శ్రీరాముడు పూజించిన ఈ శక్తిపీఠం గురించి తెలుసా!
శ్రీరాముడు పూజించిన ఈ శక్తిపీఠం గురించి తెలుసా!
శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, వైష్ణవ క్షేత్రాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. వీటిలో అమ్మవారి ఆరాధన ప్రదేశాలను శక్తి కేంద్రాలు అని అంటుంటారు. ఇక సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలను శక్తిపీఠాలు అని అంటారు. శక్తిపీఠాలు. శక్తిపీఠాలకు చాలా ప్రాధాన్యత ఉంది. శక్తిపీఠాలను సందర్శించే ఏ భక్తుడైనా జీవితంలోని అన్ని దుఃఖాలు, బాధల నుండి విముక్తి పొందుతాడని నమ్ముతారు. ఇలాంటి శక్తిపీఠాలలో చిత్రకూట్ లోని రామగిరి శక్తిపీఠం ఒకటి. శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రదేశంలో పూజలు చేశాడని చెబుతారు. ఈ శక్తిపీఠం గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
రామగిరి..
వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు , సీత, లక్ష్మణుడు ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో పదకొండున్నర సంవత్సరాలు వనవాసం గడిపారు. రాముడు చిత్రకూట్‌లో ఈ శక్తిపీఠాన్ని పూజించినందున, దీనికి రామగిరి శక్తిపీఠం అని పేరు వచ్చిందని అంటారు. అందుకే ఇక్కడ రామనవమి పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు.
మధ్యప్రదేశ్‌లోని మైహార్‌లోని శారదా దేవి ఆలయాన్ని శక్తి పీఠంగా మరికొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లోని శారదా దేవి ఆలయాన్ని శక్తి పీఠంగా మరికొందరు చెబుతారు. ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
కోరికలు నెరవేరే ప్రదేశం..
ఉత్తరప్రదేశ్‌లోని మందాకిని నది దగ్గర సతీదేవి కుడి వక్షస్థలం పడిందని నమ్ముతారు. శివపురాణంలో దీన్ని శివానీ శక్తిపీఠంగా వర్ణించారు. ఈ శక్తి పీఠంలో ప్రతిష్టించబడిన దేవతను శివానీగా పూజిస్తారు. శివానీ దేవితో పాటు, చండ అని పిలువబడే శివుని భైరవ రూపం కూడా ఇక్కడ ప్రతిష్టించబడింది.
రామగిరి శక్తిపీఠం గురించి చాలా కాలంగా ఉన్న నమ్మకం ఏమిటంటే, ఈ ప్రదేశాన్ని సందర్శించడం వల్ల భక్తులు తమ కష్టాల నుండి విముక్తి పొందుతారట, వారి కోరికలన్నీ నెరవేరుతాయట
*రూపశ్రీ.