చంద్రబాబు పాదయాత్ర: 29 సార్లు పెట్రోలు, డీజిల్ పెంపు

 

 

chandrababu padayatra, chandrababu mee kosam yatra, chandrababu mopidevi yatra

 

 

కృష్ణాజిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు. టీడీపీ పాలనలో సంస్కరణలు బలంగా అమలు జరిగాయని చెప్పుకొచ్చారు. తమ హయాంలోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయనే విషయం ఇప్పుడిప్పుడే జనం గ్రహిస్తున్నారని వివరించారు. అవినీతిపరులను మదర్ థెరెస్సా, అంబేద్కర్, గాంధీవంటి మహాత్ముల ఫొటోలతో జతచేయడం విచారకరమని చెప్పారు.


కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. పెదప్రోలు, కప్టాన్ పాలెం, కాసానగర్, చల్లపల్లి, వక్కలగడ్డ, చిట్టూర్పు మీదుగా 15,1 కిలోమీటర్లు నడిచి వేములపల్లి చేరుకున్నారు. అంతకుముందు..మోపిదేవి ప్రధాన సెంటరులో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడారు.


అవినీతిరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ప్రజలపై భారాన్ని మోపడం మాత్రమే నేర్చుకున్న ఈ ప్రభుత్వాలు 29 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలుపెంచి ఘనత వహించాయని దుయ్యబట్టారు. టిడిపి అదికారంలోకి వస్తే ఆడపిల్లలు పుడితే పాతికవేల రూపాయలు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే లంబాడీలకు జిల్లాలవారీగా రిజర్వేషన్లు ఇస్తామని ఆయన ప్రకటించారు. ముస్లింలకు ఎనిమిది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆయన అన్నారు. దేశంలో గజదొంగలుపడ్డారని, వైఎస్ తన కొడుక్కి లక్ష కోట్లు దోచిపెట్టారని విమర్శించారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu