అమ్మ కేబినెట్‌లో తెలుగోడు..
Published on: Mon May 23, 2016 1:10PM

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణం చేశారు. మద్రాస్ యూనివర్శిటి సెంటినరి హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ రోశయ్య, అమ్మతో ప్రమాణ స్వీకారం చేయించారు. జయ తన కేబినెట్‌లో 28 మందికి స్థానం కల్పించారు. వారిలో ఓ తెలుగు వ్యక్తి ఉండటం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే టికెట్‌పై బరిలోకి దిగిన రాజు అనే ఎమ్మెల్యే తెలుగువ్యక్తి. ఆయనకు జయలలిత ఐటీశాఖను అప్పగించారు.


