అందర్ని పిలిచినా సోనియా.. కేజ్రీవాల్ ను ఎందుకు పిలవలేదబ్బా..!
posted on May 25, 2017 12:24PM
.jpg)
త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక నేపథ్యంలో బీజేపీ తమ అభ్యర్దిని గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇక బీజేపీకి కావాల్సినంత మద్దతు కూడా కూడగట్టుకుంది. మరోవైపు బీజేపీని ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీలు అన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విందును ఏర్పాటు చేశారు. విపక్ష పార్టీల నేతలందరినీ పార్లమెంట్ హౌస్ లో భోజనానికి రావాలని స్వయంగా ఆహ్వానించారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... ఈ విందుకు సోనియా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను మాత్రం ఆహ్వానించకపోవడంత.. ఇప్పుడు ఇది పెద్ద చర్చగా మారింది. అయితే ఇప్పటివరకూ విపక్షాలు నిర్వహించిన ఏ కార్యక్రమంలోనూ కేజ్రీవాల్ పాల్గొనకపోవడం వల్లే ఆయన్ను పిలవలేదని తెలుస్తోంది. మరి సోనియా గాంధీ పిలవకపోవడానికి గల కారణం నిజంగా ఇదేనా... లేక ఇంకేమైనా ఉందా..? సోనియాకే తెలియాలి.