ఆదిపురుష్ పై కోర్టుకు వెళ‌తా...మిశ్రా

టాలీఉడ్ సూప‌ర్ స్టార్ ప్ర‌భాస్ ఏ ముహూర్తాన రాముడు వేషానికి అంగీక‌రించాడో గాని  ఆదిపురుష్ సినిమా ఇంకా రిలీజ్ కావ‌డానికి ముందు వ‌చ్చిన టీజ‌ర్  అత‌ని ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీస్తోంది. ఈ సినిమాలో రావ‌ణుడుగా సైఫ్ అలీఖాన్ చేశాడు.  రావ‌ణుని  ఆహార్య‌మే దారుణంగా ఉంద‌ని అప్పుడే వ్య‌తిరేక‌త వెల్లు వెత్తుతోంది. ఇపుడు ప్ర‌తీనిమిషం మ‌రింత ఇబ్బందులు వ‌చ్చి ప‌డుతున్నాయి. తాజాగా మ‌ధ్య‌ ప్ర‌దేశ్ హోంమంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా అస‌లా సినిమాలో హ‌ను మంతుడిని కూడా లెద‌ర్ బెల్ట్ క‌ట్టుకున్న‌ట్టు చూపించ‌డం మీద విప‌రీత అభ్యంత‌రం వ్య‌క్తంచేశారు. ఇలాంటి అనేక అభ్యంత‌ర అంశా లున్నా య‌ని వాటిని సినిమా లోంచి తొల‌గించ‌కుంటే ముఖ్యంగా హ‌నుమంతుడిని అలా చూపిస్తే తీవ్ర ప‌రిణా మాలు ఎదుర్కొన‌వ‌ల‌సి వ‌స్తుందని ఆయ‌న హెచ్చ‌ రించారు. 

ప్ర‌భాస్‌, కృతీసన‌న్‌, ద‌ర్శ‌క‌కుడు ఓమ్ రౌత్ ఆదిపురుష్ టీజ‌ర్‌ను అయోధ్య‌లో  ఆదివారం విడుద‌ల చేశా రు. రామాయ‌ణం ఆధారంగా తీసిన ఈ చిత్రంలో రాముడిగా ప్ర‌భాస్‌, లంకేసుడిగా సైఫ్ ఆలీఖాన్ న‌టిం చారు. కాగా టీజ‌ర్ తాను చూశాన‌ని, చూసిన మేర‌కు రావ‌ణుడు, హ‌నుమంతుని పాత్ర‌ల ఆహార్యం అంగీ కార‌యోగ్యంగా లేద‌ని మిశ్రా విలేక‌రుల‌తో అన్నారు. మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కూ చ‌దివిన రామాయ‌ణ గాధ‌ల్లో, చూసిన చిత్రాల్లోనూ హ‌నుమంతుడు చెవి రింగులు, చ‌క్క‌టి నొక్కుల జుత్తు, చేతిలో జండాతో ఆకాశంలో ఎగురుతూ పోతున్న దృశ్య‌మే క‌ళ్ల‌ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. కానీ ఈ చిత్రంలో దారుణంగా లెద‌ర్ దుస్తుల్లో చూపించార‌న్నారు. ఇదంతా భార‌తీయుల‌, హిందువుల న‌మ్మ‌కాన్ని దెబ్బ‌తీయ‌డ‌మేన‌ని ఆయ‌న ఆగ్ర‌హించారు. 

చిత్రంలో అలాంటి అభ్యంత‌ర‌క‌ర అంశ‌లున్నాయ‌ని, వాటిని వెంట‌నే తొల‌గించాల‌ని చిత్ర నిర్మాత ఓమ్ రౌత్‌కి లేఖ రాశాన‌ని మిశ్రా అన్నారు. సినిమా హాళ్ల‌లో ఇదే చిత్రాన్ని ప్ర‌ద‌ర్శిస్తే మాత్రం చ‌ట్ట‌ ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని మిశ్రా హెచ్చ‌రించారు. గ‌తంలోనూ  కాళీ డాక్యుమెంట‌రీ చిత్రం మీద కూడా  మిశ్రా అభ్యంత‌రం వ్యక్తం చేశారు. మాత ఎల్‌జిబిటి జండా ప‌ట్టుకుని, మ‌రో చేత్తో సిగ‌రెట్టు తాగు తున్న‌ట్టు పోస్ట‌ర్లు పెట్ట‌డం మీద ఆయ‌న ఆగ్ర‌హించారు. అనేక‌మంది వ్య‌తిరేకించ‌డంతో రాష్ట్రంలో ఆ చిత్రాన్ని నిషేధించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu