మాల్యా అరెస్ట్ స్కెచ్ గీసింది అరుణ్ జైట్లీనా..?

బ్యాంకులకు లక్షల కోట్లు ఎగనామం పెట్టి..లండన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా ఎట్టకేలకు అరెస్టయ్యారు. ఆయన్ను అరెస్ట్ చేయించడానికి భారత ప్రభుత్వం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఐబీ, సీబీఐ పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఎందుకంటే మాల్యా తలదాచుకుంది మనదేశంలోని ఏదో మారు మూల ప్రాంతంలో కాదు..బ్రిటన్ రాజధాని లండన్‌లో. మనదేశపు చట్టాలు వేరు..అక్కడి నిబంధనలు వేరు.

 

అందుకే ఎన్ని సార్లు మన దర్యాప్తు బృందాలు ముందుకు అడుగువేసినా రూల్స్ వెనక్కు లాగేవి. చివరికి మాల్యాను బలవంతంగా దేశం నుంచి పంపించేయాలని భారత విదేశాంగ శాఖ బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది. కానీ భారత్ విజ్ఞప్తిని యూకే తిరస్కరించింది. అయితే మాల్యాను అక్కడి నిబంధనల ప్రకారమే దారిలోకి తెచ్చుకోవాలని భావించిన ఈడీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సహాయాన్ని కోరింది. దీనిలో భాగంగా 2 నెలల క్రితం లండన్ పర్యటనకు వెళ్లిన జైట్లీ అక్కడి కీలక నేతలను కలిసి..స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు.

 

బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా భారత్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని రూ.9000 కోట్లకు పైగా రుణాలు ఎగ్గొట్టారని లండన్ హైకమిషన్ అధికారులకు వెల్లడించారు. ఉద్దేశ్యపూర్వకమైన ఎగవేతదారుడిగా ఉంటూ..కేవలం చట్టం నుంచి తప్పించుకోవడం కోసమే మాల్యా బ్రిటన్‌లో తలదాచుకుంటున్నారని జైట్లీ అధికారులకు వెల్లడించారు. ఆయనే సీనియర్ న్యాయవాదులతో మాట్లాడి..పక్కాగా కేసును రూపొందించడంతో స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అదుపులోకి తీసుకున్నారు. అంటే రెండు నెలల నుంచి వేటాడితే గానీ లిక్కర్ కింగ్ ఈడీ గాలానికి చిక్కలేదన్న మాట. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu