శ్రీశైలానికి పొటెత్తుతున్న వరద

గత కొద్ది రోజులుగా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ పొంగిపొర్లుతోంది. దీంతో వాగులు, వంకలు ఏకమై కృష్ణలో భారీ వరదను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణానదీ పరిధిలోని ప్రాజెక్ట్‌లు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి లక్షా 45 వేల 696 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఆనకట్ట ఏడు గేట్ల ద్వారా లక్షా 92 వేల 312 క్యూసెక్కుల నీటీని నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. మరోవైపు శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌కు మరో 73వేల 800 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.