Next Page 
వసంతం పేజి 1

 

                                 వసంతం
                                             --ఇచ్ఛాపురపు జగన్నాధరావు

                    


                                         1

    "లేవయ్యా! ఆరున్నర దాటిపోయింది..."
    కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నాడు గోపాలం మీదని ఎండ పడుతోంది. ఎదురుగా లారీ స్టార్డు చేసి రొద చేస్తున్నారు. లోపల రేడియో పెద్ద వాల్యూమ్ లో సంగీతం భక్తి రసంతో కలిపి అందిస్తోంది.
    వీటన్నిటికీ తెలివిరాని తనకి ఆమె పిలుపుకి ఒక్కసారి తెలివి వచ్చిందని గ్రహించని గోపాలం లోపలికి వెళ్ళి టూత్ బ్రష్ తీసుకుని పెరట్లోకి వెళ్ళేడు."సుప్రభాతం చిన్నాన్నా!"
    ఒక గన్నేరుపువ్వూ, రెండు మామిడాకులూ పట్టుకొని నవ్వుతూ నిలబడ్డాడు బాబు.
    "ఒరేయ్ ఈ చిన్న వయస్సులో ఆ పెద్ద మాట ఎవరు నేర్పార్రా?"
    "మాష్టారు. మనం "గుడ్ మార్నింగ్" అని అనడం తప్పుట సుప్రభాతం అనడంరైటుట...అది సరేకాని బాబయ్యా - రాత్రి సినిమాకి నువ్వొక్కడీవే వెళ్ళిపోయావేం? .... నాతో అబద్ధం చెప్పావు ఏం?"
    బుంగమూతి పెట్టి అడిగాడు ఏడేళ్ళ బాబు.
    సినీమాకు పోలేదురా బ్రదర్ ! పనిమీద వెళ్ళేను"
    "అసత్యమాడరాదు"
    "పెద్దలను గౌరవించవలెను"    
    ఏం చెప్పడం అని అలోచిస్తున్న బాబు ఆలోచనలకి లోపలినించి వొచ్చిన లలిత అంత రాయం కలిగించి. ఒరేయ్! బాబయ్య కాఫీ తాగేక తరగతి పాఠాలు వొప్పచెపుతాడు కాని. లోపలికి పద. అన్నం తిందూగాని" అంది.
    ఇద్దరూ ఆమె వెనకాలే లోపలికి నడిచారు.
    "అన్నయ్య ఎన్ని గంటలకి వస్తాడు వదినా?"
    "తెలీదు గోపాలం! భోజనానికి రావొచ్చు."
    వంటింటి గడప మీద కూర్చుని కాఫీ తాగుతూ. "రాత్రి ఆలస్యంగా వచ్చాను ఒదినా....నీకు కోపం ఒచ్చినట్టుంది" అన్నాడు గోపాలం.
    "ఒచ్చింది. నిజమే కాని. ఇప్పుడు పోయిం దిలే, అసలు నీకు ఉలాటివి అడిగే అదను మహబాగా తెల్సును గోపాలం!" అంది లలిత నవ్వతూ.
    అలాగే ఉద్యోగాలిచ్చేవాళ్ళ సంగతీ తెలిస్తే బాగుండును...." కొంచెం విచారంగా అన్నాడు గోపాలం.
    "తెలుస్తుందిలే గోపాలం.... ఆ రోజూ వచ్చి ఉద్యోగం పెళ్ళికూతురిలాగ నిన్నే వెతుక్కుంటూ వొస్తుంది- పెళ్ళికూతురంటే జ్ఞాపకం వొచ్చింది. నిన్న శశిరేఖ కనిపించింది. ఈ మధ్య నీ దర్శనమే అవలేదని వాపోయింది. అదేమయ్యా? అక్కడికి వెళ్ళలేదూ"
    "లేదు వొదినా....ఇవేళో, రేపో, వెడతాను. ఈ మధ్య అంతా తిరగడమే సరిపోయింది..."
    "బలే వాడివిలే. పెళ్ళికి ముందే ఇలాగ ఐతే వెళ్ళి తరవాత ఎలాగ ఉంటావు...నువ్వే స్వయంగా వరించిన అమ్మాయికూడా!"
    "వెడతాను వొదినా..."
    "ఇంకొంచెం కాఫీ కావాలా?"
    కాఫీ తాగి వీధిగదిలోకి వొచ్చి కూర్చుని రేడియో కట్టేసి పేపరు తీసుకుని చదవసాగేడు గోపాలం- పేపరంటే ముందర వాంటెడ్ కాలమ్స్. ఏదీ మంచిది ఉద్యోగం ప్రకటించలేదు...
    "మంచి ఉద్యోగాలైతే ప్రకటించనే ప్రకటించరు" అన్త్న్ది శశిరేఖ. అదీ నిజమే.
    కాని ప్రకటించని ఉద్యోగాలని గురించి తనకి తెలీనే తెలీదు. ఇదొక విషవలయం ఐపోయింది అనుకున్నాడు గోపాలం.
    "పేపర్లో విషేషాలేమిటి బాబయ్యా!"
    "నువ్వు ఆలస్యంగా వెడితే గేటవతల నిలబెడతారు మాస్టారు"
    "అలాగ అందులో ఉందా?"
    "ఆఁ..................."
    ఇంతలోనే లోపల్నించి లలిత కేకవిని తొందరగా పుస్తకాలుపట్టుకుని బడికి పరిగెట్టేడు బాబు.
    అరగంట పేపరు చూస్తూ గడిపేశాడు గోపాలం. తరవాత స్నానంచేసి బట్టలు వేసుకుని, "అలాగ తిరిగివొస్తాను వొదినా!" అని వొంటింటిలోకి కేకవేశాడు.
    "ఆ ఎలెక్ట్రిసిటీ బిల్లుకిడబ్బుకట్టేసి మరీ తిరుగు" అంది వంట మధ్యలో లలిత.
    కాగితాలు తీసుకుని బయటికి నడిచేడు గోపాలం.
    
                               *    *    *

    బయట బాగా వేడిగా ఉంది. ఇంకా ఎనిమిదే ఐనా. కాఫీ తాగి పోవొచ్చునని ఊటీ హోటల్లోకి నడిచాడు గోపాలం. రెండు ఇడ్లీ తిని కాఫీ తాగు తూంటే "హల్లో, గోపాల్!" అని కేక వినిపించి చుట్టూ చూశాడు.
    ఒక మూలనించి రాజశేఖరం తనవేపువచ్చి బుజం మీద చెయ్యివేసి, "నువ్వా కాదా అని ఆలోచించేను రెండు నిమిషాలు బ్రదర్ మారి పోయావు నువ్వు రా...."
    గోపాలం తాను తాగుతూన్న కాఫీ ఒదిలేసి రాజశేఖరం కూర్చున్న టేబిల్ దగ్గరకి నడిచేడు.
    అక్కడ విశ్వనాథం. శ్రీనివాసూ కూర్చుని సిగరెటు కాలుస్తున్నారు. విశ్వనాధం ఇంజనీరింగ్ స్టూడెంటు.... గోపాలానికి కొంచెం తెలుసును, శ్రీనివాసుని "కాంటినెంటల్ ప్రాడక్ట్స్ వాళ్ళ పర్చేజింగ్ ఆఫీసర్" అని పరిచయం చేశాడు శేఖర్.
    పరస్పరం పలకరింపులయాక. "ఏం చేస్తున్నావు బ్రదర్?" అన్నాడు శేఖరం.
    "ఉద్యోగంకోసం చూస్తున్నాను" అన్నాడు కొంచెం కష్టంగా గోపాలం. రాజశేఖరం వేసుకున్న టెరిలిన్ షర్టూ, కాలుస్తున్న గోల్డ్ ఫ్లేక్ సిగరెట్టూ తనని తన పరిస్థితిని వెక్కిరిస్తోన్నట్టని పించింది- ఆ క్షణంలో.    
    "ఆఁ...భోజనం చేసి పడుకున్నారు. మళ్ళా రాత్రి డ్యూటీలు ఏం ఉద్యోగమో. ఏం బ్రతుకో బాబు ఒచ్చేవేళయింది. ఉంటావా? అన్నం తింటావా?"
    అంతలో బాబు రానే ఒచ్చేడు.
    భోజనం చేసి చాపమీద పడుకున్నాడు గోపాలం. వెయ్యి ఆలోచనల్లో నిద్రపట్టేసింది.
    
                                    2

    శశిరేఖ నిద్రపోదామని చాలాప్రయత్నం చేసింది. బయట ఎంత ఎండగాఉన్నా, ఆ ఇంట్లో సముద్రపు గాలి రావడాన్ని చాలా చల్లగా ఉంటుంది. పరీక్షలై పోయాక రోజుకి పద్దెనిమిది గంటలు నిద్రపోదామని నిర్ణయించుకున్న శశిరేఖ ఇవేళ ఎంత ప్రయత్నించినా నిద్రపోలేకపోయింది.
    పుస్తకం తీసుకుంది చదివేప్రయత్నంలో.
    రెండు పేజీలు  చదివేసరికి విసుగుపుట్టి ఒదిలి పెట్టి లేచి కిటికీ దగ్గర నిలబడింది.
    ...గోపాలం వచ్చి పదిరోజులైపోయింది...
    ఎంత దాచినా, ఎంత అణగదోక్కినా ఆమాట పదేపదే ఆలోచనల్లోకి వస్తూంది. హైదరాబాదు నించి అతను వొచ్చి నాలుగురోజులైపోయింది.  కాని అతను ఇక్కడికి రానేలేదు.
    నాలుగేళ్ళ పరిచయంలో ఇన్నాళ్ళు తాను కలుసుకోకుండా ఉండడం ఇదే మొదటిసారి.
    ఏమిటి కారణం?
    క్రిందటిసారి అతను వొచ్చినప్పుడు ఏమీ సూచనగానైనా అతినిమాటల్లో, ప్రవర్తనలో ఉద్యోగం గురించి బాధ తనకి చాలా కనిపించింది. ఆ బాధ ఈ రెండుమూడు నెలల్లోనూ ఎక్కువ ఔతూ వొచ్చిన విషయం తాను గ్రహించింది. కానీ... ఆ బాధలోనే ఆ ఆవేదనలోనే తన అవసరం అతనికి ఎక్కువ కావలసింది...అతని భవనాలకీ, అతని ఆనందాలకీ అవతల ఉండే అలవాటు తమ పరిచయం తరవాత కాదు తనకి...
    తమ హృదయాలు విప్పి చెప్పుకున్న రెండు జీవాలు తమని! పరస్పరం ఏ తెరలూ లేకుండా నిష్కల్మషంగా భావాలని వ్యక్తపరచుకున్న మనస్సులు తమవి...
    అతనెందుకు రాలేదు?
    నిన్న అనుకుంది తానే వెళ్ళాలని.... అతని ఇంటికి తాను వెళ్ళడం ఇది మొదటిసారికాదు. కాని ఏదో తనలో కలిగినబాధ ఆమెని వెళ్ళనివ్వలేదు లలిత కనిపిస్తే, అనుకోకుండానే ప్రయత్నించకుండానే తన మాటలు. ఆ మాటల్లో బాధ. వొచ్చేశాయి బయటికి... లలిత అర్ధం చేసుకునే మనిషి....


    మూడేళ్ళ కిందట...
    అతను ఫోర్త్ అవర్స్ లో ఉండేవాడు....ఎకనామిక్స్ లో తాను థర్డ్ అవర్స్ లో జాయిన్ అయిన వారం రోజుల్లోనే అనుకోకుండా అతని పరిచయం ఐంది- తన స్నేహితురాలిద్వారా. ఆ రోజుల్లో అతను కథలు తరచూ రాస్తూ ఉండే వాడు. అవి అంతకు ముందునుంచీ తనకి చాలా బాగుండేవి. అవి రాసే మనిషి అంత తక్కువ వయస్సులో ఉంటాడని కాని. అంత నిగర్విగా ఉంటాడనికాని ఆమె అనుకోలేదు. హఠాత్తుగా అతని పరిచయం చేసుకున్నాక. "మీరేనా?" అంది తాను.
    "అవునండీ- కాని. ఈవిడ మాటలు వినకండి. ఐదో పదో కథలు అచ్చుఐతే రచయిత అయిపోడు మనిషి..." అన్నాడు గోపాలం.
    "మీ కథలన్నీ చదివేను నేను..."
    అంది శశిరేఖ అనేక ఆలోచనల్లో ఆ మాటా ఈ మాటా అయాక తెలిసింది అతను తమవీధిలోనే ఉంటున్నాడనీ. రూము తీసుకుని హోటల్లో భోజనం చేస్తున్నాడనీ.
    "హాస్టలులో చేరలేకపోయారా?"
    "సీటు దొరకలేదు- దొరికినా, ఆ పాకల్లో ఉండడం ఇష్టం లేదు." అన్నాడతను.
    ఆ రాత్రి అన్నంతింటూ శశిరేఖ. "కిందటి నెల కథ చదివావు జ్ఞాపకం ఉందా అమ్మా చాలా మెచ్చుకున్నావు?" అని అడిగింది.    
    కొంచెం ఆలోచించు. "ఆ మేఘాల కథా?" అని అడిగింది అమ్మ.
    "ఆఁ! అదె అది రాసిన అతను మా యూనివర్సిటీలో చదువుతున్నాడు.... ఇవేళ వసుంధరతోఉండగా పరిచయంచేసింది" అంది శశిరేఖ.
    "కాలేజీలోనా?- అంత చిన్నవాడా?" అంది అమ్మ.
    "ఆఁ... అతను ఉండడం ఈ వీధిలోనే...అవతల ఎర్రమేడలేదూ? అందులో గది తీసుకుని ఉంటున్నాడు" అన్నది శశిరేఖ.
    ఆ తర్వాత వారంరోజులు అతను కనిపించలేదు. ఒక రోజు తాను లైబ్రరీలోపలికి వెడుతూంటే అతను బయటికి వొస్తున్నాడు.
    "హల్లో!" అన్నది శశిరేఖ.
    "నమస్తే!" అన్నాడతను.
    ఏం మాట్లాడాలో తెలియక ఇద్దరూ మెట్లమీద అలాగే నిలబడ్డారు.
    చివరకి అతనే. "చాలాకాలం ఐపోయింది మిమ్మల్ని చూసి.... కులాసాగా వున్నారా?..." అన్నాడు.
    నవ్వు ఆపుకోలేకపోయింది శశిరేఖ "ఆ మాటే నేనూ అడుగుదామని అనుకున్నాను..." అంది.
    "ఆఁ మూడురోజులు ఊరికి వెళ్లాను. మా అన్నయ్యని చూడ్డానికి ఏలూరు. వొచ్చాక..."
    లైబ్రరీకి వెడుతూ. వొస్తూవున్న విద్యార్ధులు వాళ్ళవంక తేరిపార చూడడం గమనించేడు గోపాలం. ఆ విషయం శశిరేఖ కూడా గమనించింది.
    "-పదండి కాఫీ తాగుదాం" అంది. ఆలోచించకుండానే తఃనకి కాఫీ కావాలని కాదు: కాని, ఆ విద్యార్ధుల చూపులో ఏదో చిన్నతనం అనిపించింది. తనని చూసి నవ్వుతోన్నట్టు ఆ క్షణంలో తన ఓటమిని అంగీకరించి తానేదో తప్పుచేసినట్టు తప్పుకోవడం ఆమె భరించలేక పోయింది.
    నిశ్శబ్దంగా రెండు నిమిషాలు నడిచేక "సారీ....ఆలోచించకుండా మిమ్మల్ని అక్కడ నిలబెట్టేను. మనకింకా అంత నాగరికం లేదను కుంటాను" అన్నాడు.
    ఏం అనాలో బోధపడలేదు శశిరేఖకి. తొందరలో కోపంతో నిశ్చయించిందేగాని కాంటెన్ కి వెళ్ళి అతనితో కాఫీ తాగడం అంటే ఆమెకి బెరుకుగానే వుంది.
    ఆమె నిశ్శబ్దం గమనించి "చూడండి మీరొకరోజు మనం కాఫీ త్రాగుదాం.....వొచ్చే అవర్ లెక్చర్ వుంది. క్షమిస్తారా?" అన్నాడు గోపాలం.
    అతని ముఖంలోకి చూసింది శశిరేఖ.....తన ఆలోచనలు గ్రహించగలిగాడని తెలుసును....కాని అతను నవ్వుతున్నాడేమోనని అనుమానం.
    అతను గంభీరంగా ఉన్నాడు. ఏమీ నవ్వు పోలికే లేదు ముఖంలో.
    కాని.... ఏదో ఓడిపోయినట్లు అనిపించింది శశిరేఖకి.
    "సరే వొచ్చి మా ఇంట్లో కాఫీ తాగితే..."
    "ఆల్ రైట్ థాంక్స్..."
    అతను వెళ్ళబోయాడు.
    "గోపాల్! మా ఇల్లు కూడా తెలీదే మీకు? ఎలాగ వొస్తారు?" అని అడిగింది. అతని గాభరాచూసి నవ్వుతూ.
    "మా వీధేనని చెప్పేరుగా!...."
    "పదహారో నెంబరు ఇల్లు."    
    సెలవు తీసుకుని ఇద్దరూ వేర్వేరుగా బయలుదేరి అతను డిపార్ట్ మెంటు వేపూ ఆమె వైటింగ్ రూమ్ వేపూ వెళ్ళిపోయారు. అక్కడికి చేరేక హఠాత్తుగా ఆమెకి జ్ఞాపకం వొచ్చింది-ఏరోజూ చెప్పకుండానే కాఫీకి పిలిచిందని.
    నవ్వొచ్చింది.
    "ఏమిటిసంగతి?" అని అడిగింది వసుంధర.
    ఏమీ దాచకుండా చెప్పింది శశిరేఖ.
    వసుంధర నవ్వలేదు.
    "జాగ్రత్త చిట్టితల్లీ.... ఇక్కడ చదువుకన్న అనుమానాలు హెచ్చు... అంతకన్నా కథలు ఎక్కువ..." అంది. కొంచెం కోపం వచ్చింది శశిరేఖకి.


Next Page 

WRITERS
PUBLICATIONS