పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు

చిత్తూరు జిల్లాలో ఎనుగుల గుంపు భయాందోళనలు సృష్టిస్తోంది. జిల్లాలోని గ్రామాలపై దాడులు చేస్తూ పంటపొలాలను ధ్వంసం చేస్తున్నాయి. శుక్రవారం (జులై 4) తిరుమల ఘాట్ రోడ్డులో తిష్టవేసిన ఏనుగుల గుంపు.. అటవీ అధికారులు వాటిని అడవులలోకి మళ్లించాయి. అయితే శనివారం (జులై 5)న జిల్లాలోని పులిచర్ల మండలం పాత పేట అటవీ ప్రాంతానికి చేరుకున్నాయి. గ్రామానికి అతి సమీపంలో సంచరిస్తున్న ఈ ఏనుగుల గుంపు మామిడి, అరటి, టమాటా తోటలను ధ్వంసం చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏనుగుల దాడిలో పంటలు ధ్వంసమై తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ పొలాలకు వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు. అటవీ అధికారులు తక్షణమే స్పందించి ఏనుగుల గుంపును దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.