మొత్తానికి జగన్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు... ఎందుకంటే?

టాలీవుడ్ అగ్ర నిర్మాతలు... ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశాను. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతోపాటు నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జితో కూడిన బృందం... సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డితో సమావేశమైంది. హుద్ హుద్ తుఫాను సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధితుల కోసం సినీ పరిశ్రమ 320 ఇళ్లు నిర్మించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఇళ్లను ప్రారంభించాలని ముఖ్యమంత్రిని నిర్మాతల బృందం కోరగా, జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. దాదాపు 15కోట్ల రూపాయలతో హుద్ హుద్ బాధితుల కోసం టాలీవుడ్ నిర్మించిన ఇళ్లను త్వరలోనే సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

అయితే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, టాలీవుడ్ అగ్ర నిర్మాతలు ఇదే మొదటిసారి కలవడం. పైగా, చిత్ర పరిశ్రమ పెద్దలు ఎన్నిసార్లు అపాయింట్ మెంట్ అడిగినా జగన్ ఇవ్వలేదనే మాట వినిపించింది. అయితే, ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ద్వారా, జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu