అమరావతిలో.. పొంగిపొర్లుతున్న కొండవీటి వాగు

రాయలసీమను అస్తవ్యస్తం చేసిన భారీ వర్షాలు నేడు నవ్యాంధ్ర రాజధానిపై ఫోకస్ చేసినట్లున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అమరావతి ప్రాంతంలో ప్రవహించే కొండవీటి వాగులో భారీగా వరద నీరు చేరింది. దీంతో వందలాది ఎకరాల పంట నీట మునిగింది.. పలు చప్టాలపై రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. కుమ్మరిపాలెం వద్ద వాగు పొంగి అచ్చెంపేట- క్రోసూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి జనజీవనం స్తంభించిపోయింది. మరో వైపు రాగల 48 గంటల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu