అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
posted on: Oct 15, 2017 11:18AM

కొద్ది రోజుల క్రితం లాస్‌వేగాస్‌లో మ్యూజిక్ ఫెస్టివల్‌లో కాల్పులు జరిగి 70 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లిపోయింది. వర్జీనియా స్టేట్ యూనివర్శిటీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. క్యాంపస్‌లోకి చొరబడిన దుండగుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు యూనివర్శిటీని చుట్టుముట్టారు.. క్యాంపస్‌ను మూసివేసి.. ఆ ప్రాంతన్నంతా ఖాళీ చేయించారు. ఈ వైపు ఎవరూ రావొద్దని సోషల్ మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం దుండగుడి కోసం పోలీసులు యూనివర్శిటీని జల్లెడ పడుతున్నారు.






