అధికారిక కోతలు మొదలు

 

కొత్త సంవత్సరంలో జనవరి నెల నుండే అనధికారిక విద్యుత్ కోతలు మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, మార్చి1వ తేది నుండి అధికారికంగా కోతలు మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించింది. హైదరాబాదుతో సహా అన్ని ప్రధాన నగరాలలో రోజుకు 2గంటలు చొప్పున కోతలు విదించబోతున్నారు.

 

ఇక ఇప్పటికే, రోజుకి 3-4గంటలు కోతలు విదిస్తున్న జిల్లా కేంద్రాలలో ఇప్పుడు రోజుకి 4గంటలు, పురపాలక సంఘాలలో 6 గంటలు, మండల కేంద్రాలలో 8 గంటలు, గ్రామాలలో రోజుకి 12 గంటలు విద్యుత్ కోతలు రేపటి నుండి ఖచ్చితంగా అమలుకానున్నాయి. బహుశః ప్రస్తుతం ఉన్న అనధికారిక కోట్లకు ఇవి అదనంగా ఉండవచ్చును. అంటే, ప్రస్తుతం నగరాలలో అనడికారికంగా 2 నుంచి 3గంటలవరకు విద్యుకోతలు అమలవుతున్నాయి. అవి ఇక రోజుకి 5గంటలు అయ్యే అవకాశం ఉంది. నగరాలలో పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే, ఇక పల్లెలో ఎలాఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

 

మర్చి నెల మొదటివారంలో ఇంతభారీ విద్యుత్ కోతలు తప్పనపుడు, మే జూన్ నెలల్లో పరిస్థితిని తలుచుకోవడానికే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. దీని ప్రభావం వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపారాలు, ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులు బాగా దెబ్బతినే అవకాశం ఉంది. తద్వారా నిరుద్యోగం పెరిగి అది సామజిక సమస్యలకు దారి తీసే అవకాశం కూడా ఉంది.

 

గత రెండు మూడు సంవత్సరాలుగా నానాటికి విద్యుత్ సమస్య తీవ్రతరం అవుతున్నదని గ్రహించినప్పటికీ, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేప్పట్టకుండా, కొత్త విద్యుత్ ప్లాంటుల స్థాపనకు పూనుకొనక, కేవలం తెలంగాణా అంశం, పార్టీలో అసమ్మతి రాజకీయాలు వంటి వాటితో కాలక్షేపం చేస్తువచ్చిన ప్రభుత్వం, విద్యుత్ సంక్షోభం నివారణకు కనీస చర్యలు కూడా చేప్పటకపోవడమే నేటి ఈ దుస్థితికి కారణం.

 

దాహం వేసినప్పుడు నుయ్యి త్రవ్వడం మొదలుపెట్టినట్లు, విద్యుత్ సంక్షోభం తీవ్రతరమయిన తరువాత, కిరణ్ కుమార్ గుజరాత్ రాష్ట్రం నుండి గ్యాస్ ఇప్పించమని కోరడం విచిత్రం. ఆ రాష్ట్రంలో ఇదే దుస్థితి నెలకొన్నపుడు అక్కడి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆ పరిస్థితులను ఏవిధంగా అదిగమించాడో తెలుసుకోవాలంటే పార్టీల బేషజాలు, అహం అడ్డొస్తాయి. ప్రభుత్వాల చేతకానితనానికి, నిర్లిప్త వైఖరికి ప్రతీసారీ ప్రజలే మూల్యం చెల్లించక తప్పట్లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu