కియాపై మరో న్యూస్ నెట్ వర్క్ కథనం... ఖండించిన కోట్రా...

ఏపీ నుంచి కియా మోటర్స్ కార్ల పరిశ్రమ తరలిపోతుందన్న ప్రచారాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వ అత్యున్నత వాణిజ్య విభాగం కొరియా ట్రేడ్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ ఖండించింది. కియా తరలిపోతుందన్న వార్తలు, ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది. కియా పరిశ్రమను తరలించాల్సిన అవసరం ఏమాత్రం లేదని కుండబద్దలు కొట్టింది. కియా మోటర్స్ ఎక్కడికి తరలించేది లేదని స్పష్టం చేసింది. రాయిటర్స్ కథనంతో కియా తరలింపుపై కలకలం రేగగా, తాజాగా... కియా తరలిపోతుందంటూ ఆసియా కమ్యూనిటీ న్యూస్ నెట్‌వర్క్‌ కథనం రాయడంతో... కోట్రా దానిని ఖండించింది.

ఏపీ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహాకారం, మద్దతు ఉందని వెల్లడించింది. దీర్ఘకాలిక లక్ష్యంతో అనంతపురంలో 1.1 బిలియన్ డాలర్లతో కియా యూనిట్ ను ఏర్పాటు చేశామని...ఇక్కడి నుంచే ప్రపంచస్థాయి కార్లను తయారుచేసి వినియోగదారులకు అందిస్తామని కియా మోటర్స్  ఎండీ కుక్ యున్ షిమ్ తెలిపారు.