పట్టాభి రామ్, రావి కొండలరావులకు కళారత్న అవార్డు

Publish Date:Mar 19, 2015

Advertisement

సాహిత్య, కళా రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీఏటా తెలుగువారి నూతన సంవత్సరమయిన ఉగాది పండుగరోజున అవార్డులు, నగదు పారితోషికంతో సత్కరిస్తుంటుంది. ఈసారి కూడా రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 32 మందికి కళారత్న అవార్డులు, 67 మందికి ఉగాది పురస్కారాలను ప్రకటించింది.

 

మన్మధనామ సంవత్సరమయిన కొత్త సంవత్సరంలో తెలుగువెలుగు విశిష్ట పురస్కారానికి ప్రముఖ వాగ్గేయకారులు శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావుని ఎంపిక చేసింది. ఆయనకు లక్ష రూపాయలు బహుమానంగా అందజేస్తారు.

 

కళారత్న అవార్డుకు ఎంపికయిన వారికి ఒక్కక్కరికీ రూ.50 వేలు, ఉగాది పురస్కారాలకి ఎంపికయిన వారికి ఒక్కొకరికీ రూ.10 వేలు చొప్పున నగదు బహుమతిని ప్రభుత్వం అందజేస్తుంది.

 

కళారత్న (హంస) అవార్డుకు ఎంపికయిన ప్రముఖులు:

సాహిత్యం: యద్దనపూడి సులోచనా రాణి, అక్కిరాజు రమాపతి రావు, కొలకలూరి స్వరూపా రాణి, జీడిగుంట రామచంద్ర మూర్తి, దేవీప్రియ.

నాటక రంగం: రావి కొండలరావు, ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ, కందిమళ్ళ సాంభశివరావు, మద్దాల రామారావు, వి.సరోజిని.

జానపదం: ఆచార్య రాజ కుమార్ అడయార్, కొండపల్లి వీరభద్రయ్య, కర్నాటి లక్ష్మి నరసయ్య, శెట్టి గాసమ్మ

సంగీతం: ఫై.వి.యాన్. శేషయ్య శాస్త్రి, ద్వారం మంగ తాయారు.

నాట్యం: వెంపటి రవిశంకర్, లంకా అన్నపూర్ణ, ప్రభా రమేష్

చిత్రలేఖనం: వేముల కామేశ్వర రావు, రావూరి సుబాష్ బాబు, జి. బాలకృష్ణ

శిల్పం: డా. పి. సుబ్రమణి స్థపతి, రేగుల్ల మల్లికార్జున రావు

అవధానం: మేడసాని మోహన్, డా. ధారా రామనాధ శాస్త్రి.

హరి కధ: కోట సచ్చిదానంద శాస్త్రి

ఇంద్రజాలం: డా. పట్టాభి రామ్

మిమిక్రీ: చిత్తూరి గోపీ చంద్

వ్యాఖ్యానం: యమ.కె.ఆర్. ఆశాలత

గ్రందాలయ సేవ: లంకా సూర్యనారాయణ

సమాజసేవ: అన్నే ఫెరర్

By
en-us Political News

  
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  కేసీఆర్ ఎంపీగా ఉన్న సమయంలో తాను పార్లమెంటుకు హాజరు కాకున్నప్పటికీ, వచ్చినట్టుగా హాజరుపట్టికలో తన బదులు మరొకరితో సంతకాలు చేయించారని ఆరోపించారు
జగన్ రెడ్డి నియంత్రుత్వ పోకడలపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆప్ లైన్లో అనేక ఆరోపణలు చేస్తున్నారు. మైక్ ముందుకు వచ్చే సరికి జననేతంటూ తెగ పొగుడుతున్నారు. తేలు కుట్టిన నేతల్లా.. లోలోన మదనపడుతున్నారు.
ఏపీ హోంమంత్రి సుచరిత పై టీడీపీ నేత, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సుచరిత కేవలం కీ ఇస్తే ఆడే ఒక బొమ్మ మాత్రమేనని, ఆ బొమ్మకు సీఎం జగన్ లేదా సజ్జల రామకృష్ణారెడ్డి కీ ఇస్తేనే ఆడుతుందని ఆమె విమర్శించారు. 20 నెలల రాజారెడ్డి రాజ్యాంగంలో రాష్ట్రంలో ఒక్క ఆడపిల్లను కూడా కాపాడుకోలేని పరిస్థితి నెలకొందని అనిత విమర్శించారు.
ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ లు విశాఖలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ నడుపుతూ వారిద్దరూ హెల్మెట్ పెట్టుకోలేదు. అధికారంలో ఉన్న నేతలే ఇలా నిబంధనలు పట్టించుకోకుండా, హెల్మెట్ లేకుండా బైక్ నడపడమేంటని సోషల్ మీడియాలో తెగ ప్రశ్నిస్తున్నారు. కామెంట్లతో కుమ్మేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం ఓ నేరమైతే.. బహిరంగా ప్రదేశంలో ర్యాలీ నిర్వహిస్తూ ఆ ఇద్దరు నేతలు మాస్క్ కూడా పెట్టుకోకపోవడం కొవిడ్ నిబంధనలకు విరుద్ధం.
చెన్నై‌లోని ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన వైద్య కేంద్రంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు.  వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫోటోలను ఉప రాష్ట్రపతి వెంకయ్య తన ట్విటర్‌లో షేర్ చేశారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులంతా వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దైంది. మార్చి 4, 5 తేదీల్లో తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొనాల్సి ఉంది.
రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు. పోలీసుల తీరుకు నిరసనగా ఎయిర్ పోర్టులో బైఠాయించిన చంద్రబాబు. విమానాశ్రయంలో హైటెన్షన్.
1989లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్.. అప్పడు కేంద్రంలో అధికారంలో ఉంటూ అత్యంత శక్తివంతంగా ఉన్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు, నేతలను ఏకం చేశారు. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన నేషనల్ ఫ్రంట్ కూటమి అప్పట్లో రాజకీయ సంచలనమైంది. ఎన్టీఆర్ బాటలోనే ఇప్పుడు శరద్ పవార్ కూడా జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బలమైన కూటమి ఏర్పాటు చేయబోతున్నారు. 
టీఆర్ఎస్ లో ఇప్పటికే మంత్రి ఈటల రాజేందర్ పని అయిపోయిందని.. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత హరీశ్ రావు పని కూడా అయిపోతుందని రేవంత్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. ఈసారి కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టే జరుగుతుందా? అధికార పార్టీలో అలజడి పక్కానా? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్.
రాయలసీమలోని ఒక ప్రముఖ ఆశ్రమంలో గతేడాది జరిగిన ఐటీ, ఈడీ దాడుల కేసుల నుంచి బయట పడేస్తామంటూ ఆ ఇద్దరు నేతలు రూ. ముఫ్పై కోట్లను వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ స్కామ్ లో ఆ ఇద్దరు నేతల నిర్వాకం పై కేంద్ర నిఘా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
సామాన్యుడికి మ‌రో షాక్ త‌గిలింది. వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ మళ్లీ పెరిగింది. ఈ సారి వంట గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర‌లే కాకుండా వాణిజ్య గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర‌లు కూడా పెరిగాయి. వంటగ్యాస్‌పై రూ.25, వాణిజ్య సిలిండర్‌పై రూ.95ను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ ధ‌ర‌లు వెంట‌నే అమ‌ల్లోకి వ‌చ్చాయి. 
హైదరాబాద్ , రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెరాస, బీజేపీ ఎమ్మెల్సీఅభ్యర్ధులు ప్రధానంగా బ్రాహ్మణ ఓటర్లపై దృష్టిని కేంద్రేకరించారు. బ్రాహ్మణ ఓటర్లు ఎటు మొగ్గుచూపితే అటే విజయం నడిచి వెళుతుందని పార్టీల  విశ్వాసం.
ఫిబ్రవరి 27, 2020. విశాఖ విమానాశ్రయం ముందు యుద్ధ వాతావరణం. వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించాక ప్రజా చైతన్య యాత్ర కోసం విశాఖ పర్యటనకు  వెళ్లారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. టీడీపీ అధినేతను బలవంతంగా అడ్డుకున్నారు వైసీపీ మూకలు. వైసీపీ శ్రేణులు విధ్వంసకారులుగా మారి చంద్రబాబు కాన్వాయ్ ను విమానాశ్రయం ముందు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను అడ్డుకోవాల్సిన పోలీసులు చేతులెత్తేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.