Next Page 
సంపెంగలూ - సన్నజాజులూ పేజి 1


              సంపెంగలూ - సన్నజాజులూ 

                                            -----అవసరాల రామకృష్టారావు

 

 

            

 

 

                     

 

    వసుధ మధ జల్లు మానవ వనము నందు
    కొన్ని విలువైన వీరులైన కోపి తెచ్చి
    వీడు పాదాల ముంగిట నిలిపి తేని
    ధన్యమైనట్లు జననము తలతు దేవ!"
    ఆ సాయంకాలపు నీరెండలో కూచుని నా కిష్టమైన పై పద్యం పదే పదే చదువుకుని పరవశించి పోతున్నాడు.
    ఏమిటో! అలా ఆలోచిస్తుంటే నా మనసు ఏళ్ళ కొద్దీ వెనక్కి వెళ్ళి పోతుంది. కలిగిన సందిగ్ధాలూ నాలో జారిగిన సంచలనాలూ నిన్నా మొన్నా జరిగినట్టు అనిపిస్తుంది. నిజానికి నా మనోవ్యధలకి కారకులు దుర్మార్గులెవరూ కాదు పైగా నాకు కావలసిన వాళ్ళంతా పువ్వులంత సున్నిత హృదయులు. కాని ఎన్ని రకాల సుమాలో అన్ని రకాల సువాసనలు. అందుకనే నా గడిచిన దశాబ్ధ చరితం పలు విధ పరిమళ భరితం. అర్ధమైన వాళ్ళు అభ్రూణించ గలుగుతే అంతకన్న ఆనంద మేముంది!  
    నా పదిహేనవ ఏట నేను ఫిప్తు ఫారం చదువుతుండగా మానాన్న చదువు మానిపిచేస్తానన్నారు. నేనే కాదు, నాతొ పాటు అన్నయ్య కూడా నాన్నగారితో హోరా హోరీ వాదించాడు.
    'దాన్ని చదువు మానిపించి పెళ్ళి చేద్దామని ఎందుకంత తొందర పడతారు? ఇప్పుడేమంత వయసు మించి పోయిందని? కళ్ళూ మనస్సూ విప్పి దాన్ని లోకాన్నంతా చూసుకోనివ్వండి. ఎప్పుడు తగిన సంబంధం వస్తే అప్పుడే మానిపించేయ్యవచ్చు. అవతలి వాళ్ళ కిష్టమయితే అలా పొడిగించినా తప్పులేదు. అది ముందు మానిపించేయ్య్డడం దేనికి?'
    వాడు నాకంటే అయిదేళ్ళు పెద్ద. మాయిద్దరి మధ్య పిల్ల పుట్టి పోయిందట. నాకు ఏడాది ఉన్నప్పుడు మా యిద్దరినీ వదిలి అమ్మ పోయిందిట. మాయిద్దరికీ మధ్య నన్నెప్పుడూ రానూ లేదు. మేము రానిచ్చింది లేదు!
    'చదివిస్తూ కూచుంటే ఏదో జరిగిపోతుంది గదా అని సంబంధాలు వెతకడం అలా అలా ఆలస్యమై పోతుంది. పిల్ల ఇంట్లో ఉన్నదారి వేరు. మన కళ్ళ ఎదురుగా కనబడుతూ ఉంటె...."
    "...కంట్లో నలకలా గరగరలాడు తుంటుంది కాబోలు ఎప్పుడు తీసి అవతల పారేడ్డామా అని పిస్తుంటుంది కాబోలు. తెల్లారగట్లే లేచి ఇంట్లో పనులన్నీ వేళా పట్టున చేసి దాని మట్టుకది బడికి వెళ్ళి వస్తుంటే మీకేం అడ్డొచ్చింది?"
    "ఒరే దాని సంగతీ అభాద్యతా నావి కాని నీవి కావు. నిన్నెవరు సలహా ఇమ్మాన్నాడు?' అని నాన్నగారు కోపంగా, విసురుగా అక్కడనుంచి వెళ్ళి పోయారు. అన్నయ్యతో అన్నాను.
    'మామూలు మాటకే నాన్నా ముందు జడిసేవాడివి, ఇవాళ నీకింత ధైర్యం ఎలా వచ్చిందిరా అన్నయ్యా?"
    'లేకపోతె ఏమిటే ఒళ్లు మండిపోతుంటే.... అన్నట్టు ఓసే మంజూ , ఈ నెలాఖరులోగా నీ జీతం "ఫైన్ తో పుచ్చుకుంటారు గదూ, నా దగ్గర సోమ్ముంది కట్టేసి వస్తానుండు. నాన్న ఏం చేస్తారో?'
    నాన్న ఆ ప్రక్కనే ఉండి మా మాటలు వింటున్నాడని మా నౌకరు అప్పన్న చేసిన సంజ్ఞను అన్నయ్య అందుకోలేదు. నాన్నగారు రుద్రాకారం దాల్చేరు.
    'అలాగలాగే..... కట్టేసి వచ్చినా సరే, దీన్ని ఆ బడిలో రాటకి కట్టేసి వచ్చినా సరే ....ఇదెలా చదువుతుందో నేనూ చూస్తాను. ముందుగా హెడ్మాస్టరు తో మాట్లాడి అన్ని కాగితాలూ అప్పుడే పట్టుకోచ్చేశాను. గార్డియన్ సంతకం లేకుండా నువ్వేం చెయ్యగలవో నేనూ చూస్తాను.'
    అన్నయ్య విసురుగా అక్కణ్ణించి వెళ్ళిపోయాడు. నాన్నగారు నా వైపు మింగినట్టు చూస్తూ పెరట్లోకి వెళ్ళిపోయారు. చిన్నప్పట్నించి మమ్మల్ని ఆడించి పెంచిన అప్పన్నా నేనూ అక్కడే మిగిలెం.
    "అయినా అమ్మాయి గోరూ.... ఆ పెద్ద సేనానికి ఏతిరేకంగా తవరికి మాత్తరం అంతగా సదువు మీద ఎందుకండి? సడువుకుని డాట్రామ్మవుతారా , బరి సేప్తారా?"
    నేను జవాబు చెప్పలేదు. చెప్పలేను కూడా. పక్క గదిలోకి వెళ్ళి పడక్కుర్చీ మీద కూలబడ్డాను. అంతులేని విద్య నేర్చి అపారమైన మానవ సేవ చేద్దామనే ఆలోచన నాకెప్పుడూ లేదు గాని ఏదో చెప్పలేని పిపాసా, వివరించలేని తహతహ అలా క్లాసులన్నీ ఒకటి ఒకటి మేడమేట్లు ఎక్కినట్లు ఎక్కి ఆ చివర నిలబడి కింద ఎలా ఉంటుందో చూడాలనే పిచ్చి ఆ రోజుల్లో మరీ ఎక్కువగా ఉండేది. చదువు మీది నాకు ఇంతగా గురి కుదరడానికి - ఇంట్లో అన్నయ్యతో పాటు -- మాకు ధర్డు ఫారం లో ఇంగ్లీషు చెప్పి సుందరమ్మ గారు కూడా కొంతవరకు కారకులనుకుంటాను. అంత చిన్నతనంలోనే ఇంగ్లీషు పౌరసత్వం మీద విశేషమైన అభిమానం కలిగేలా చేసిందామె. డికేన్సు నవలల మీదా, మిల్టన్ పద్యాల మీదా ఆరోజుల్లో అంత ఖచ్చితమైన అభిప్రాయం ఎర్పడకపోయినా అప్పుడా పేర్లయినా తెలీడం కనీసావసరమేమో అని ఇప్పుడిప్పుడనిపిస్తూ ఉంటుంది. పాఠం ఆటలా చెప్పే ఆమె సామర్ధ్యం అందరికీ రాదనుకుంటాను. ఒకసారి ఆమె ఎవరికో అటో గ్రాఫ్ రాసిస్తుంటే చూశాను.

    'చదువు చదువు చదువు
    చదువు కల్ప తరువు'
    ఈ అక్షరాలూ 'సిరక్షరాలు' కావు. నా మనస్సులో చెరగని శిలాక్షరాలు. నాన్న మానిపించేసినా ఇంకా ఎలాగైనా ప్రవైటు గా కట్టించాలని అన్నయ్య ప్రయత్నిస్తూనే ఉండేవాడు. ఈ ఇద్దరు అభిమానస్తుల మధ్యా పడి నేను నలిగి పోయేదాన్ని. చదువుకోలేక పోయానన్న వ్యధ కన్న ఆప్తుల అభిప్రాయ భేదాలకు కారకురాల్నయాను కదా అనే చింత నన్నెక్కువ పీడించేది. కాని కాల పురుషుడు చేసే పరిష్కారాలు వూహతీతంగా ఉంటాయి.
    "ఒరే, నీతో మాట్లాడాలి ఇలారా' అన్నారు నాన్న ఒకరోజు అన్నయ్యతో. నేనుగదిలో జడ అల్లుకుంటున్న దాన్ని గుండెలు కొట్టు కుంటుండగా ఇవతలికి వచ్చాను. నాన్న ఎప్పుడో గాని అలా పిలవరు.
    'చూడు , దీనికి పదిహేను వెళ్ళిపోతున్నాయి. '....అంటే పదహారూ వస్తాయన్నమాట.'
    'అంత వేళాకోళంగా ఉందన్న మాట. బాధ్యత ఎరగని పసిగుడ్డువు. నీతో నాకేం గాని, నే చెప్పేది  జాగ్రత్తగా విను. ఎంత ప్రయత్నం చేసినా కనీసం మూడు వేలయినా ఇస్తే గాని సంబంధం కుదిరేలా లేదు. పై ఖర్చులు ఎలా లేదన్నా ఓ వెయ్యి రూపాయల దాకా అవుతాయి.'

 

                   
    అన్నయ్య ఏదో అందామనుకున్నట్టున్నాడు. కాని నాన్న మొహంలో విషాద మేఘాలు చూసి ఆగిపోయి ఉండాలి.
    'నేనూ ఆడపిల్లని కన్న వాణ్ణి, కన్యలతో పాటు కట్నాలు కూడా ఇచ్చి పంపడం ఎంత కష్ట మో నేను వూహించగలను. కాని ఏం చెయ్యను? సత్యనారాయణ గారి అమ్మాయి అలిమేలు మంగమ్మని నువ్వు చూశావో లేదో, తెల్లగా బాగానే ఉంటుంది. అతనూ లేనివాడే గాని ఈ మధ్యనే ప్రావిడెంటు ఫండు అయిదు వేలు వచ్చిందిట. అలా నీకు కట్నంగా ఇచ్చేస్తానన్నాడు. దాంతో దీని పెళ్ళయి పోగా చిల్లర అప్పులేవేనా ఉంటె తీరిపోతాయి కూడా. ఇదే నా ఆశ. నువ్వేనా ఆస్తి. కాదనకు బాబూ.'
    నాన్న ఎంత నెమ్మదిగా బాధగా చెప్పేరో అన్నయ్య అంత త్వరగానూ కఠినంగానూ జవాబు చెప్పి అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
    "ఇప్పట్లో పెళ్ళి చేసుకోవడం నా కిష్టం లేదు. చేసుకున్నా కాణీ కట్నం పుచ్చుకోడం నా కిష్టం లేదు. ఆ మాట మళ్ళీ రెండోసారి మీ నుంచి వినడం నాకసలు ఇష్టం లేదు.'
    ఈ మాటలే అన్నయ్య ఇంతకంటే సరసంగా చెప్పి ఉండవచ్చు. తను అన్ని విధాల చెప్పినా నా చదువు నాన్నగారు మనిపించేయ్యడమే వాడికి అయన పట్ల ఇంత దురభిప్రాయం కలిగించిందేమో! అయినా ఈ కాలపు ఆడపిల్లల చదువు గురించి నాన్నగారి అభిప్రాయాలు గూడా అంతగా తోసి పారేయ్యవలసినవి కావు మరి!
    'ఒక ఉద్దేశమంటూ లేకుండా ప్రభుత్వం కనీస దృష్టి తో చేసే విభిన్న విద్యా విధానంతో కొట్టుకుంటూ తేలికగా పైకి తేలిపోతున్న అర్భకులైన మొగాళ్ళు చాలు. మనదేశానికి సరిపడని ఈ చదువులు మన మాతృమూర్తులకి మాత్రం ఎందుకు? నీచాతినీచుల్ని రెచ్చగొట్టి వయసులో ఉన్నవాళ్ళని ఇంట్లో ఉన్నా, పైకి ఈడ్చి మానసికంగా చిత్రవధ చెయ్యడానికి చిత్రాలు, చిత్రిక పట్టడానికి పత్రికలూ చాలు. క్రమశిక్షణ లేని గురువులు గల పాఠశాలల్లో చేరి ఆడపిల్లలు కూడా అన్యాయమై పోవడం దేనికి?"
    ఇంతటి ఘాటు విమర్శ కి అన్నయ్యతో పాటు నేనూ అవుననలేను గాని నాన్నగారి అంతర్గతంలోని అసలు కారణం నేను ఊహించగలను. ఇలా ఏరోజు కారోజు గడిచిపోతే ఓ యేటికోయేడు మీదపడి ఆడపిల్లాల పెళ్ళిళ్ళు వెనక బడిపోతాయని.
    అన్నయ్య అలా జవాబు చెప్పడంతో నాన్నగారు మరీ క్రుంగి పోయా రనుకుంటాను. మొహామెత్తి నావైపు సరిగ్గా చూడడం మానివేశారు. నిద్రా భోజనాల విషయంలో గూడా అయన చాలా అశ్రద్ధ వహిస్తున్నట్లు అనిపించి నా మనస్సు చివుక్కు మనేది. అసలే బడి మానెయ్యడం వల్ల ఏమీ తోచేది కాదు. నాన్న చూస్తె రోజురోజుకి నిరుత్సాహంగా నీరసంగా కనిపించేవారు. రోజులు దుర్భరంగా నిశ్శబ్దంగా గడిచేవి. ఒక్క అప్పన్న తో తప్ప మాతో మాట్లాడే వారేకాదు.
    ఒకనాడు వాడు నాన్నకి కాళ్ళు పట్టడానికి వచ్చాడు.
    'అదేమిటి పెద్దయ్య గారూ, అరిపాదాలు అంత ఎచ్చగా ఉన్నాయే?' నాన్న వాడికేం జవాబు చెప్పలేదు. కొంచెం సేపు ఆగి అన్నారు.
    "అప్పన్నా'
    "ఏం పెద్దయ్యగోరూ."
    "వీళ్ళకి లోకజ్ఞానమన్నది లేదురా. ఎలా బతుకుతారో ఏమిటో నాకర్ధం కావడం లేదు. నేను ఉంటానో ఉండనో. నువ్వేనా చివరి దాకా వీళ్ళని కనిపెట్టుకు ఉంటావా అప్పన్నా?'
    "ఏమిటి బాబూ ఇయాల అలా సెలవిత్తున్నారు?" అంటూ వాడు వలవల ఏడ్చేశాడు. నాకూ కన్నీళ్లు ఆగలేదు.


Next Page 

WRITERS
PUBLICATIONS