Publish Date:Oct 6, 2018
Publish Date:Sep 28, 2018
Publish Date:Sep 24, 2018

LATEST NEWS
The parents of some students from Bangalore were shocked when they looked into the text book of their children. The text book named ‘Current School Essays and Letters’ by Purabi Chakraborty has a controversial chapter named `Modern Girl’. Well if you are wondering why this chapter has become controversial, have a look at some of the statement mentioned in the chapter- “a modern girl is a self-centred creature than a loving daughter or sympathetic sister... She loves to wear jeans, pants and hot pants. The colourful saree has no place in the modern girl’s stock of garments.”  “She is eager to enjoy life fully and so she does not want to miss any party, cinema show, concert, fashion parades and such outdoor activities. She talks and makes friendship with boys freely and easily.” The Central Board of Secondary Education (CBSE) had to step into the scene and issue a warning to the schools to be careful while selecting text books for the students.
  The flash floods in Kerala have caused a devastation that could only occur once in a hundred years. Hundreds of people have lost their lives and property worth thousands of crores has been destroyed. However here is an interesting allegation from Kerala. The state has filed an affidavit with the Supreme Court claiming that Tamil Nadu is solely responsible for these flash floods. It accused that sudden release of flood waters from the Mullaperiyar dam was a cause for the floods in the State. Kerala has further alleged that their neighbouring state has ignored their continuous requests to release the water in a step by step process. However, Tamil Nadu has denied these allegations and said that they have given enough warnings to Kerala regarding the release of water.
  Well! All these days we have a feeling that Andhra Pradesh has suffered a huge loss of bifurcation of the state. Nothing has gone in the favour of the new state since four years. But now... here is a reason for the people in AP to have a broad smile. The Mines and Geology department has found a huge treasure in Chigargunta and Bisanatham areas of Chittoor district. The government officials have estimated that 1.83 metric tonnes of gold ore is present in the area and 9.4 tonnes of gold can be produced from the ore. The government might grab more than thousand crores by auctioning the ore. And that’s not the end of the news. The government is planning to revive defunct gold mines present in Anantapur district.
ALSO ON TELUGUONE N E W S
డాషింగ్ డైర‌క్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ గ‌త కొంత కాలంగా స‌రైన స‌క్సెస్ కొట్ట‌లేక‌పోతున్నాడు.  త‌న ప్ర‌తి సినిమాతో నిరాశ ప‌రుస్తూనే ఉన్నాడు. త‌న కొడ‌కుకి కూడా `మెహ‌బూబా` చిత్రంతో అప‌జ‌యాన్ని ఇచ్చాడు. ఈ సారి ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి మ‌ళ్ళీ లైమ్ లైట్ లోకి రావాల‌న్న క‌సితో ఉన్నాడ‌ట‌. అయితే ప్ర‌స్తుతం రామ్ తో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.  అయితే  పూరి జ‌గ‌న్నాథ్  త‌ర్వాతి చిత్రాన్ని కూడా  లైన్లో పెట్టాడ‌ట‌.  ఒకసారి ఆ వివ‌రాల్లోకి వెళితే...  అతి త‌క్కువ చిత్రాల‌తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ట పూరి జ‌గ‌న్నాథ్‌. ఇటీవ‌ల కాకినాడ‌లో షూటింగ్ జ‌రుగుతుండ‌గా డియ‌ర్ కామ్రేడ్  చిత్రం షూటింగ్ జ‌రుగుతుండ‌గా లొకేషన్ కి వెళ్లి పూరి , విజ‌య్ కు ఓ స్టోరీ లైన్ వినిపించాడ‌ట‌. పూరి స్టోరీకి ఫ్లాటైన విజ‌య్ వెంట‌నే  గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఒక డిఫ‌రెట్ మేన‌రిజ‌మ్ తో సినిమాలు చేసే విజ‌య్ ...హీరోని డిఫ‌రెంట్ గా చూపిండంలో దిట్టైన పూరి వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా అంటే క‌చ్చితంగా క్రేజీ కాంబినేష‌న్ అంటున్నారు సినీ జ‌నాలు. నిజంగా ఈ కాంబినేష‌న్ లో సినిమా అంటే మ‌రో పోకిరి సినిమాను ఊహించ‌వ‌చ్చు అనుకుంటా. చూద్దాం ఎలా ఉంటుందో మ‌రి.
  ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఫ్యామిలీతో కలిసి గోవా వెళ్లనున్నారు. ఆయన సంస్థలో పని చేసిన యువ హీరోలు పలువురికి గోవా రమ్మని ఆహ్వానాలు అందాయి. ఎందుకు? అంటే... దిల్ రాజు అన్న కొడుకు హర్షిత్ పెళ్లి ఈ నెల (డిసెంబర్) 21న గోవాలో జరగనుంది. అదీ సంగతి!! కొన్ని రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదోని ఎమ్మెల్యే సాయిప్రకాష్ రెడ్డి కుమార్తెతో హర్షిత్ రెడ్డి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. గోవాలో పెళ్లి ప్లాన్ చేశారు. ఈ పెళ్ళికి హీరోలు నాని, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్.. దర్శకులు వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్ వేణు శ్రీరామ్ తదితరులు హాజరు కానున్నారట. హైదరాబాద్‌లో ఈ నెల 23న జరిగే  రిసెప్షన్ కి ఇండస్ట్రీ ప్రముఖులు అంతా హాజరు అవుతారట.  
  వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా 'యాత్ర'.  మలయాళ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ఫిబ్రవరి 8న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ఈ రోజు ఉదయం ప్రకటించారు. నిజానికి, తొలుత ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయాలని భావించారు. తరవాత జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఫీలర్లు వదిలారు. ఇప్పుడు ఫిబ్రవరి 8 అన్నారు. దీనికి కారణం... ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ 'మహానాయకుడు'ను ఫిబ్రవరిలో విడుదల చేయాలని అనుకోవడమే. 'మహానాయడు'లో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. 'యాత్ర'లో వైయస్సార్ పాదయాత్రను హైలైట్ చేస్తున్నారు. రెండు సినిమాల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు వున్నాయి. 'ఎన్టీఆర్ మహానాయకుడు' విడుదల కంటే ముందు 'యాత్ర' ప్రేక్షకుల ముందుకు రావడం కంటే ఆ సినిమాతో పోటీగా వస్తే.. ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం వుంటుంది. అందుకని, 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాతో పోటీకి వైయస్సార్ 'యాత్ర' సిద్ధమవుతోందని టాక్!!
   `ఐతే` , అనుకోకుండా ఒక‌రోజు, ఒక్క‌డున్నాడు, ప్ర‌యాణం, సాహ‌సం, మ‌న‌మంతా ఇలా  టైటిల్స్ మాత్ర‌మే కాదు డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ...విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడుగా పేరు తెచ్చుకున్నారు ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి. అలాగే ఫ‌స్ట్ సినిమా లీడ‌ర్ తోనే అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరీలు ఎంచుకుంటూ త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకున్నాడు హీరో రానా. ఇలా విభిన్నంగా ఆలోచించే ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో ఓ  ఆస‌క్తిక‌ర‌మైన సినిమా రాబోతుంద‌ని  సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చల్ చేస్తున్నాయి.  ఇటీవ‌ల రానాకు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పారట‌. స్టోరీ లైన్ న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని ఫిలింన‌గ‌ర్ లో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయ‌ట‌. త్వ‌ర‌లో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశాలున్నాయి.  అయితే ప్ర‌జంట్ రానా తెలుగు, త‌మిళం, హిందీలో తెర‌కెక్కుతోన్న @హాథీ మే రీ సాథీ` చిత్రంలో, తెలుగు, త‌మిళంలో రూపొందుతున్న `1945` లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు.  ఈ చిత్రాలు పూర్త‌య్యాక చంద్ర శేఖ‌ర్ ఏలేటి సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల నుంద‌ట‌.
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిలో హీరోయిన్ మెహరీన్‌పై ఖుషి అనే నిర్మాత ఫిర్యాదు చేశారు. తాను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం లేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఖుషి వైఖరిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ను ఆశ్రయించారు మెహరీన్. ఎందుకంటే... ఖుషి నిర్మించబోయే సినిమా కోసం మెహరీన్ డేట్స్ కేటాయించారు. మరో రెండు సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినా.. వాటిని పక్కన పెట్టారు. తన డేట్స్ వేస్ట్ అవుతున్నాయని, అందుకు తగిన న్యాయం చేయాలనేది మెహరీన్ వాదన. సిని'మా' పెద్దలు తనను అడ్వాన్స్ తిరిగి ఇవ్వమంటే.. అందుకు తాను సిద్ధమని మెహరీన్ తెలిపారట. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? అంటే... సుధీర్ బాబు హీరోగా పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఖుషి ఓ నిర్మాత ప్రారంభించారు. అందులో మెహరీన్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు. పూజా కార్యక్రమాలకు సుధీర్ బాబు, మెహరీన్... ఇద్దరూ హాజరయ్యారు. ఏమైందో ఏమో... సుధీర్ బాబుతో కాకుండా చిరంజీవి రెండో అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. అందులో మెహరీన్‌ని కాకుండా మరొకర్ని హీరోయిన్‌గా తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకని, ఆమెను అడ్వాన్స్ తిరిగి ఇవ్వమన్నారు. తన డేట్స్ వేస్ట్ అవుతున్న కారణంగా అడ్వాన్స్ ఎందుకు తిరిగి ఇవ్వాలనేది మెహరీన్ వాదన. చివరకు, ఈ పంచాయతీ సినిమా పెద్దల దగ్గరకు చేరింది. వారు ఏం తీర్పు ఇస్తారో??
  శాసనసభ పక్ష నాయకునిగా టీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్‌ను ఏకపక్షంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాను చేయాల్సిన పనిచేయకుండా అధికారాలు పెట్టుకొని రాష్ట్రాలపై పెత్తనం చేస్తోందని, ఇదే అభిప్రాయం చాలా రాష్ట్రాలు, పార్టీల్లో ఉందని విమర్శించారు. రూరల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, వైద్యం, విద్య కేంద్రం తన దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. దేశానికి కొత్త ఆర్థిక విధానం, కొత్త వ్యవసాయం విధానం అవసరమని, మూస వ్యవసాయ విధానం పోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ జాతీయ పార్టీ అని చెప్పుకుంటుంది.. కానీ రాష్ట్రానికో పాలసీ ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, బీజేపీది పచ్చి రాజకీయ అవకాశం వాదమని ఆరో్పించారు. బీజేపీ, కాంగ్రెస్‌ లకు తేడా లేదని.. దొందూ దొందేనని ఎద్దేవా చేశారు. కొత్త మోడల్ దేశానికి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ ప్రయత్నం దేశ రైతాంగం తరపున తాను చేస్తానని అన్నారు. వీలైనంత త్వరగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. జర్నలిస్టులకు అన్ని రకాలుగా మేలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరించారని కేసీఆర్ అన్నారు. నాలుగేళ్ల పాలన మమ్మల్ని తిరిగి గెలిపించిందని అన్నారు. చేసిన పని సిన్సియర్‌గా చేశామని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో కోటి మందికి కంటి వెలుగు పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటుదన్న భావన ప్రజల్లో వచ్చిందని, పేదలకు కేసీఆర్‌ కిట్‌, కళ్యాణలక్ష్మి పథకాలు ఎంతో ఉపయోగపడ్డాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో బాల్య వివాహాలు జరగడం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో సమానమైన ఆదరణ కనిపించిందని కేసీఆర్ అన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను వందకు వంద శాతం అమలుపరిచిన ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో తాము ఎవరితోనైనా, ఏ ఛాలెంజ్‌కైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. తాము ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఏం చేస్తామని చెప్పామో వంద శాతం అది చేశామని, మేనిఫెస్టోలో లేని ప్రజలకు ఉపయోగపడే 76 అంశాలను కూడా అమలుపరిచిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. బీడీ కార్మికుల పెన్షన్ తమ మేనిఫెస్టోలో లేదని, కానీ మంజూరు చేశామని తెలిపారు. ఎన్నికల ముందు రైతుబంధు చెప్పలేదని.. ఆయినా చేశామన్నారు. కొంతమంది కావాలనే ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము చెప్పినట్లు ప్రచారం చేశారని.. తాను కానీ, తమ పార్టీ కానీ ఆ మాట అనలేదని కేసీఆర్ చెప్పారు. ఉద్యోగాలు కల్పిస్తామని మాత్రమే చెప్పామని, ఆంధ్రా వాళ్లు వెళ్లిపోతే వచ్చే ఖాళీలు మనకొస్తాయని చెప్పామని కేసీఆర్ తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. రానున్న పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఎమ్మెల్యేలకు సూచించాం అని తెలిపారు. ఫెడరల్‌ ఫ్రంట్ వస్తే దేశవ్యాప్తంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తాం అన్నారు. దీనికోసం మూడున్నర లక్షల కోట్లు ఖర్చవుతుంది. తాము వచ్చాక కచ్చితంగా చేస్తాం అని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 29.9శాతం ఆర్థికవృద్ధి ఉంది. దేశంలో ఏ రాష్ట్రమూ తెలంగాణకు దరిదాపుల్లో లేదు. రూ.70వేల కోట్లతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తవుతాయి. అప్పులు చేశామని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పూర్తి అవగాహనతోనే ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్నాం అని స్పష్టం చేశారు. తమకంటే ముందు 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు ఎన్ని ఉద్యోగాలిచ్చాయి? నిరుద్యోగులను మోసం చేసి కనీసం ఐదులక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయారు అని విమర్శించారు. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో.. వాటిని త్వరలోనే భర్తీ చేస్తాం అని స్పష్టం చేశారు. ఏపీ ప్రత్యేక హోదాపై చంద్రబాబుకే క్లారిటీ లేదని కేసీఆర్‌ విమర్శించారు. ప్రత్యేక హోదాతో వచ్చేది ఏముందని పెద్ద పెద్ద డైలాగులు కొట్టారని, హోదా విషయంలో బాబు మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా అడిగేవాళ్లు మూర్ఖులని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు ఆయనే హోదా అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రాకు రమ్మని తనను పిలుస్తున్నారని.. వందలు, వేల సంఖ్యలో ఆహ్వానాలు అందుతున్నాయని అన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు వందకు వంద శాతం వెళ్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.
  తెలంగాణలో ప్రజకూటమి అంచనాలను తారుమారు చేస్తూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి లభించిన విజయం పూర్తిగా తెలంగాణ ప్రజల విజయమని అభివర్ణించారు. ప్రచారంలో కాళేశ్వర కావాలా? శనేశ్వరం కావాలా అని అడిగామని, ప్రజలు కాళేశ్వరమే కావాలని తీర్పునిచ్చారని అన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, కులాలకు మతాలకు అతీతంగా సకల జనులు నిండుగా దీవించి అందించిన విజయమని అన్నారు. కార్యకర్తలెవరూ విజయంతో గర్వించాల్సిన అవసరం లేదని, అంతిమ తీర్పు ప్రజలే కాబట్టి కర్తవ్య నిష్ఠతో బాధ్యతను నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ అభివృద్ధిలో ఒక బాట వేసిందని, ఇక ఆ బాటను చేరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోటి ఎకరాలు పచ్చబడాలి అన్న తమ లక్ష్యాన్ని కచ్చితంగా చేరతామని అన్నారు. లక్ష ఎకరాలకు నీరందించడమే కర్తవ్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రైతుల కోసం కచ్చితంగా పనిచేస్తామని, వారికి ఏ బాధలు లేకుండా చేస్తామని ప్రకటించారు. గిరిజనులు, గిరిజనేతరులు పోడు భూముల కోసం పడుతున్న బాధలను తొందరలోనే పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు తానే వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటానని ప్రకటించారు. కుల వృత్తులు మరింత అభివృద్ధి పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగతను అధిగమిస్తామని తెలిపారు. ఉద్యోగ ఖాళీలను అత్యంత వేగంగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వేతర రంగాల్లో కూడా విరివిగా దొరికేలా చూస్తామని అన్నారు. విజయం ఎంత ఘనంగా ఉందో బాధ్యత కూడా అంతే బరువుగా ఉందని అన్నారు. ఇప్పటికే కంటి వెలుగు కార్యక్షేత్రంలో ఉందని, అలాగే ఇప్పుడు ఈఎన్‌టి, డెంటల్ పరీక్షలను చేసి ఆరోగ్య తెలంగాణను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న అన్ని రకాల మైనారిటీలకు మరింత సంక్షేమాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. వీరితో పాటు దళితులు, గిరిజనుల బాధలకు భరతవాక్యం పాడతామని, ఇందుకోసం ఏం చేయాలనే అంశంపై ఆలోచించి కచ్చితమైన లక్ష్యాలతో ముందుకు సాగుతామని అన్నారు. బీసీలతో పాటు రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య వర్గాలకు కూడా గురుకులాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యలే కేంద్ర బిందువుగా, పరిష్కారం ఇతివృత్తంగా, పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించాల్సిన బాధ్యత మనపై ఉంది అన్నారు. ప్రేక్షక పాత్ర పోషించం. చైతన్యం కల్గినది తెలంగాణ గడ్డ. తానేంటో నిరూపించుకున్న భూమి తెలంగాణ. 116 సభల్లో నేను పాల్గొన్నా. ప్రతి సమావేశంలో నేను ప్రజలకు విజ్ఞప్తి చేశాను. పార్టీలు, నాయకులు కాదు. ప్రజలే గెలవాలని అన్నాను అని గుర్తు చేశారు. ఈ రోజు ప్రజలే గెలిచారు. ఎవరు ఏమన్నా, ఎన్ని విమర్శలు చేసినా మేం పట్టించుకోలేదు అన్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాం. ఈ దేశానికి ఓ దిక్సూచి తెలంగాణ. జాతీయ రాజకీయాలకు ఓ కొత్త నిర్వచనం ఇస్తాం అన్నారు. 'దేశంలో పెద్ద గందరగోళం ఉంది. నూరు శాతం బీజేపీయేతర, కాంగ్రెసేతర పరిపాలన రావాలి. మాకు ఎవరూ బాస్‌లు లేరు. మేం ఎవరికీ ఏజెంట్లం కాం. ప్రజలకే ఏజెంట్లం. ప్రజలే మమ్మల్ని ఏజెంట్లుగా నియమించారు. వారి కోసమే మేం పనిచేస్తాం. మేమెవరికీ గులాంగిరీ చేయం. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ.. జాతీయ రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తాం’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అదే విధంగా ఈ సమావేశంలో కేసీఆర్, చంద్రబాబు మీద తనదైన శైలిలో సెటైర్లు వేశారు. చంద్రబాబు ఇక్కడకు వచ్చినప్పడు తాము అక్కడకు వెళ్లమా అని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి పనిచేశారని.. మరి తాము కూడా ఆంధ్రాకు వెళ్లి పనిచేయాలా వద్దా అని అన్నారు. బర్త్‌‌డే గిఫ్ట్ ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమా? అని అన్నారు. దేశ రాజకీయాల్లో పనిచేసే క్రమంలో ఏపీకి కూడా వెళ్లబోతున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తనకు లక్ష ఫోన్ కాల్స్ వచ్చాయని.. ఏపీ రాజకీయాల్లో తాను కూడా కలగజేసుకోవాల్సిందిగా అక్కడి ప్రజలు కోరుతున్నారన్నారు. చంద్రబాబు గురించి విజయవాడ వెళ్లి మొత్తం చెబుతానన్నారు. తమ గిఫ్ట్ ప్రభావం ఎంతుంటుందో త్వరలో అందరూ చూస్తారన్నారు.
  తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు ప్రజకూటమికే అనుకూలంగా ఉన్నాయని నిన్న లగడపాటి రాజగోపాల్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే లగడపాటి ఒకప్పుడు టీఆర్ఎస్ కి అనుకూలంగా సర్వే ఉందని చెప్పి.. ఇప్పుడు ఒత్తిడి వల్ల మాట మారుస్తున్నారు. ఆయన మాటలు ప్రజలు పట్టించుకోవద్దు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే దీనిపై తాజాగా లగడపాటి స్పందించారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. వ్యక్తిత్వం ముఖ్యమని అన్నారు. ఒత్తిడితో సర్వేను మార్చానని కేటీఆర్‌ అనడం విడ్డూరంగా ఉందన్నారు. సెప్టెంబర్‌ 16న తన బంధువు ఇంట్లో కేటీఆర్‌ కలిశారని.. అప్పుడే సర్వే గురించి కేటీఆర్‌ తనను అడిగినట్లు చెప్పారు. సర్వే రిపోర్టులు పంపిస్తానంటే కేటీఆర్‌ మెయిల్‌ అడ్రస్‌ కూడా ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, కోదండరాం విడివిడిగా ఉన్నప్పుడు ఆ సర్వే చేశామని లగడపాటి చెప్పుకొచ్చారు. వారందరూ కలిస్తే పోటాపోటీగా ఉంటుందని కూడా కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు. టీడీపీ బలం టీఆర్ఎస్‌కు కలిస్తే.. విజయం ఏకపక్షమవుతుందని అన్నానన్నారు. పొత్తులతో వెళ్లాలని తాను సూచించినప్పటికీ.. కేటీఆర్ మాత్రం ఒంటరిపోరుతోనే విజయం సాధిస్తానని తెలిపారన్నారు. 65 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు.   కేటీఆర్‌ 23 నియోజకవర్గాల జాబితా పంపించి సర్వే ఫలితాలు కోరారని, నవంబర్‌ 11న కేటీఆర్‌ మరో 37 నియోజకవర్గాల జాబితా పంపారన్నారు. 37 నియోజకవర్గాల విషయంలో సర్వే చేయగా.. కాంగ్రెస్‌ పార్టీకి ఆధిక్యం ఉందని కేటీఆర్‌కు మెసేజ్‌ పెట్టా. పోటా పోటీగా ఉన్నప్పుడు అభ్యర్థులే ప్రధానం అవుతారని చెప్పా. మళ్లీ నవంబర్‌ 20న మరోసారి మెసేజ్‌ పెట్టా. అప్పటికీ కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో గందరగోళం చూసి టీఆర్ఎస్ 65-70 వస్తాయని చెప్పా. వాళ్లకు 35 నుంచి 40 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేశా. దీనిపై కేటీఆర్‌ స్పందించి దానికంటే ఎక్కువే వస్తాయని నాకు బదులిచ్చారు. ఆ తర్వాత ప్రజల ఆలోచన వేగంగా మారింది అన్నారు. నవంబర్‌ 28 తర్వాత తనకు అనేక రిపోర్టులు వచ్చాయని, ఏ రిపోర్ట్‌ను ఎవరితో షేర్‌ చేసుకోలేదన్నారు. 8 మంది ఇండిపెండెట్లు గెలుస్తారని చెప్పానని.. ఏ పార్టీకి వ్యతిరేకంగా చెప్పలేదని లగడపాటి పేర్కొన్నారు. మొన్నటి దాకా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న వరంగల్‌ జిల్లాలో కూడా కాంగ్రెస్‌ ఆధిక్యత ఉందని.. ఈ ఉదయమే సమాచారం వచ్చిందన్నారు. డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు, ఎస్టీ రిజర్వేషన్లు, మూడెకరాల భూమి విషయంలో ఎస్సీ, ఎస్టీలు టీఆర్‌ఎస్‌పై గుర్రుగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ రూ.2 లక్షల రుణమాఫీ హామీ బాగా పనిచేసిందని లగడపాటి చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని లగడపాటి అన్నారు. ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోవద్దని తెలిపారు. కేటీఆర్, తన మధ్య ఎలాంటి గొడవలు లేవని అన్నారు. అలాగే తాను ఎప్పుడూ బోగస్ సర్వేలు చేయలేదని లగడపాటి స్పష్టం చేశారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో పరిస్థితి గురించి లగడపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 28న తాను గజ్వేల్ కు వెళ్లానని వెల్లడించారు. పోలీసులు తనిఖీల్లో భాగంగా తన కారును ఆపారన్నారు. తనను వారు గుర్తుపడతారని అనుకోలేదనీ, కానీ ఓ కానిస్టేబుల్ గుర్తుపట్టి కారు దిగమని కోరారని వివరించారు. తనతో వారు సెల్ఫీలు దిగారన్నారు. గజ్వేల్ లో పరిస్థితి ఎలా ఉందని అక్కడి కానిస్టేబుళ్లను తాను అడిగానన్నారు. దానికి ‘పోతారు సార్’ అని ఏడుగురు కానిస్టేబుళ్లు బదులిచ్చారన్నారు. గజ్వేల్ లో ఎవరు పోతారో? ఎవరు గెలుస్తారో? ఇప్పుడే బయటపెట్టడం తనకు ఇష్టం లేదని లగడపాటి వ్యాఖ్యానించారు.
  ఖమ్మంలో ప్రజా కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి వేదిక పంచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. టీఆర్ఎస్ మీద, బీజేపీ మీద విమర్శల వర్షం కురిపించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ సంస్కరణలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నాలుగేళ్ల ఎన్డీయే పాలనలో దేశ ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మోదీకి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, సీబీఐ, ఆర్బీఐ, గవర్నర్‌ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించారు. జీఎస్టీ వల్ల ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైందని, ధరలు పెరిగి పేదలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అసహనం పెరిగిపోయిందని.. దళితులు, ముస్లింలను అభద్రతాభావంతో ఉన్నారని అన్నారు. తెలంగాణలో ప్రజా కూటమి అవసరం చాలా ఉందని, ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే కాంగ్రెస్‌తో కలిశామని, తెలుగుజాతి ఐక్యత కోసం టీడీపీ పనిచేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులున్నాయని, రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని కోరామని ఆయన గుర్తుచేశారు. తెలుగు జాతి ఎప్పటికీ ఒకటిగానే ఉండాలని ఆకాంక్షించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన విశ్వవిద్యాలయాల గురించి మోదీని టీఆర్ఎస్ అడగడం లేదన్నారు. తాను పెత్తనం చేయడానికి రాలేదని, తెలంగాణ ప్రజల హితం కోసం పనిచేస్తానని తెలిపారు. తాను ఇక్కడకు వచ్చి పోటీ చేసే పరిస్థితి లేనప్పుడు పెత్తనం ఎలా చేస్తానని ప్రశ్నించారు. కృష్ణానదిలో నీళ్లు రాలేదనీ, గోదావరిలో 2వేల టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంలోకి వెళ్లాయని వాపోయారు. ఆ నీళ్లను ఉపయోగించుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయన్నారు. దిగువ రాష్ట్రం.. ఎగువన ఉన్నరాష్ట్రానికి నీళ్లు రాకుండా ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు. తాను తెలంగాణ ప్రాజెక్టులకు అన్ని విధాలా సహకరిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి తానెప్పుడూ అడ్డుపడలేదని.. తానెక్కడ ఉన్నా తెలంగాణ తనకు ఇష్టమైన ప్రాంతమని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్‌ను నిర్మించానని తాను చెప్పినట్లు అంటున్నారని.. తాను నిర్మించలేదని, సైబరాబాద్‌కు తన హయాంలో రూపకల్పన చేశామని చంద్రబాబు చెప్పారు. ఐటీ కంపెనీల ఏర్పాటుకు కృషి చేశా.. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేశామని గుర్తుచేశారు. విభజన జరిగాక తెలంగాణ మిగులుబజ్జెట్‌లో ఉంది. ఏపీ అప్పులో ఉంది. ప్రత్యేక హోదా సాధించుకుని ముందుకు పోతా అని చెప్పా. ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడలేదు. ఈ రోజు వరకు నేను ఒకే మాట మీద ఉన్నా. కేసీఆర్ నన్ను ఎందుకు తిడుతున్నారో నాకేం అర్థం కాలేదు. నన్ను దూషించడం న్యాయమా అని అడుగుతున్నా. నేనేం తప్పు చేశాను? తెలంగాణ అభివృద్ధికి టీడీపీ అడ్డుపడిందా? టీడీపీ లేకుంటే కేసీఆర్ ఎక్కడినుంచి వచ్చేవారు. నాకు సభ్యత ఉంది. నేను కేసీఆర్‌ను విమర్శించను. మీ ఉత్సాహం చూస్తోంటే నూటికి నూరు శాతం కాదు..  వెయ్యి శాతం మనమే గెలుస్తున్నామనిపిస్తోంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
  తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గర పడటంతో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ కేసీఆర్ మీద, టీఆర్ఎస్ మీద విమర్శల వర్షం కురిపించారు. దేశంలో సిగ్గు, శరంలేని వ్యక్తి సీఎం కేసీఆర్‌ ఒక్కరేనని అన్నారు. రాజకీయాలను నీచాతినీచంగా దిగజార్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ప్రజాప్రతినిధులనే కాదు.. మీడియాను కూడా కేసీఆర్‌ వదల్లేదని, తెలంగాణలో జర్నలిజం విలువలకు కేసీఆర్‌ పాతరేశారని విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఎక్కువగా మోసపోయింది జర్నలిస్టులే. జర్నలిస్టులకు వందకు వంద శాతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోలేదో కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. ఏ రాజకీయ నేత వ్యవహరించని విధంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. గర్వంతో ఆయన‌ ఎవరినీ లెక్కచేయడం లేదు అని విమర్శించారు.  ఎంతో మంది కష్ట ఫలితమే తెలంగాణ అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనను ఎంతో మంది అడ్డుకున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌ విషయంలో చాలామంది విభజనను అడ్డుకున్నారు. తెలంగాణ ఇవ్వడం ఎంత కష్టమో ఆలోచించాలి. కష్టతరమైనా సోనియా తెలంగాణ ఇచ్చారని, సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదని కొనియాడారు. సోనియాగాంధీ వల్లే రాష్ట్రం సాధ్యమైందని కేసీఆరే స్వయంగా ఒక సందర్భంలో అన్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటును ఎంఐఎం వ్యతిరేకించింది. అలాంటిది ఇప్పుడు అదే ఎంఐఎంతో కేసీఆర్‌ దోస్తీ అంటున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన ఘనత కేసీఆర్‌దే. అధికారంలోకి రాగానే దళిత ముఖ్యమంత్రి హామీని అటకెక్కించి తానే ఆ స్థానంలో కూర్చొన్నారు. రాజకీయ విలువలు కుప్పకూలిపోయే విధంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ పాలనలో దేశంలోనే అత్యంత అవినీతి తెలంగాణలో జరిగింది అని విమర్శించారు. 24 గంటల కరెంటు ఇస్తున్నానని చెబుతున్న కేసీఆర్‌.. ఎక్కడ విద్యుత్‌ ప్రాజెక్టులు కట్టారు.. ఎక్కడ విద్యుదుత్పత్తి చేశారని ప్రశ్నించారు. దేశమంతా ఇప్పుడు మిగులు విద్యుత్‌ ఉందన్నారు. ఇలాంటి సమయంలో 24 గంటల విద్యుత్‌ ఇవ్వడం పెద్ద విషయం కాదని అన్నారు. కొత్తగా ఒక్క యూనిట్‌ ఉత్పత్తి చేసిన పవర్‌ ప్రాజెక్ట్‌ గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క యూనిట్‌ కూడా ఉత్పత్తి చేయలేని దద్దమ్మలు తండ్రీకొడుకులని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఒక్కటే కాదు చుట్టు పక్కల రాష్ట్రాలన్నీ మిగులు విద్యుత్‌ రాష్ట్రాలేనని, 24 గంటల కరెంట్‌ కేసీఆర్‌ ఘనత కాదని ఉత్తమ్ పేర్కొన్నారు. రైతుబంధు మొదటి నాలుగేళ్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నాయనే రైతుబంధు పథకం పెట్టారని విమర్శించారు. 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కౌలు రైతులకు రైతుబంధు సాయం చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. దుర్మార్గులు మళ్లీ గద్దెనెక్కితే సామాన్యులకు బతుకుండదని అన్నారు. కేసీఆర్‌కు అధికార దాహం తలకెక్కిందని విమర్శించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా కేసీఆర్‌ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల క్రితం చెప్పింది ప్రజలు మరిచిపోతారని ఇప్పుడు కేసీఆర్‌ కొత్త హామీలు ఇస్తున్నారు. మేం ఏడాది నుంచి నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెబుతూ వస్తున్నాం. దానిపై కేసీఆర్‌, కేటీఆర్‌ విమర్శలు చేశారు. దక్షిణాది బడ్జెట్‌ మొత్తమైనా సరిపోదని ఎద్దేవా చేశారు అని గుర్తుచేశారు. అసెంబ్లీ రద్దు రోజు ఎవరు ఎవరితో జట్టు కడితే మాకేంటి అన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు వణుకుతున్నారు? అని నిలదీశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో తాము పొత్తుపెట్టుకుంటే మీకెందుకు భయమని కేసీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తానంటే చంద్రబాబు అడ్డుపడ్డారా?, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే అడ్డుపడ్డారా?, దళితులకు సీఎం పదవి ఇస్తానంటే చంద్రబాబు పడ్డారా? అని ప్రశ్నించారు. ఎల్‌.రమణ, కోదండరామ్‌, చాడ వెంకటరెడ్డి ఆంధ్రావాళ్లా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఓ బ్రోకర్‌ అని విమర్శించారు. మోదీని చూస్తే కేసీఆర్‌కు భయం. విభజన చట్టంలో ఉన్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ గురించి అడిగే సత్తా లేదు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి కమీషన్లు తీసుకుని ఎన్నికలకు వెళుతున్నారు. మిషన్‌ భగీరథ కింద లక్ష ఇళ్లకైనా నీళ్లిచ్చారా? కేవలం కమీషన్ల కోసమే పనిచేశారు అని విమర్శించారు. డిసెంబర్‌ 11న మహాకూటమి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 12న తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని, కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు, కేటీఆర్‌ అమెరికా పోవడం ఖాయమని ఉత్తమ్‌ అన్నారు. 
  తెలంగాణ రాష్ట్రం ఎన్నికల ప్రచారాలతో హోరెత్తుతోంది. ఇటీవల టీఆర్ఎస్ నేత కేటీఆర్ కొడంగల్ లో ఆ పార్టీ అభ్యర్థి తరుపున ప్రచారంలో పాల్గొని ' టీఆర్ఎస్ ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా.. కూటమి ఓడిపోతే నువ్వు రాజకీయాలను వదిలేస్తావా' అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు. అసలే టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడే రేవంత్ ..ఆయనపై సవాల్ చేస్తే ఊరుకుంటారా..ఏకంగా సిరిసిల్లలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ పార్టీ కొడంగల్ కైవసం చేసుకోవాలి అనుకుంటుంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ సీటుకే ఎసరుపెట్టేలా ఉన్నారు. ఈ నెల 24న రేవంత్‌ రెడ్డి చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలోని గంగాధర, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.  కాంగ్రెస్‌ పార్టీ కూడా రేవంత్‌రెడ్డి ప్రసంగాలకు ప్రజల్లో క్రేజ్ ఉండడంతో ఆయనను కీలక నియోజకవర్గాల్లో పర్యటించేలా చూడాలని భావిస్తున్నది. ఇందుకోసం పార్టీ ప్రత్యేక హెలీక్యాప్టర్‌ను సమకూర్చి రేవంత్‌ రెడ్డిని ప్రచారంలోకి దింపుతుందట. కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా న్యాయవాది కేకే మహేందర్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. కేకే మహేందర్‌ రెడ్డి తరుపున రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేటలో జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించనున్నరు. వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ, చందుర్తి మండల కేంద్రాల్లో జరిగే బహిరంగ సభల్లో కూడా రేవంత్‌ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆది శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రమేశ్‌బాబు ఎంపీ వినోద్‌ కుమార్‌కు సన్నిహిత బంధువు కావడం, వినోద్‌కుమార్‌ కేసీఆర్‌కు అన్ని విషయాల్లో అండదండగా ఉంటుండడంతో రేవంత్‌రెడ్డి ఈ నియోజకవర్గంపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ తనతోపాటే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మేడిపల్లి సత్యంను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనే లక్ష్యంతో రేవంత్‌ రెడ్డి చొప్పదండి నియోజకవర్గంలో తన మొదటి సభను ఖరారు చేసుకున్నారు. మేడిపల్లి సత్యంను చొప్పదండి అభ్యర్థిగా ఖరారు చేయించడంలో పలు ఆటంకాలు ఎదురైనా రేవంత్‌ రెడ్డి పట్టినపట్టు విడవకుండా రాహుల్‌గాంధీ అండదండలతో విజయం సాధించారు. మేడిపల్లి సత్యంకు చొప్పదండి నియోజకవర్గం అభ్యర్థిత్వం దక్కడంతో ఇక ఆయనను గెలిపించడం లక్ష్యంగా పెట్టుకొని ప్రచార బాధ్యతను తీసుకున్నారు. 
  కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. ఘన విజయం సాధించి రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసారు. ఇదే ఉత్సాహంలో తెలంగాణ కొత్త ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అదేంటి బతుకమ్మ అయిపోయిందిగా!! ఇప్పుడు చీరల పంపిణీ ఏంటి అనుకుంటున్నారా?. ముందస్తు ఎన్నికలు వచ్చాయి కదా.. అందుకే ఆ చీరల పంపిణీ కాస్త వెనక్కి వచ్చింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక.. వ్యక్తిగతంగా లబ్ధి చేకూరుస్తూ ఓటర్లను ప్రభావితం చేసేలా ఉండే పథకాలకు ఎన్నికల సమయంలో బ్రేక్ వేస్తారు. అందుకే రైతు బంధు పథకం కూడా రైతులకు నేరుగా చెక్కులు ఇవ్వకుండా.. అకౌంట్లో డబ్బులు వేసే ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ చీరలకు కూడా అప్పుడు అలాగే బ్రేక్ పడింది. ఎన్నికలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా పంచడానికి సుమారు 95 లక్షల చీరలను ప్రభుత్వం సిద్ధం చేసుకున్నా.. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆ పంపిణీకి బ్రేక్ పడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చీరల పంపిణీ చేయాలని భావించగా ఎన్నికల కమీషన్ దానిని అడ్డుకుంది. మళ్ళీ త్వరలోనే పంచాయతీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే చీరల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే వచ్చే వారంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసే అవకాశముంది.
  రాఫెల్ డీల్ విషయంలో అనుమానించదగ్గ అంశాలు ఏమి లేవంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయినా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో వెనకడుగు వేయట్లేదు. మోదీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తాజాగా ఈ అంశంపై స్పందించారు. ప్రధాని మోదీ ఇప్పటి వరకు రాఫెల్ డీల్ పై మాట్లాడలేదు. తీర్పు వచ్చిన తర్వాత రక్షణ మంత్రి సీతారామన్‌, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాత్రమే మాట్లాడారు అన్నారు. రాఫెల్ పై కాగ్‌ ఇచ్చిన నివేదిక ఏమిటో ప్రభుత్వం మాకు వివరించాలని కోరారు. అసలు కాగ్‌ రిపోర్ట్‌ ఎక్కడ? కాగ్‌ రిపోర్ట్‌ పీఏసీకి ఇచ్చినట్లు సుప్రీంకోర్టు చెప్పింది. రాఫెల్ ధరల వివరాలు పీఏసీ అధ్యక్షుడితో చర్చించినట్లు సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. కానీ ఇప్పటి వరకు పీఏసీ అధ్యక్షుడు ఖర్గేకి కాగ్‌ నివేదిక అందలేదు అని తెలిపారు. వేరే పార్లమెంట్‌లో పీఏసీకి సమాంతరంగా మరో పీఏసీ నడుస్తుందేమో. ఆ పార్లమెంట్‌ ఫ్రాన్స్‌దేమో. మోదీజీ తన సొంత పీఏసీని నడిపించగలరు అని ఎద్దేవా చేసారు. కాగ్‌ నివేదికను పీఏసీ ఇప్పటి వరకు చూడలేదు. కానీ సుప్రీంకోర్టు మాత్రం చూసింది అని విమర్శించారు. దేశ కాపలాదారుడు చోరీకి పాల్పడ్డారని దేశమంతా చూసింది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రధాని మోదీ తన స్నేహితుడు అనిల్‌ అంబానీతో కలిసి దోచుకున్నారు. అది మేం నిరూపిస్తాం అన్నారు. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేసి రాఫెల్ పై కచ్చితంగా విచారణ జరిపించాల్సిందేనని రాహుల్ గాంధీ డిమాండ్‌ చేశారు.
  రాఫెల్ డీల్ వ్యవహారంలో సుప్రీంకోర్టు మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ నేతలు సంబరపడిపోతూ.. కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తూ, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే బీజేపీ సంబరాలు మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే రాఫెల్ డీల్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం మీద మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 'రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కాగ్ ద్వారా.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ)కి అందజేశాం. వాళ్లకు పూర్తి అగాహన ఉంది' అని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పులో ఇది స్పష్టంగా ఉంది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కాగ్ రాఫెల్‌పై నివేదిక ఎప్పుడు ఇచ్చింది?.. పీఎసీ ముందుకు ఎప్పుడు వచ్చింది? అనే సందేహాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పీఏసీ చైర్మన్ గా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. మరి ఆయనకు తెలియకుండా కేంద్రం చెప్పిన కాగ్ రిపోర్ట్ పీఏసీ ముందుకు రాదు కదా?. మరి కేంద్రం సుప్రీంకోర్టుకు ఎందుకు అబద్దాలు చెప్పింది? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారమపై పీఏసీ చైర్మన్, కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే తాజాగా స్పందించారు. రాఫెల్ డీల్ విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. పార్లమెంటులో కాగ్‌ ఇచ్చిన నివేదికను ఎప్పుడు ప్రవేశపెట్టారనే దానిపై అటార్నీ జనరల్‌, కాగ్‌ సమాధానం ఇవ్వాలి. ఈ మేరకు పీఏసీ సభ్యులతో మాట్లాడి వారికి సమన్లు పంపిస్తాం అని ఖర్గే తెలిపారు. కాగ్‌ ఇచ్చిన నివేదికను పీఏసీ ఎప్పుడు పరిశీలించింది?. ఆ నివేదికను పార్లమెంటు ఎదుట ఎప్పుడు ఉంచారు? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇవ్వడం చూసి షాక్‌కు గురయ్యాం అన్నారు. సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించినందుకు గాను ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్‌ చేశారు. చూస్తుంటే రాఫెల్ రచ్చ ఇప్పట్లో మోదీ ప్రభుత్వాన్ని వదిలేలా లేదుగా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
  Do you know what it means to have weakness, fatigue or light-headedness along with rapid heartbeat, pale skin and a sore tongue? These are some symptoms of B 12 deficiency! We often don't care to check if our body is getting the right nutrition from the food we eat. This can be very dangerous. Something that can be taken care of easily could lead you to the hospital. To avoid that it is best to know the B 12 vitamins more closely. For you to understand its importance, let me first tell you what its major function is. B 12 cares for your brain and nervous system while helping in formation of blood in your body. It is advised to be taken orally for best results. Different countries have set different amounts as minimum requirements of the human body. For instance in the U.S it is suggested to have  2 to 3 µg per day where as U.K recommends 1.5 µg per day. However, the Center for Food Safety and Applied Nutrition recommends 6 µg per day, for an adult depending on his or her calorie intake each day. The nutrition measurements for an expecting mother are completely different. The recommended amount of vitamin B 12 in pregnant women is 2.6 µg per day and 2.8 µg during lactation periods. If these requirements are fulfilled, both the mother and the baby can experience the bliss of good health. Now let us see how we can prevent our body from being deprived of this essential vitamin. meat, poultry, seafood, dairy products, and eggs will not allow B 12  to escape from your body. If being a vegetarian is worrying you then I have an alternative. A bowl full of  cereal fortified with vitamin B12 for breakfast can do the magic for you! So, make B 12 you best friend and enjoy a long and healthy life.    - Kruti Beesam
  How Much Oil Can we Eat?:The usage of cooking oil in Indian families has always been on the higher side. But with chronic ailments like cholesterol, obesity and other diseases becoming a common affair, the doctors have suggested that apart from cutting down junk food and extra calories, they also suggest limiting the use of oil while cooking. In this video watch Dr Padmaja Prasad explain how much cooking oil should a family consume and share other diet tips. https://www.youtube.com/watch?time_continue=63&v=uKdp171Qksw    
  Your favourite cereal brand Kellogg Company has agreed to stop using terms such as "All Natural" and "100% Natural" on some of its Kashi and Bear Naked brand product labels and pay around $5 million to settle a class-action consumer fraud lawsuit. The settlement by the world's No. 1 maker of breakfast cereal marks the latest such outcome in a recent wave of litigation challenging nutrition claims in food labeling. Under the proposed settlement, Kellogg will drop the terms "All Natural" and "Nothing Artificial" from labeling and advertising for Kashi products containing certain ingredients challenged in the litigation.   Similarly, the terms "100% Natural" and "100% Pure and Natural" will be removed from certain products. Several lawsuits merged into a single case in 2011 accused Kellogg of deceiving consumers by labeling products as "All Natural" when they contained ingredients such as pyridoxine hydrochloride, calcium pantothenate or hexane-processed soy oil. Food labeling litigation is becoming more prevalent as health-conscious consumers demand greater accuracy in packaging and advertising. Kellogg's resolution of this case is part of a trend and a number of companies have altered wording on their products in the face of similar litigation.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.