విడ‌గొట్టి  సారీ చెబితే ఎలా డిగ్గీరాజా?

ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు, చిన్నప్పుడు విడిపోవాల్సివ‌స్తుంది. చాలాకాలం త‌ర్వాత పెద్దాయ‌న వ‌చ్చి మిమ్మల్నివిడ‌గొట్టింది మా వాళ్లే.. అందుకు సారీ.. ఇపుడు ప‌రిస్థితులు మాత్రం మీరు తెచ్చుకున్న‌వి గ‌నుక మ‌మ్మల్ని కారకులు చేయ‌వ‌ద్దు.. అని, చేసిన త‌ప్పిదాన్ని అంగీకరించి వెళ‌తాడు.. ఇదో పాత తెలుగు సినిమా సీన్‌. కాంగ్రెస్ నాయ‌కుడు దిగ్విజ‌య్ సింగ్  తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగిన ఎనిమిదేళ్ల త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి అలాంటి డైలాగ్ చెప్పి వెళ్లారు. 

కాగా, కాంగ్రెస్ యువ‌నేత రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్రలో భాగంగా ఈ నెల 18న ఆంధ్రా ప‌ర్య‌ ట‌న‌కు రానున్నారు. యాత్ర‌కు మ‌ద్దతునివ్వాల‌ని, ఎలాంటి అడ్డంకులు క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకో వాల‌న్న సం దేశం ఇమిడి ఉంద‌నే అనుకోవాలి. 

చెయ్యాల్సిందంతా చేసి త‌న్నుకు చావండి.. అన్న‌ట్టుగా ఉంది ఆంధ్ర‌, తెలంగాణ విభ‌జ‌న వ్య‌వ‌హారం. పైకి విడిపోయినా మ‌నం అన్న‌ద‌మ్ముల‌మే, మ‌న భాష తెలుగు భాషా. ఎన్టీఆర్‌, నాగేశ్వ‌ర్రావుల‌నే  మేమూ ప్రేమిస్తున్న‌దీను, మ‌న పాట తెలుగు పాట ..అంటూ భారీ డైలాగుల‌తో కేసీఆర్ అల్లాయ్ బ‌ల్లాయ్ కార్య క్ర‌మాలు చేప‌ట్టారు. కొత్త‌ల్లో అన్నీ అలానే ఉన్నాయి. క్ర‌మేపీ అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డింది.  జ‌గ‌న్ ఆంధ్రాలో అధికారంలోకి రావ‌డానికి తానే కార‌ణ‌మ‌ని ప్ర‌చారం చేసుకున్న కేసీఆర్ ఆ త‌ర్వాత నుంచీ నీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగంలో విభ‌జ‌న అంశాల మీద మొండి ప‌ట్టుద‌లే ప్ర‌ద‌ర్శిస్తూన్నారు.  

రెండు రాష్ట్రాలు ఇంకా విభ‌జ‌నాంశాల‌పై రావ‌ల‌సిన వాటిపై ఇంకా చ‌చ్చించుకోవాల్సి ఉందని సానుకూ లంగా స్పంది స్తేనే అన్నీ సాధ్య‌మ‌వుతాయ‌ని వారానికోసారి హెచ్చ‌రిస్తున్నారు. విభ‌జ‌న స‌మ‌యంలో అన్ని స‌ర్దుకుపోతాయ‌ని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కేంద్రం అందుకు అన్ని విధాలా స‌హ‌క‌రిస్తుంద‌నీ హామీ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ స్వ‌యంగా కేంద్రంలో అధికార పీఠం ద‌క్కించుకోలేక‌పోయింది. కానీ ఆ విభ‌జ‌న అంత మ‌న స్పూర్తిగా ఆనందించాల్సిన అంశం కాద‌ని ఇపుడు దిగ్విజ‌య్ సింగ్ వాపోవ‌డ‌మే హాస్యా స్ప‌దం. 

భారత్‌కు భిన్నత్వంలో ఏకత్వం బలమని, ఇపుడు బీజేపీ ఏక‌త్వభావ‌న‌నే  విచ్చినం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఆయ‌న క‌ర్నూలులో మాట్లాడుతూ రాష్ట్ర విభ జన ఏపీకి గాయం చేసిందని అంగీరిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ  చేపట్టిన భారత్ జోడో యాత్ర  మొదలై నెల రోజులు కూడా పూర్తి కాకుండానే బీజేపీ, ఆర్ఎస్ఎస్ యాత్ర గురించి  భయపడుతున్నాయని అన్నా రు. భారత్‌లో నిరుద్యోగం, పేదరికం పెరుగుతోందని, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందన్నారు. ఏపీలో కాం గ్రెస్ ఖచ్చితంగా బలపడుతుందని దిగ్విజయ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu