కేసుల వరకూ వచ్చిన స్వాముల లడాయి..
posted on May 17, 2016 3:08PM

గత వారం రోజుల నుండి స్వాముల మధ్య మత పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. సాయిబాబా పై రమణానంద మహర్షి కి, స్వరూపానంద సరస్వతికి మధ్య వాగ్వాదం జరిగిన సంగతి విదితమే. అంతేకాదు ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, రమణానంద మహర్షి మధ్య కూడా గొడవలు చెలరేగాయి. అయితే ఇప్పుడు ఈ గొడవలు కాస్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చేంత వరకూ వచ్చింది. శివశక్తిసాయి ఛానల్‌లో ప్రసారమవుతోన్న వార్తలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ.. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని చాగంటి సత్సంగ్ సభ్యులు విశాఖ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేసి.. ఏ-1గా జ్యోతిర్మయి భవానీ, ఏ-2గా రమణానంద మహర్షిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.