వైసీపీ ఇన్ ఛార్జ్ నారాయణ రెడ్డిని అందుకే చంపారట...!
posted on May 25, 2017 11:45AM
.jpg)
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జ్ నారాయణ రెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇప్పటికే వైసీపీ నేతలు ఈ హత్యకు టీడీపీ నేతలే కారణమంటూ ఆరోపిస్తున్నారు. ఇక ఈ కేసులో భాగంగా పోలీసులు 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నారాయణ రెడ్డి హత్యకు గల కారణాలు ఏంటో తెలిపారు పోలీసులు. నిందితుల నుండి వాగ్మూలం తీసుకున్న పోలీసులు అసలు హత్య ఎందుకు చేశారో చెప్పారు. నిందితుల వాంగ్మూలం ప్రకారం.."ఎప్పట్నుంచో మా మధ్య పాత కక్షలు ఉన్నాయని... మా సొంత పొలాలకే నారాయణరెడ్డికి కప్పం కట్టాల్సి వచ్చింది. మా ఆడవాళ్లను వారు చెరబట్టారు. మా తాతలను, తండ్రులను చంపారు. తరతరాలు వారికి భయపడుతూ బతకాల్సిందేనా? అందుకే నారాయణరెడ్డిని మేము హత్య చేశాం" మని చెప్పారట. అంతేకాదు నారాయణరెడ్డి హత్యకు ముందు నుండే ఎలాంటి ప్లాన్లు వేసుకోలేదని.. కొసనపల్లెకు నారాయణరెడ్డి వస్తున్నాడని ఒక రోజు ముందు మాత్రమే తెలిసిందని.. దీంతో, అప్పటికప్పుడు అందర్నీ కూడగట్టుకుని స్కెచ్ వేశామని చెప్పారు.