దిగి రానున్న టోల్ చార్జీలు!
posted on Jul 5, 2025 11:07AM

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్ న్యస్ చెప్పింది. ఇక జాతీయ రహదారులపై టోల్ ఫీజ్ సగానికి సగం తగ్గనుంది. ఔను కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల టోల్ ఫీజు నిబంధనల్లో చేసిన మార్పుల కారణంగా ఇది భారీగా తగ్గే అవకాశం ఉంది. ఎప్పుడో 2008లో టోల్ ప్లాజాలకు సంబంధించి నిర్ణయించిన యూజర్ ఛార్జీలను కేంద్రం తాజాగా సవరించింది.
ఈ సవరింపుల కారణంగా సొరంగాలు, బ్రిడ్జిలు ఉన్న జాతీయ రహదారుల మార్గాల్లో టోల్ ఫీజు లెక్కింపు పద్ధతి మారుతుంది. ఈ మార్పు కారణంగా టోల్ చార్జీలు దాదాపు సగం వరకు ఛార్జీ తగ్గే అవకాశం ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వాణిజ్య వాహన యజమానులకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుస్తుంది. వంతెనలు, సొరంగాలు, ఫ్లైఓవర్లు లేదా ఎలివేటెడ్ హైవేలు వంటి నిర్మాణాలను కలిగి ఉన్న జాతీయ రహదారుల విభాగాలకు టోల్ రేటు తాజా సవరింపులతో 50 శాతం వరకూ తగ్గుతుంది.