సింహాచలం దుర్ఘ‌ట‌న‌పై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుని ఏడుగురు భక్తులు మరణించిన ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అలాగే మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు.  క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.