు గుమస్తా నా తండ్రి. ఆయన్ని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. ఆయనకున్న ఆస్తికేవలం నేనొక్కదాన్ని. స్థితీ, స్తోమతా లేకపోయినా నన్నో ఉన్నత స్థానంలో నిలబెట్టాలని అడ్వకేటుగా కోర్టుహాలులో నన్ను చూడాలనీ కలలు కనే ఆ ముసలి ప్లీడరు గుమస్తాని చూసి నేనిలా రాటు దేలాను!" అవంతి కళ్ళల్లో నీరు సుడులై తిరిగింది.


    కన్నతండ్రి గుర్తుకొస్తే ఆమె మనసు తల్లడిల్లిపోతుంది. తల్లి పరమసాధ్వి. అలాంటి సాధ్వి కడుపున పుట్టికూడా ముందు జీవితానికి బంగారుబాట వేసుకోడానికి ముళ్ళకంపపైన కాలువేసింది. అది ముళ్ళకంపని తెలీని అజ్ఞాని కాదు అవంతి.


    అవసరం అలాంటిది. అవంతిలాంటి ఆడది ఏ పరిస్థితిలో అలా చేసిందో మంచి మనసుతో ఆలోచిస్తే అది తప్పుగా అనిపించకపోవచ్చు.


    దరిద్రం వెంటాడితే బ్రతుకే లేదు. అందుకే సాలెగూడని తెలిసినా అడుగేసింది. భవిష్యత్తులో సుఖపడాలనే అభిమతంతో. తన తరవాత తరంకూడా డబ్బుతో మునిగి తేలాలన్న పట్టుదలతో తనో ఆడదానినన్న విజ్ఞతని మరిచిపోయింది అవంతి.


Next Page 

WRITERS
PUBLICATIONS