త్రిష పై ఫైర్ అవుతున్న నయనతార!
on Jul 16, 2025
తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన నయనతార(Nayanthara),త్రిష(Trisha)రెండు దశాబ్డల నుంచి అనేక హిట్ చిత్రాల్లో నటిస్తు, అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో తమకంటు ఒక క్రేజ్ ని సంపాదించుకున్నారు. తెలుగులో కూడా అంతే స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ ఇద్దరు తెలుగు నటీమణులు కాదంటే కూడా నమ్మలేని పరిస్థితి.
ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే టాక్ తమిళ చిత్ర పరిశ్రమలో ఎప్పట్నుంచో వినిపిస్తూనే ఉంది. ఒకరికి వచ్చిన మూవీ ఆఫర్స్ మరొకరు అందిపుచ్చుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. రీసెంట్ గా ఇలాంటి సంఘటనే మరొకటి జరిగినట్టుగా తమిళ చిత్ర పరిశ్రమలో వార్తలు వస్తున్నాయి. 1990 వ సంవత్సరంలో విడుదలై ఘన విజయాన్ని అందుకున్న మూవీ 'ఆదివెళ్లి'. భక్తి ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మరోసారి రీమేక్ చేయాలనే ఆలోచనలో ఒక బడా నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నాడని, ఈ మేరకు ప్రధాన పాత్రలో చెయ్యడానికి నయనతారని సంప్రదించడంతో సుమారు పదిహేను కోట్లు రూపాయిల రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసిందట. దీంతో సదరు నిర్మాత త్రిషని సంప్రదిస్తే త్రిష వెంటనే ఒప్పుకుందని సమాచారం.
ఈ విధంగా ఒకరి ఆఫర్స్ ని మరొకరు దక్కించుకోవడం ఇదే తొలిసారి కాదు. 2008 లో ఇళయదళపతి 'విజయ్'(VIjay)హీరోగా వచ్చిన 'కురువి' లో తొలుత నయనతార నే హీరోయిన్. కానీ చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల త్రిష కి ఆ అవకాశం వచ్చింది. ఈ మూవీ దగ్గరనుంచే ఆ ఇద్దరి మధ్య వైరం స్టార్ట్ అయ్యిందని టాక్. ప్రముఖ కామెడీ నటుడు 'ఆర్ జె బాలాజీ'(Rj Balaji) దర్శకత్వంలో వచ్చిన 'మూకుమ్మతి అమ్మన్' ని బాలాజీ మొదట త్రిషకే చెప్పాడు. ఆమె చేయనని అనడంతో నయన్ తార చేసి హిట్ ని అందుకుంది. ఇటీవల వచ్చిన 'కమల్ హాసన్(Kamal Haasan)'మణిరత్నం'(Mani Rathnam)ల 'థగ్ లైఫ్'(Thug Life)లో త్రిష క్యారక్టర్ కి తొలుత నయనతార ని అనుకున్నారు. కానీ ఆమె చేయనని అనడంతో త్రిష చేసి పరాజయాన్ని అందుకుంది. మరి నయనతార వదులుకున్న 'ఆదివెళ్లి' రీమేక్ తో త్రిష హిట్ ని అందుకుంటుందేమో చూడాలి. ఒకప్పుడు మాత్రం ఈ ఇద్దరు మంచి ఫ్రెండ్స్

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
