నిద్రలేమి సమస్య గుండె జబ్బుకి దారితీస్తుంది
Publish Date:Jan 19, 2021
Influence Of Daily Life Habits
Publish Date:Jan 18, 2021
ఈ సింపుల్ యోగ ముద్రలతో ఎన్నో రోగాలు అరికట్టవచ్చు...
Publish Date:Jan 16, 2021
మాంసాహారంతో గుండె సమస్యలు!
Publish Date:Jan 15, 2021
యాంటీ స్నోరింగ్ డివైజ్ తో గురకకు చెక్
Publish Date:Jan 12, 2021
కొత్తిమీర…. ఖర్చు తక్కువ…. ఆరోగ్యం ఎక్కువ ...
Publish Date:Jan 11, 2021
టెస్టోస్టెరాన్ హార్మోన్లు... అనారోగ్య సమస్యలు
Publish Date:Jan 9, 2021
ఆహారంతోనే ఆరోగ్యం
Publish Date:Jan 8, 2021
కళ్లతో చెలగాటం వద్దు
Publish Date:Jan 7, 2021
ఎడమచేతివాటం ఉంటే క్షయవ్యాధి వస్తుందా!
Publish Date:Jan 6, 2021
ఆఫీసుకి ఇలా వెళ్తే... ఆయుష్షు పెరుగుతుంది!
Publish Date:Jan 5, 2021
కంటి క్యాన్సర్ కు థెరపీ
Publish Date:Jan 2, 2021
ఈ గడ్డి రసం రోజూ తాగితే..
Publish Date:Dec 30, 2020
తీపి కూడా ఓ వ్యసనమే!
Publish Date:Dec 29, 2020
శాకాహారంతో ఆరోగ్యమే కాదు, పర్యావరణమూ క్షేమమే!
Publish Date:Dec 28, 2020
గోల్ఫ్ ఆడితే జీవితకాలం పెరుగుతుంది
Publish Date:Dec 26, 2020
ఒంటరితనంలో జలుబు కూడా సమస్యే!
Publish Date:Dec 24, 2020
శ్వాసని పరీక్షిస్తే షుగర్ తెలిసిపోతుంది
Publish Date:Dec 23, 2020
చలికాలంలో చమటలు పడుతున్నాయా..?
Publish Date:Dec 22, 2020
ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులు క్లోజ్! జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్
ఇన్ సైడర్ ట్రేడింగ్.. గత 20 నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు పదేపదే చెబుతున్న మాట ఇది. టీడీపీపై ఆరోపణలు చేయడానికి వినిపించిన నినాదం ఇది. రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, టీడీపీ నేతలు బినామి పేర్లతో కారు చౌకగా వందల ఎకరాల భూములు ముందే కొనిపెట్టారని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తో పాటు వైసీపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు అదే పనిగా ఆరోపిస్తున్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వమే అమరావతి భూముల వ్యవహారంలో ఇన్సైడ్ ట్రేడింగ్ ప్రొత్సహించిందని చెబుతూ వస్తున్నారు. వైసీపీ నేతల ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండించారు టీడీపీ నేతలు. మాటలు కాదు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే నిరూపించాలని సవాల్ చేశారు. గత 20 నెలలుగా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఇప్పుడు పుల్ స్టాప్ పడింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిదంటూ ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. రాజధాని ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు కిలారు రాజేష్‌తో పాటుగా మరికొందమందిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. దీంతో వాటిని కొట్టివేయాలని కిలారు రాజేష్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై పెట్టిన కేసులు.. కేవలం ప్రభుత్వం కక్ష సాధింపు మాత్రమే అని హైకోర్టులో కిలారు రాజేష్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ రాజేష్ తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా నమోదు చేస్తారని? న్యాయవాది వెంకటేశ్వర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై ఐపీసీ సెక్షన్లు వర్తించవని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఈ అంశంలో ఇన్సైడ్ ట్రేడింగ్ లేదని పేర్కొంది. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు ఐపీసీ సెక్షన్లు వర్తించవని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం కిలారు రాజేష్‌తో పాటు మరికొందరిపై నమోదైన కేసులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పడి నుంచే అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు 2019 డిసెంబర్ 28 న ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటూ ఏపీ సర్కార్ కొందరి పేర్లతో జాబితా విడుదల చేసింది. మొత్తం పదకొండు మంది పేర్లలో చంద్రబాబు నాయుడు, లింగమనేని రమేష్, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ లతో పాటూ, యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్, ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన రావు పేర్లు తో పాటూ చాలా మంది పేర్లు ఉన్నాయి. వీరంతా నిబంధనలను తుంగలో తొక్కి వేలాది ఎకరాలు కారుచౌకగా కొన్నట్లు ఆరోపించింది. తెల్లరేషన్ కార్డు దారులకు కూడా అమరావతిలో వందలాది ఎకరాలున్నట్లుగా రికార్డుల్లో ఉందని.. వారంతా టీడీపీ నేతల బినామీలేనని కారు డ్రైవర్లు, పనిమనుషుల పేర్లపై కూడా భూములున్నాయని జగన్ సర్కార్ ఆరోపించింది. ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ విచారణకు ఆదేశిస్తూ జనవరి 23, 2020న ఉత్తర్వులు ఇచ్చింది జగన్ రెడ్డి సర్కార్. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ కేసులు కూడా నమోదు చేసింది. మంగళగిరి, తుళ్లూరు రిజిస్ట్రేషన్ ఆఫీసుల నుంచి వారి వివరాలు సేకరించారు అధికారులు. 797 మంది తెల్ల రేషన్ కార్డుదారులు 761 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. అత్యధికంగా తుళ్లూరులో 245 ఎకరాలు కొనుగోలు చేసినట్టు గుర్తించామన్న సీఐడీ అధికారులు.. తెల్ల రేషన్ కార్డుదారులపై చీటింగ్, బినామీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. 2020 ఫిబ్రవరి 29న టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కేసులు నమోదు చేసింది. అంతేకాదు గత ప్రభుత్వ పాలనపై నియమించిన సిట్ కూడా అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హడావుడి చేసింది. విజయవాడలోని కొందరు నివాసాల్లో మెరుపు దాడులు నిర్వహించింది. అయితే జగన్ ప్రభుత్వం విచారణల మీద విచారణలు జరిపిస్తున్నా టీడీపీ నేతలు మాత్రం జంకలేదు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని, అలాంటిది ఉంటే ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకునేదని టీడీపీ నేతలు చెప్పారు. ఇప్పుడు వాళ్లు చెప్పిందే నిజమైంది. గత 20 నెలలుగా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలన్ని ఉట్టివేనని తేలిపోయింది. అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేయడంతో వైసీపీకి దిమ్మతిరిగిపోయింది. హైకోర్టు తీర్పుపై స్పందించిన నర్సాపురం ఎంపీ రఘురామరాజు కృష్ణం రాజు.. జగన్ సర్కార్ పై హాట్ కామెంట్స్ చేశారు. సీఐడీ కేసులు పెట్టినప్పుడే అవి చెల్లవని తాను చెప్పానని ఆయన గుర్తు చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది ఉండదని, అలాంటి వాటిపై కేసులు పెట్టడం కూడా కుదరదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనడానికి ఆధారాలు ఉంటే.. గత 20 నెలలుగా ఎందుకు నిరూపించలేకపోయందని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రఘురామకృష్ణం రాజు.
ఫిబ్రవరిలో సీఎంగా కేటీఆర్! క్లారిటీ ఇచ్చిన ఈటెల రాజేందర్
తెలంగాణ ప్రభుత్వంలో మార్పులు ఉంటాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా కేటీఆర్ త్వరలోనే బాధ్యతలను స్వీకరించబోతున్నారనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. మార్చి లోపే కేటీఆర్ పట్టాభిషేకం ఉంటుందని పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హింట్ కూడా ఇచ్చారు. తన కుమారుడికి పగ్గాలను అప్పగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంగాన్ని సిద్దం చేశారని చెప్పారు. అయితే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాత్రం మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఈటెల రాజేందర్. కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టత ఇచ్చారు. ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన రాజేందర్.. కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని... ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు కేసీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఈటెల.. ప్రభుత్వంలోని 99 శాతం పనులకు కేటీఆరే హాజరవుతున్నారని... పలు కార్యక్రమాలకు కేసీఆర్ బదులుగా కేటీఆర్ హాజరవుతున్నారని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కేసీఆర్ బదులుగా కేటీఆర్ హాజరయ్యారని... దీనిపై విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. కొంత కాలంగా పార్టీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయనే ప్రశ్నకు బదులుగా .. మంత్రిగా తక్కువ మాట్లాడుతూ, ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు ఈటెల రాజేందర్. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసే ముందు కేసీఆర్ మరోసారి యాగం కూడా చేయబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో ఆలయాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీలతో పాటు దేశంలోని ప్రముఖులను ఆహ్వానించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా సుదర్శన యాగంతో పాటు చండీయాగం, రాజశ్యామలయాగం చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఈ క్రతువు ముగిసిన తర్వాత తన కుమారుడు కేటీఆర్ కి సీఎంగా పట్టాభిషేకం చేసి, ఆ బాధ్యతల నుంచి కేసీఆర్ వైదొలగుతారని విశ్వసనీయంగా తెలుస్తోంది. జనవరి మొదటి వారంలోనే కేటీఆర్ కు సీఎం బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్.. యాదాద్రి అలయాన్ని ప్రారంభించడంతో పాటు యాగం చేసిన తర్వాత కేటీఆర్ ను సీఎం చేయడం మంచిదని భావించినట్టు చెబుతున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రితో పాటు టీఆర్ఎస్ లోనూ కీలక మార్పులు ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ సీఎం అయితే... పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ రావు లేదా ఈటెల రాజేందర్ ను నియమించవచ్చని చెబుతున్నారు. ఇద్దరిని కూడా నియమించే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. గతంలో టీఆర్ఎల్పీ నేతగా పని చేశారు రాజేందర్.
ఏపీలో ఏం జరగబోతోంది? రాజ్యాంగ సంక్షోభం తప్పదా?
స్థానిక సంస్థల ఎన్నిక అంశం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపుతోంది. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం.. తన పని తాను చేసుకుపోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్థానిక సంస్థల ఎన్నికలకూ సహకరించేది లేదని చెబుతోంది వైసీపీ ప్రభుత్వం. రాజ్యాంగ బద్ద ఎన్నికల సంఘానికి రాష్ట్ర సర్కార్ సహకరించకపోతే తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో ఎన్నికల కమిషనర్, ఏపీ సర్కార్ వివాదం ఎటు వైపు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. షెడ్యూల్ విడుదలయ్యాక ఎన్నికలను వాయిదా వేసిన సందర్భా లు మన రాష్ట్రంలో తప్ప దేశంగా ఇంతవరకు ఎక్కడా జరగలేదని చెబుతున్నారు. కరోనా కారణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గత మార్చిలో వాయిదా వేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్ రెడ్డి సర్కార్ కోర్టుకెళ్లినా.. ఎస్ఈసీ నిర్ణయాన్నే సుప్రీంకోర్టు సమర్థించింది. షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగమంతా ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుంది. ఎన్నికలు వాయిదా వేయాలన్నా, నిలిపివేయాలన్నా.. ఎస్ఈసీ చేతిలోనే ఉంది. రెండేళ్ల కింద పశ్చిమ బెంగాల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ఎస్ఈసీకి వ్యతిరేకంగా ఆ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టు కు వెళ్లింది. అయితే రాజ్యాంగంలోని 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక ఎన్నికలు సకాలంలో జరగాల్సిందేనని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇటీవల కేరళ స్థానిక ఎన్నికల విషయంలోనూ జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేయడంతో ఈ నెల 9వ తేదీ నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్రప్రభుత్వ యంత్రాంగమంతా ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చినట్లయింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. అయితే జగన్ ప్రభుత్వం ఇందుకు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని అధికార యంత్రాంగాన్ని కూడా వారు ఆదేశించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రాజ్యాంగ సంక్షోభ పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. కేంద్ర ఎన్నికల కమిషన్‌తో సమాన అధికారాలు కలిగి ఉంది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఎన్నికల ప్రక్రియకు సహకరించని ఉద్యోగులు, అధికారులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకోవచ్చని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఏపీ సర్కార్ తీరుతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దూకుడుగా వెళ్లే అవకాశాలే కన్పిస్తున్నాయి. గత ఏడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో విఫలమయ్యారంటూ గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేయాలని, ఓ సీఐను సస్పెండ్ చేయాలని అప్పట్లో ప్రభుత్వాన్ని ఎస్ఈసీ ఆదేశించింది. అయితే రాష్ట్రప్రభుత్వం పట్టించుకోలేదు. గుంటూరు రూరల్ ఎస్సీని మాత్రం ఇటీవల బదిలీ చేశారు. దీంతో కమిషనర్ నిమ్మగడ్డ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు తాజాగా లేఖ రాశారు. ఎస్ఈసీ ఆదేశాలను అమలు చేయాలని, ఆ అధికారులను బదిలీ చేయాలని మరోసారి గుర్తుచేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించే తీరును బట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు ఉంటాయని అంటున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు కొందరు ఎస్ఈసీపై విమర్శలు చేశారు. . ఎన్నికలకు సహకరించబోమని కొంత మంది ఉద్యోగ నేతలు ప్రకటించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎస్ఈసీ వారిపై చర్యలు తీసుకునే అవకాశముందంటున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఉద్యోగులంతా తన పరిధిలోకి వచ్చినందున.. గీత దాటిన ఉద్యోగ సంఘాల నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎస్ఈసీ పరిశీలిస్తోందని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీకి రాష్ట్ర యంత్రాంగం సహకరించకపోతే ఏం జరగబోతుందన్న చర్చ ఏపీలో జోరుగా జరుగుతోంది. ఎస్ఈసీ తనకున్న అధికారాలను వినియోగించి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని.. ఈ ఆదేశాలను అమలు చేయకుంటే గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అదే జరిగితే రాజ్యాంగ బద్ధ విధుల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైనట్లు అవుతుందని.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందని చెబుతున్నారు.
బోల్డ్ రోల్లో హద్దు దాటిన అనుపమ
ఇన్నాళ్ళు పద్ధతిగా ఉండే పాత్రల్లోనే కనిపిస్తూ వచ్చిన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.. తొలిసారి కాస్త హద్దు దాటి బోల్డ్ రోల్ లో దర్శనమిచ్చింది. అయితే అదేదో సినిమా కోసమో, వెబ్ సిరీస్ కోసమో కాదు. ఓ షార్ట్ ఫిల్మ్ కోసం. 29 నిమిషాల నిడివి ఉన్న ఆ లఘు చిత్రం పేరు.. ఫ్రీడమ్ @ మిడ్ నైట్. రెండే రెండు పాత్రలతో రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్ లో అనుపమ.. ఆరేళ్ళ పాపకు తల్లిగా గృహిణి పాత్రలో కనిపించింది. ఛాట్ విండోస్, వర్చువల్ హ్యాపీ నెస్, సెక్స్ విత్ స్ట్రేంజర్.. ఇలాంటి వాటికి అలవాటు పడ్డ భర్తని ప్రశ్నిస్తూ.. తనకూ అలాంటి వాటిని కోరుకునే ఫ్రీడమ్ కావాలంటూ అడిగే చంద్ర పాత్రలో నటించింది అనుపమ. షార్ట్ ఫిల్మ్ మొత్తం చీరకట్టులోనే కనిపించినా.. అక్కడక్కడ 'F*' పదాలతో షాక్ ఇచ్చింది. ఎక్స్ ప్రెషన్స్ విషయంలోనూ అస్సలు తగ్గలేదు. భర్తలకు కనువిప్పు కలిగించేలా తెరకెక్కిన ఈ లఘుచిత్రాన్ని తన అభినయంతో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. నటిగా అదరగొట్టిందనే మార్కులు దక్కించుకుంది. తెలుగు, మలయాళ భాషల్లో యూట్యూబ్ ముంగిట అందుబాటులో ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ తో.. అనుపమ దశ, దిశ మారిపోతాయేమో చూడాలి. ప్రస్తుతం అనుపమ.. నిఖిల్ హీరోగా నటిస్తున్న 18 పేజెస్ లో నటిస్తోంది. కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఫైనల్‌గా పవన్‌తో చిందులేయనున్న రంగమ్మత్త?
2018 నాటి బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలంతో జబర్దస్త్ బ్యూటీ అనసూయ జాతకమే మారిపోయింది. ఆ పిరియడ్ డ్రామాలో తను పోషించిన రంగమ్మత్త పాత్రతో.. నటిగా తన ప్రతిభ ఏంటో చెప్పకనే చెప్పింది. కట్ చేస్తే.. ఆ సినిమా తరువాత పలు ఆసక్తికరమైన పాత్రల్లో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది అనసూయ. రంగస్థలం తరువాత ఎఫ్ 2 వంటి మల్టిస్టారర్ మూవీలో మెరిసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం ఖిలాడితో పాటు రంగమార్తండ, వేదాంతం రాఘవయ్య సినిమాల్లోనూ నటిస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితోనూ ఓ తమిళ చిత్రం చేయబోతోంది. ఇదిలా ఉంటే.. మరో క్రేజీ ప్రాజెక్ట్ లోనూ నటించే అవకాశం అనసూయకు దక్కిందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ రూపొందించనున్న పిరియడ్ డ్రామాలో ఒకట్రెండు సన్నివేశాలతో కూడిన ఓ ప్రత్యేక గీతంలో అనసూయ దర్శనమివ్వనుందట. సినిమాలో కీలక సమయంలో వచ్చే ఈ పాట.. సదరు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్. త్వరలోనే పవన్ - క్రిష్ కాంబో మూవీలో అనసూయ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. పవన్ ఇండస్ట్రీ హిట్ మూవీ అత్తారింటికి దారేదిలోనే అనసూయ ఇట్స్ టైమ్ టు ద పార్టీ సాంగ్ చేయాల్సింది. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేసే అవకాశం వదులుకుంది. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత పవన్ తో నర్తించే అవకాశం దక్కడం వార్తల్లో నిలిచే అంశమే. చూద్దాం.. ఏం జరుగుతుందో?
అమెజాన్‌లో మాస్టర్ స్ట్రీమింగ్.. డేట్ ఫిక్స్
ఈ సంక్రాంతికి విడుదలైన కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మాస్టర్.. టాక్ తో సంబంధం లేకుండా దాదాపుగా విడుదలైన అన్ని చోట్ల లాభాల బాట పట్టింది. తెలుగునాట అయితే తొలి రోజే 80% రికవరీ అయి వార్తల్లో నిలిచింది. విజయ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ఖైదీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రూపొందించిన ఈ భారీ బడ్జెట్ మూవీ.. త్వరలోనే డిజిటిల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోందట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. పాపులర్ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్.. మాస్టర్ తాలూకు డిజిటల్ రైట్స్ ని పొందిందని, వేలంటైన్స్ డే వీకెండ్ స్పెషల్ గా ఫిబ్రవరి 12 నుంచి మాస్టర్ ని స్ట్రీమ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. సినిమా విడుదలైన నెల రోజులకు డిజిటల్ స్ట్రీమ్ అయ్యే విధంగా.. మాస్టర్ మేకర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ మేరకే ఫిబ్రవరి 12న మాస్టర్ అమెజాన్ లో స్ట్రీమ్ కాబోతోందని సమాచారం. త్వరలోనే మాస్టర్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. మాస్టర్ లో విజయ్ కి జోడీగా మాళవికా మోహనన్ నాయికగా నటించగా.. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందించాడు.
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రం ఎఫ్ 2. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించిన ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ కి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎఫ్ 3 పేరుతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ లోనూ ఎఫ్ 2లో నాయికలుగా నటించిన తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మల్టిటాలెంటెడ్ సునీల్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు. ఇదిలా ఉంటే.. ఎఫ్ 3లో కథను కీలక మలుపు తిప్పే ఓ పాత్ర ఉందట. అందులో సుప్రీమ్ హీరో సాయితేజ్ ని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నాడట అనిల్ రావిపూడి. ఇప్పటికే అనిల్ డైరెక్షన్ లో సుప్రీమ్ వంటి సూపర్ హిట్ లో నటించిన సాయితేజ్.. పాత్ర హిలేరియస్ గా ఉండడంతో ఎఫ్ 3లో యాక్ట్ చేసేందుకు వెంటనే ఓకే చెప్పాడట. త్వరలోనే ఎఫ్ 3లో సాయి తేజ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. ఎఫ్ 2ని నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నే ఎఫ్ 3ని ప్రొడ్యూస్ చేస్తుండగా.. తొలి భాగానికి బాణీలు అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నే ఈ సీక్వెల్ కి కూడా స్వరాలు అందిస్తున్నాడు.
తెలుగునాట వరుస విజయాలతో ముందుకు సాగుతున్న కథానాయిక.. పూజా హెగ్డే. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠపురములోతో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రాధేశ్యామ్, అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రాలు చేస్తోంది పూజ. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాది వేసవిలోనే తెరపైకి రానున్నాయి. అలాగే హిందీలోనూ రెండు సినిమాలు చేస్తోంది మిస్ హెగ్డే. ఇదిలా ఉంటే.. తాజాగా తమిళంలోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నాయికగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట పూజ. కోలీవుడ్ స్టార్ విజయ్ కథానాయకుడిగా కోలమావు కోకిల (కో కో కోకిల) ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించనున్న సినిమాలో మెయిన్ లీడ్ గా నటించేందుకు అంగీకరించిందట ఈ బుట్టబొమ్మ. త్వరలోనే విజయ్ - నెల్సన్ కాంబినేషన్ మూవీలో పూజ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. కాగా, తన తొలి చిత్రమైన 2012 నాటి ముగమూడి (తెలుగులో మాస్క్) తరువాత తమిళనాట పూజా హెగ్డే చేయబోతున్న సినిమా ఇదే కానుండడం విశేషం.
రాజకీయాలకు బలౌతున్న ఐఏఎస్ అధికారులు
ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.
ఆంధ్ర లో బీజేపీ 'పంచ్' తంత్రం...
* దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో.... * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా.... * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు.. * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం .... జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు. రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి , ఇలా మాయమైపోయే జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్ ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు. ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు బీ జె పి, జన సేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి. ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం. ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
ఏపీలో వంద కోట్ల దందా.. రియల్ క్రైమ్ స్టోరీ
సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్‌లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.
కవిత, షర్మిలా రాజ్యసభకు వెళ్తారా?
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచనే ఎలా వుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? కవితా రాజ్యసభకు వెళ్తారా? అయితే హరిష్‌రావు ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్యకర్తల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు. రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్ఎస్ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్ కె.ఆర్.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం. కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది. షర్మిల ఆపద సమయంలో జగన్‌కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట. కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.
అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా... వైజాగ్ ఎపిసోడ్ నీతి ఏంటి?
రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి. అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.
రాజీవ్ గాంధీ మరణించాక ఆ సీక్రెట్ బయటపెట్టిన వాజపేయి!!
అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!
అనగనగా ఓ రెండు గుర్రాలు ఉండేవి. దేవతా గుర్రాలంటే మాటలా! పాలరాతి తెలుపుతో, నురగలాంటి జూలుతో మహా అందంగా ఉండేవి. వాయువేగంతో ముల్లోకాలూ చుట్టిపారేసేవి. జనం ఆ గుర్రాలను చూసినప్పుడల్లా ముక్కున వేలేసుకునేవారు. అంత అందమైన గుర్రాలను చూడటంతో తమ జన్మ ధన్యమైపోయిందని మురిసిపోయేవారు. కానీ ఆ గుర్రాల మనసులో ఏదో చింత! రెండు గుర్రాలనీ అంతా సమానంగా చూస్తున్నారు. రెండూ అందమైనవే అనీ, రెండూ వేగమైనవే అనీ పొగుడుతున్నారు. ‘అలా జరగడానికి వీల్లేదు! ఈ ప్రపంచంలో అన్ని గుర్రాలకంటే నేనే అందంగా ఉండాలి,’ అన్న ఆలోచన రెండు గుర్రాలలోనూ కలిగింది. అంతే వాటిలో ఒక గుర్రం నిదానంగా దేవుడి దగ్గరకి చేరింది. ‘భగవంతుడా! నన్ను ఇంత అందంగా అద్భుతంగా సృష్టించినందుకు కృతజ్ఞతలు. దేవతా గుర్రంగా నా జన్మ ధన్యమైపోయింది. కానీ నాదో చిన్న కోరిక,’ అంది ఆ గుర్రం. దాని మనసులో మాట గ్రహించినట్లుగా భగవంతుడు ఓ చిరునవ్వు నవ్వి- ‘నువ్వు దేవతా గుర్రానికి. నీ కోరికని తీర్చాల్సిందే! ఏం కావాలో కోరుకో!’ అన్నాడు. ‘నేను అందంగా ఉన్న మాట నిజమే కానీ ఇంకాస్త అందంగా ఉంటే బాగుండు అన్న దుగ్థ నన్ను తెగ వేధిస్తోంది. ఆలోచించి చూస్తే నాలో చాలా అవకరాలే కనిపిస్తున్నాయి. అవన్నీ సరైపోయి నేను ఇంకా అందంగా ఉండేట్లు ఆశీర్వదించండి స్వామీ!’ అని వేడుకుంది. ‘ సరే! నీలో నీకు ఏ లక్షణాలు లోపాలుగా కనిపిస్తున్నాయో చెప్పు. అవన్నీ సరిదిద్దుతాను,’ అంటూ అభయమిచ్చాడు భగవంతుడు. దాంతో ఆ గుర్రం తనలో తనకి లోపాలుగా తోచిన లక్షణాలన్నింటినీ ఏకరవు పెట్టడం మొదలుపెట్టింది. ‘ఈ తల చూసారా! మరీ మెడకి అంటుకుపోయినట్లుగా ఉంది. అది ఇంకాస్త పొడవు ఉంటే బాగుంటుంది. ముక్కు కూడా మరీ సన్నగా ఉందేమో అని నా అనుమానం. ఇక కాళ్లు ఇంకాస్త పొడవుంటే భలే ఉంటుంది. దయచేసి ఇవన్నీ సరిదిద్దురూ!’ అంది గుర్రం. ‘తథాస్తు! రేపు ఉదయం నువ్వు లేచి చూసుకునే సరికి ఈ లోపాలేవీ లేని సరికొత్త రూపం నీకు వస్తుంది,’ అన్నాడు భగవంతుడు. మొదటి గుర్రం సంతోషంగా భగవంతుని దగ్గర సెలవు తీసుకుంది. అది అలా వెళ్లిందో లేదో రెండో గుర్రం భగవంతుడి దగ్గరకు చేరుకుంది. ‘హే భగవాన్! ఆ గుర్రం తన అందాన్ని పెంచుకోవాలనే కోరికతోనే నీ దగ్గరకి వచ్చిందని నాకు తెలుసు. ఎలాగైనా ప్రపంచంలోనే గొప్ప గుర్రం అనిపించుకోవాలని దాని తపన. దాని అత్యాశని మీరు అణచాల్సిందే! అది తనలోని అందం మెరుగుపడేందుకు ఏ లక్షణాలనైతే కోరుకొందో... అవి నాలో మరింత ఎక్కువగా ఉండేలా వరం ఇవ్వండి,’ అని వేడుకుంది. ‘అయ్యో అదెంత భాగ్యం! అసలే నువ్వు దేవతా గుర్రానివి. నీ కోరికను తీర్చాల్సిందే! రేపు ఉదయం నువ్వు లేచి చూసుకునేసరికి ఆ లక్షణాలన్నీ నీలో కనిపిస్తాయి. తథాస్తు!’ అంటూ నవ్వాడు భగవంతుడు. ఆ రాత్రి గుర్రాలకి సరిగా నిద్రపట్టనే లేదు. ఎప్పుడెప్పుడ తెల్లవారుతుందా... నిబిడీకృతమైన తమ అందాన్ని ఎప్పుడెప్పుడు చూసుకుంటామా అన్న ఉద్విగ్నతతో ఆ రాత్రిని గడిపాయి. ఎప్పుడో అర్ధరాత్రి వాటికి మాగన్నుగా నిద్రపట్టింది. తెల్లవారాక చూసుకుంటే ఆ రెండు గుర్రాలకీ తమ కోరిక నెరవేరిన విషయం తెలిసిపోయింది. కాకపోతే... మొదటిగుర్రం కోరుకున్న లక్షణాల కారణంగా అది అచ్చు ఒంటెలా మారిపోయింది. మొదటి గుర్రం కోరుకున్న లక్షణాల మోతాదు తనలో మరింతగా ఉండాలని కోరుకోవడంతో రెండో గుర్రం జిరాఫీలా మారిపోయింది!!! తమ శరీరాల వంక చూసుకున్న గుర్రాలు రెండూ లబోదిబోమంటూ భగవంతుడి దగ్గరకు పరుగులెత్తాయి. ఆయనను చూస్తూనే ‘ఏమిటీ మాకీ అన్యాయం!’ అంటూ ఆక్రోశించాయి. ‘మీరు కోరుకున్న వరాన్ని యథాతథంగా తీర్చాను. ఇది అన్యాయం ఎలా అవుతుంది? ఆగమేఘాల మీద పరుగులు తీసే దేవతాశ్వాలు ఎలా ఉండాలో, మిమ్మల్ని అలా పుట్టించాను. కానీ మీకు మీ శరీరం పట్ల కానీ, దానిని అందించిన నా పట్ల కానీ నమ్మకం లేదు. అదే అసలైన అన్యాయం. మీరు నిజంగా నన్ను ఏదన్నా కోరుకోవాలని అనుకుంటే... ఎలాంటి నిస్సత్తువా దరిచేరకుండా బలిష్టంగా ఉండాలనో, కోరుకున్న గమ్యాలని సమర్థంగా చేరుకోవాలనో అడగాల్సింది! కానీ మీరు పైపై మెరుగులకే ప్రాధాన్యతని ఇచ్చారు. ఇక ఫలితం అనుభవించండి. ఇక నుంచీ మీరు దేవతా అశ్వాలు కాదు. ఒకరేమో ఒంటెలాగా ఎడారుల్లో తిరుగుతూ నానా బరువులూ మోయాల్సి ఉంటుంది. మరొకరేమో చిటారుకొమ్మ మీద దొరికే ఆహారంతో తృప్తిపడుతూ అడవులలో కాలం గడపాల్సి వస్తుంది. పోండి!,’ అనేశాడు భగవంతుడు. అదీ విషయం! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.
జంతువులూ మనిషి సాయాన్ని కోరతాయి
మనిషికి ప్రకృతి మీద చాలా ఆధిపత్యమే ఉండి ఉండవచ్చు. కానీ తన మనుగడ కోసం అతను ఇతర జంతువులు మీద ఆధరపడక తప్పలేదు. ఇప్పుడంటే అన్ని రకాల పనులకీ, అన్ని రకాల యంత్రాలు వచ్చేశాయి. కానీ ఒకప్పుడు కుక్కలు, గుర్రాలు, ఆవు లాంటి జీవుల సాయం లేకుండా మనిషి జీవితం గడిచేది కాదు. మనిషి ఎలాగైతే ఇతర జీవుల మీద ఆధారపడ్డాడో, మనిషి మచ్చికకు అలవాటు పడిన జీవులు కూడా అతని మీద ఆధారపడ్డాయని శాస్త్రవేత్తల వాదన. పైగా అతని చర్యలని అర్థం చేసుకోవడాన్ని అవి అలవాటు చేసుకున్నాయనీ వారి నమ్మకం. అందుకు అనుగుణంగానే కుక్కల మీద చేసిన కొన్ని పరిశోధనలలో, అవి తమ యజమానుల హావభావలను అద్భుతంగా అర్థం చేసుకోగలవని తెలిసింది. అలా తమ యజమాని మనసు ఎరిగి మసులుకోవడం వల్లే కుక్కలు మనిషికి అత్యంత విశ్వాసపాత్రమైన జంతువుగా నిలిచిపోయాయట. కుక్కల సంగతి సరే! మరి జంతువుల మాటేంటి! అన్న అనుమానం వచ్చింది జపానుకి చెందిన కొందరు పరిశోధకులకి. ఎందుకంటే దాదాపు ఆరువేల సంవత్సరాలుగా మనిషి గుర్రాలను మచ్చిక చేసుకుంటూనే ఉన్నాడు. ఇన్నేళ్లలో వారిమధ్య ఏదో ఒక బంధం ఏర్పడకపోదు కదా! అందుకనేనేమో గుర్రపు స్వారీ చేస్తూ ఉండటం వల్ల మనిషి మానసికంగానూ, శారీరికంగానూ ఆరోగ్యంగా ఉంటాడని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. మరి గుర్రాలు మనిషిని ఏమేరకు అర్థం చేసుకోగలుగుతున్నాయి! అన్న ఆలోచనతో ఒక ప్రయోగాన్ని నిర్వహించారు. పరిశోధకులు ఒక గుర్రపుశాలలోని ఓ బకెట్లో కొంత ఆహారాన్ని ఉంచారు. ఆహారం ఎక్కడ ఉంది అన్న విషయం గుర్రానికి తప్ప దాని సంరక్షకులకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఎప్పుడైతే సంరక్షకుడు ఆ గుర్రాన్ని చేరుకున్నాడో, గుర్రం అతడిని ఫలానా చోట ఆహారం ఉంది... అది నాకు అందించు అన్నట్లుగా అతడిని ఆహారం దిశగా తోస్తూ అనేక హావభావాలను ప్రదర్శించింది. ఆ తరువాత ఇదే ప్రయోగాన్ని మరోవిధంగా చేశారు. ఈసారి ఆహారం ఎక్కడ ఉందో సంరక్షకుడికి కూడా తెలిసేలా జాగ్రత్తపడ్డారు. అప్పుడు కూడా గుర్రం తనకి ఆహారం అందించమంటూ సంజ్ఞలు చేసింది కానీ... ఆ సంజ్ఞలలో మునుపటి తీవ్రత లేదు. అంటే తన సంరక్షకుడిని నిశితంగా గమనించడం ద్వారా అతనికి ఆహారం గురించి తెలుసో లేదో అన్న విషయాన్ని కూడా గుర్రాలు గ్రహించగలుగుతున్నాయన్నమాట. జీవి మనుగడ సాగించేందుకు ఈ నేర్పు చాలా అవసరం అంటున్నారు పరిశోధకులు. చింపాంజీల వంటి ఉన్నతశ్రేణి జీవులలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. తన ఎదురుగా ఉన్న జీవి హావభావాలను బట్టి, అతను చూసే చూపుని బట్టి... అతనికి ఒక విషయం తెలుసా లేదా! అతను ఏదన్నా ప్రమాదాన్ని పసిగడుతున్నాడా అన్న విషయాన్ని అవి గ్రహించగలుగుతాయి. ఇంతకీ పోయిపోయి గుర్రాల మీద ఈస్థాయి పరిశోధనలు చేయడం వల్ల ఉపయోగం ఉందా అంటే లేకం అంటున్నారు పరిశోధకులు! మనిషికి దగ్గరగా ఉండటం వల్ల పెంపుడు జంతువుల గ్రహణశక్తిలోనూ, ప్రవర్తనలోనూ ఎలాంటి మార్పులు వచ్చాయో గ్రహించడం వల్ల మనిషికీ, అతను మచ్చిక చేసుకున్న జంతువులకి మధ్య సంబంధాన్ని గురించి చాలా వివరాలను తెలుసుకోవచ్చునని అంటున్నారు. - నిర్జర.
మొబైల్ ఫోన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేందుకు ఏముంది! ఒక దశాబ్ద కాలంలోనే మొబైల్ ఫోన్ మన జీవితంలో భాగంగా మారిపోయింది. అన్నింటికీ మొబైల్ ఫోన్లనే వాడుకోమంటూ ఏకంగా నగదుని కూడా రద్దు చేసే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఒక సమాచార సాధనం మాత్రమే కాదు.. ఏ పనిలో అయినా తోడుగా ఉండే ఓ నేస్తం. మన హోదాకి సైతం ఓ సంకేతం! అందుకనే కొత్త మొబైల్‌ను ఎన్నుకొనేటప్పుడు ఆచితూచి ఎన్నుకుంటూ ఉంటాం. మరి అలాంటి ఎంపికలో మన మనస్తత్వం కూడా బయటపడుతుందా! అంటే అవుననే జవాబు వస్తోంది. ఇంగ్లండులోని లాంకెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లని వాడేవారి మనస్తత్వాల మధ్య తేడాలు ఏమన్నా ఉన్నాయేమోనని పరశీలించారు. అందులో... ఆండ్రాయిడ్ ఫోనుని ఇష్టపడేవారిలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించాయి- - మగవారు ఎక్కుగా ఈ ఫోనుని ఇష్టపడుతున్నారు. - అందులోనూ పెద్దలు ఆండ్రాయిడ్ ఫోన్లంటే ఆసక్తి చూపుతున్నారు. - ఆండ్రాయిడ్ వాడకందారులు సమాజానికి అనుగుణంగా నడుచుకునే మనస్తత్వం కలిగి ఉంటారట. - వ్యక్తిగత లబ్ది కోసం ఇతరులను ఇబ్బంది పెట్టనివారై ఉంటారు. - సంపద, హోదా వంటి తాపత్రయాల జోలికి పోరు. - నిజాయితీగా ఉండేందుకు అధిక ప్రాధాన్యతని ఇస్తారు. ఐఫోను వాడకందారులలో ఈ స్వభవాలు కొట్టొచ్చినట్లుగా కనిపించాయి- - యువకులు ఎక్కువగా ఫోనుని ఇష్టపడుతున్నట్లు తేలింది. - యాండ్రాయిడ్‌తో పోల్చుకుంటే ఆడవారి మనసు ఐఫోను మీదే లగ్నమవుతుందట. - ఒక వస్తువుని ఎంచుకునే విషయంలో వీరు ఇతరులతో రాజీపడరు. - వీరు ఫోనుని ఒక సాధనంగానే కాకుండా, తమ హోదాకు చిహ్నంగా భావిస్తుంటారు. - బహిర్ముఖ మనస్తత్వంతో (extrovert) అందరితో కలివిడిగా కలిసిపోయేలా ప్రవర్తిస్తుంటారు. ఈ వివరాలన్నింటి ఆధారంగా పరిశోధకులు ఒక ప్రోగ్రాంను కూడా రూపొందించేశారట. దానికి మన మనస్తత్వానికి సంబంధించిన కొన్ని వివరాలను అందిస్తే, మనం ఏ ఫోనుని వాడుతున్నామో చెప్పేస్తుంది. మనం వాడుతున్న ఫోను మన జీవితంలో విడదీయరాని భాగం అయిపోయింది కాబట్టి... దానిని మన మనస్తత్వానికి ఒక డిజిటల్ రూపంగా భావించడంలో తప్పులేదంటున్నారు. అందుకనే మున్ముందు జనం డౌన్లోడ్ చేసుకునే అప్లికేషన్లని బట్టి కూడా వారి మనస్తత్వాన్ని అంచనా వేసే ప్రయత్నం చేయవచ్చునని అంటున్నారు. - Nirjara
భారతీ సిమెంట్స్ కే సర్కార్ బల్క్ ఆర్డర్లు! ఖజానా దోచేస్తున్న జగన్ ఫ్యామిలీ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సిమెంట్ కంపెనీ లాభార్జనలో దూసుకుపోతోంది... కాదు కాదు సర్కార్ ఖజానాను అప్పనంగా దోచేస్తూ ఆదాయం పెంచుకుంటోంది. ఇదో ఎవరో విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణ కాదు. స్వయానా ఏపీ సర్కార్ చెబుతున్న లెక్కలు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో ప్రభుత్వ పనుల కోసం... జగన్ రెడ్డి సర్కార్ అధికారికంగా కొనుగోలు చేసిన సిమెంట్ ఆర్డర్లలో మెజార్టీ వాటా భారతీ సిమెంట్స్ కే దక్కింది. 2020 ఏప్రిల్ నుంచి జనవరి 18 వరకు 2021 వరకు.. 10 నెలల కాలంలో 2,28,370.14 మెట్రిక్ టన్నుల సిమెంటు కోసం భారతీ సిమెంట్స్ కు ఆర్డర్లు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఏపీ సర్కార్ ఆర్డర్లను బల్క్ గా కొట్టేసిన ఈ భారతీ సిమెంట్స్ సంస్థ ఎవరిదో తెలుగు ప్రజలందరికి తెలుసు. భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుటుంబానికి 49 శాతం వాటా ఉంది. సీఎం జగన్ రెడ్డి భార్య భారతీనే ఆ సంస్థ డైరెక్టర్. వికాట్ అనే ఫ్రెంచ్ సంస్థ 2010 లో భారతి సిమెంట్‌లో 51 శాతం వాటాను సొంతం చేసుకుంది. అంటే సీఎం జగన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న భారతీ సిమెంట్ కు.. బల్క్ ఆర్డర్లు ఇస్తూ ప్రజా ధనాన్ని దోచి పెడుతోంది ఏపీ సర్కార్. బహిరంగ మార్కెట్ లో సిమెంట్ రేటు పెరిగేలా సిండికేట్ నడిపి.. తర్వాత ప్రభుత్వ పనులకు సామాజిక బాధ్యత కింద తక్కువ రేటుకే సరఫరా చేస్తున్నామనే కవరింగ్ ఇస్తూ.. ఈ నయా సిమెంట్ దోపిడికి జగన్ ఫ్యామిలీ తెర తీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. భారతీ సిమెంట్స్ తర్వాత ఏపీ ప్రభుత్వం నుంచి ఎక్కువ ఆర్డర్లు పొందింది ఇండియా సిమెంట్స్ లిమిటెడ్. గత 10 నెలల కాలంలో 1,59,753.70 మెట్రిక్ టన్నుల ఆర్డర్ పొందింది ఈ సంస్థ. ఇది భారతి సిమెంట్స్ కంటే 30 శాతం తక్కువ. అయితే ఈ ఇండియా సిమెంట్స్ ఎవరిదో కాదు. వైఎస్ జగన్ మరియు ఇతరులపై సిబిఐ నమోదు చేసిన క్విడ్ ప్రో కో కేసులో ఇండియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసన్ ఒకరు. అంతేకాదు భారతి సిమెంటులో రూ .95.32 కోట్ల పెట్టుబడులు కూడా పెట్టింది ఇండియా సిమెంట్స్. ఏపీ సర్కార్ నుంచి ఆర్డర్లు ఎక్కువగా పొందిన మూడో సంస్థ పెన్నా సిమెంట్స్. ఏపీ ప్రభుత్వం నుంచి 1,50,325.02 మెట్రిక్ టన్నుల కొనుగోలు ఆర్డర్లు పెన్నా సిమెంట్స్ కు గత 10 నెలల కాలంలో వచ్చాయి. పెన్నా సిమెంట్స్ ఓనర్ కూడా జగన్ పై నమోదైన సీబీఐ క్విడ్ ప్రో కేసులో నిందితుడే. మొత్తంగా జగన్ కుటుంబానికి చెందిన , ఆయన సీబీఐ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తుల సంస్థలకే ఏప్రిల్ 2020 నుంచి జనవరి 2021 మధ్య మొత్తం ఏపీ ప్రభుత్వ కొనుగోలు ఆర్డర్లలో మూడవ వంతు వాటా దక్కింది. ఏప్రిల్ 2012 మరియు సెప్టెంబర్ 2014 మధ్య సిబిఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లలో... 6, 7, 8 చార్జిషీట్లలో డాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, రఘురామ్ సిమెంట్స్ (భారతి సిమెంట్ యొక్క పూర్వపు పేరు) మరియు పెన్నా సిమెంట్స్ క్విడ్ ప్రో కోకు సంబంధించినవి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కొన్ని కంపెనీల వైపు మొగ్గు చూపిందని, తక్కువ ధరలకు భూమిని కేటాయించిందని, మైనింగ్ లీజులు ఇవ్వడానికి చట్టాలను అధిగమించిందని లేదా నిబంధనలకు విరుద్ధంగా అదనపు నది నీటిని కేటాయించిందని సిబిఐ ఆరోపించింది, దీనికి బదులుగా వారు జగన్ రెడ్డి యాజమాన్యంలోని సంస్థలలో పెట్టుబడులు పెట్టారని తెలిపింది. అప్పడు వైఎస్సార్ హయాంలో క్విడ్ ప్రోకోలో లాభపడ్డారనే కేసులు ఎదుర్కొంటున్న శ్రీనివాసన్ ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్ సంస్థలే.. ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం నుంచి సిమెంట్ ఆర్డర్లు భారీగా పొందాయన్న మాట. ఏపీ ప్రభుత్వ అధికారిక లెక్కలతో .. వైఎస్ హయాంలో వెలుగులోనికి వచ్చిన క్విడ్ ప్రోకో అక్రమ దందాకు మించిన దోపిడి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందని తేలుతోంది. భారతి సిమెంట్ నేతృత్వంలోని సిమెంట్ కంపెనీలు సిండికేట్ ఏర్పాటు చేశాయని టీడీపీ ఆరోపిస్తోంది. అందుకే గత కొన్ని నెలల్లో 50 కిలోల సంచికి 220-250 రూపాయల నుండి 350-400 రూపాయలకు పెంచారని చెబుతోంది. భారతి సిమెంటుకు ప్రయోజనం చేకూర్చడానికి ఇది జరిగిందంటున్నారు టీడీపీ నేతలు. బహిరంగ మార్కెట్లో సిమెంట్ ధరల పెరుగుతున్నా జగన్ సర్కార్ పట్టించుకోలేదని.. సర్కార్ కు తక్కువ రేటుకు ఇస్తున్నారనే సాకుతో భారతీ సిమెంట్స్ కు ఆర్డర్లు ఇవ్వొచ్చని కుట్ర చేశారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభీ ఆరోపించారు. సర్కార్ ఖజానాను సీఎం సొంత సంస్థ కొట్టేస్తుండగా.. సామాన్య జనాలు మాత్రం బహిరంగ మార్కెట్ లో ఎక్కువ రేటుకు సిమెంట్ కొనుగోలు చేస్తూ భారం మోస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ సంస్థతో పాటు అతనితో సంబంధాలున్న సంస్థలకే ప్రభుత్వ సిమెంట్ ఆర్డర్లు ఇచ్చారన్న ఆరోపణలపై స్పందించిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి... ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. భారతి, ఇండియా, పెన్నా సిమెంట్స్ సంస్థలు.. తక్కువ రేటుకే షెడ్యూల్ ప్రకారం సరఫరా చేయగలిగినందుననే వారికి సర్కార్ నుంచి ఎక్కువ ఆర్డర్లు వచ్చాయన్నారు. ఇతర కంపెనీలకు సమస్యలున్నాయని, షెడ్యూల్ ప్రకారం సరఫరా చేయలేకపోయాయని చెప్పారు. వైఎస్ఆర్ నిర్మాన్ అనే పోర్టల్ ద్వారా కొనుగోలు ఆర్డర్లు చేస్తామని తెలిపారు. అన్ని ప్రభుత్వ విభాగాలు తమ అవసరాలను జిల్లా కలెక్టర్లకు పంపుతాయని, అప్పుడు వైయస్ఆర్ నిర్మాన్ ద్వారా ఏపి సిమెంట్ తయారీదారుల సంఘం (ఎపిసిఎంఎ) కు ఆర్డర్లు ఇస్తారని చెప్పారు. APCMA దాని 23 తయారీదారులలో ఆర్డర్లను పంపిణీ చేస్తుందన్నారు. ఇదంతా పారదర్శకంగా జరుగుతుందంటున్నారు గౌతం రెడ్డి.
గొల్లపూడిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత.. దీక్షకు దిగిన దేవినేని ఉమా
ఏపీ రాజధాని అమరావతి తరలింపును వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం ఈరోజుతో 400వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల ఉద్యమానికి మద్దతుగా టీడీపీ దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో గొల్లపూడి సెంటర్ మొత్తం ప్రస్తుతం పోలీసుల వలయంలో ఉంది. రైతు ఉద్యమానికి మద్దతుగా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తన నివాసంలో దీక్ష చేపట్టారు. దీంతో ఆ సమీపంలోని నివాసం ఉండే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం గొల్లపూడి ప్రాంతం మొత్తం కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. మరోపక్క దేవినేని దీక్షకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. రైతుల దీక్షలకు టీడీపీ నాయకులు దులిపాళ్ల నరేంద్ర తన మద్దతు తెలిపారు. ఇది ఇలా ఉండగా నిన్న కూడా గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దేవినేని ఉమ పై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టాలని దేవినేని సిద్ధం కాగా.. ఆయనను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
టీఆర్ఎస్, బీజేపీలను తరిమికొడతామన్న రేవంత్ రెడ్డి