Prema Pandem part 25
అతని సలహా రాంబాబుకి నచ్చింది ముందు రెండు లక్షలు సంపాదించుకుంటే తర్వాత మిగతా మూడు లక్షల గురించి ఆలోచించుకోవచ్చు. రాంబాబుకి తన మెడలోని బంగారు చైన్ గురించి గుర్తుకు వచ్చింది. అవును... దాన్ని అమ్మేస్తే మరో యాభై వేలు వస్తాయ్! అంటే ఇంకో రెండున్నర లక్షలు కావలి కావాలి...! ఎలాగైనా సంపాదించోచ్చు. ఫ్రండ్స్ దగ్గర అప్పు తీసుకోవచ్చు అనుకున్నాడు రాంబాబు. అతనికి ఈ ఆలోచన వచ్చాక చాలా హుషారుగా అనిపించింది. సీట్లోంచి లేచి సెక్షనులో అందరూ చూస్తుండగా డాన్స్ చేయాలని అనిపించింది. వెంటనే లోన్ అప్లికేషన్ ఫారాలు ప్యూన్ చేత తెప్పించుకుని ఫిల్ చేసి మేనేజర్ నందివర్థన రావు దగ్గరికి తీసుకేల్దామనుకున్నాడు కానీ అతని క్యాబిన్ లో ఎవరో గెస్ట్ లు వుండడంతో వాళ్ళు వెళ్ళేదాకా తన సీట్లోనే కుర్చుని ఎదురుచూడసాగాడు రాంబాబు. అలా ఎదురు చూడడం అతనికి ఎంతో అసహనంగా వుంది. ప్రతి నిమిషం ఓ గంటలాగా అనిపిస్తుంది అతనికి.
అవును మరి... అది అతని జీవిత సమస్య కదా? సార్! మేనేజర్ గారి గెస్ట్ లు వెళ్ళిపోయారు. మీరు వెళ్ళొచ్చు రాంబాబు నందివర్థన రావు క్యాబిన్ లోకి గుండెకాయ భారంగా కొట్టుకుంటుండగా వెళ్లాడు. అతన్ని చూస్తుండగానే ఆ… ఏంటోయ్ విశేషాలూ? అర్జెంట్ ఫైల్సాన్నీ పూర్తి చేసేశావా? అన్నాడు నందివర్థనరావు. నాకు మీరు అర్జెంటు ఫైల్సేమీ ఇవ్వలేదు సారూ... మెల్లిగా అన్నాడు అతను. ఇవ్వలేదా? మరి నువ్వు నా దగ్గరికెందుకోచ్చావ్? కళ్ళు పెద్దవి చేసి చేస్తూ ప్రశ్నించాడు నందివర్థన రావు. మరేం లేద్సార్... మీరేలాగైనా హెల్ప్ చెయ్యాలి సార్... అన్నాడు రాంబాబు తన చేతిలోని లోన్ అప్లికేషన్ ఫాం మేనేజర్ ముందు పెడుతూ. ఆయన ఆ అప్లికేషన్ చూస్తూనే నో... నో... నో... నో... అన్నాడు బుర్రకాయ్ అడ్డంగా వూపుతూ. మీరలా తల అడ్డంగా వూపితే ఎలా సార్? దీనంగా అన్నాడు రాంబాబు.
పోనీ ఇప్పుడూ! నో నో నో నో అంటూ తల నిలువుగా ఊపాడు ఈసారి. తర్వాత రాంబాబు వంక చూసి చిరునవ్వు నవ్వాడు. ఎలా ఉంది నా జోక్ అన్నట్టు. పిల్లికి చెలగాటం, ఎలాక్కు ప్రానసంకటంలా ఉంది రాంబాబు పరిస్థితి. సార్! మీరు కాదనకండి సార్... మీరు కాదంటే చాలా ఇబ్బందులపాలు అవ్వాల్సి వస్తుంది సార్. ఎవరు నేనా? ఏం బెదిరిస్తున్నావా? కళ్ళు పెద్దవి చేస్తూ అన్నాడు నందివర్థన రావు. రాంబాబు కంగారుపడిపోయాడు. అబ్బెబ్బే.... మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు సార్! ఇబ్బందులపాలు అయ్యేది మీరు కాద్సార్... నేను సార్. నువ్వేన్నయినా చెప్పు... నీకు లోన్ శాంక్షన్ చేసేదిలేదయ్యా ఇంకా నా ముందు నిల్చుని తోకాడిస్తే తోక కట్ చేస్తా అతను నీరు కారిపోయాడు. సార్! కాదనకండి సార్... చాలా అవసరం సార్. ఏంటోయ్ అవసరం... లోన్ లు ఇస్తుంటే తీసేస్కుని దుబారా ఖర్చులు చేసేయ్యడమేగా... ఇదేనా అవసరం? అయినా ఇలా ఇష్టం వచ్చినట్టు లోన్ లు పెడుతుంటే ఎలా శాంక్షన్ చేస్తాం అనుకున్నావ్? నో నో నో నో... బుర్రకాయ్ ని మళ్ళీ అడ్డంగా తిప్పాడు మేనేజర్.
కానీ లోన్ కోసం అప్లై చేస్తే ఏం ప్రాబ్లం లేకుండా శాంక్షన్ చేసేస్తారని చెప్పారు...!! ఆశ్చర్యంగా అన్నాడు రాంబాబు. ఎవడ్రా చెప్పింది? ఉరుముతూ అన్నాడు నందివర్థనరావు. యూనియన్ వాళ్లు సార్ ఎవరూ?.. ఉలిక్కిపడుతూ అడిగాడు ఆయన యూనియన్ వాళ్ళు సార్... మేనేజర్ మొహంలో మార్పులు గమనిస్తూ మెల్లగా అన్నాడు రాంబాబు. నందివర్థనరావు హఠాత్తుగా ఫకాలుమని నవ్వేశాడు. ఎవరూ యూనియన్ వాళ్ళే కదూ? కరెక్ట్ గా అన్నారోయ్... అయినా మీ హక్కుల్ని మీరు ఉపయోగించుకోకుండా తోక జాడిస్తూ అడ్డుపడ్డానికి మేమేవరిమోయ్... కాకపోతే కుర్రాడివి అనవసరంగా లోన్స్ పెట్టి ఆ డబ్బుని దుర్వినియోగం చేసి అప్పులపాలై పోతావేమోనని చెప్పానంతే హి..... హి.... హిహిహీ... లోన్ అప్లికేషన్ ఫారం మీద శాంక్షన్ చేస్తూ సంతకం పెట్టడానికి పెన్ తీశాడు నందివర్థన రావు.