జగన్ పాదయాత్రపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం...


ఎన్నో అష్టకష్టాలు పడి వైసీపీ ఎలాగో అలా పాదయాత్రను ప్రారంభించింది. జగన్ ఈ పాదయాత్ర ప్రారంభించడానికి ఎన్నో ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే.. అసలు జగన్ పాదయాత్ర జరుగుతుంద...? లేదా..? అన్న అనుమానాలు కూడా వచ్చాయి. కానీ ఏదోలా ప్లాన్ లు వేసి పాదయాత్ర ప్రారంభించారు. అయితే ఇక్కడివరకూ బాగానే ఉన్నా... ఇప్పుడు జగన్ పాదయాత్రపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. యాత్ర రూట్ మ్యాప్‌ను గోప్యంగా ఉండటంపై పార్టీ నేతలు కలవరపడుతున్నారు. ఏ నియోజకవర్గాల్లో యాత్ర ఉంటుందోదని ముందుగా చెప్పకుండా అప్పటికప్పుడు చెబితే ఏర్పాట్లు ఎలా చేయాలని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే... ఆ పాదయాత్ర ద్వారా ద్వారా125 నియోజకవర్గాలు..10 వేల గ్రామాలు.. 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర… 125 బహిరంగసభలు జరగాలని ప్లాన్ చేశారు.

 

ఈ యాత్ర ద్వారా ఏపీలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం మీదుగా శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకు ఈ యాత్ర కొనసాగుతోంది. రోజుకు సగటున 20 కిలో మీటర్లు లెక్కించి యాత్ర షెడ్యూల్‌ను రూపొందించిన.. మరో మూడు నెలలు అధికంగా కొనసాగే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. యాత్ర జరిగే తీరును బట్టి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని అంటున్నారు వైసీపీ నేతలు. అందుకే యాత్ర రూట్ మ్యాప్‌ను బహిరంగంగా విడుదల చేయలేదని సమాచారం. అందుకే పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత గోప్యంగా ఉంచి యాత్ర చేయాల్సిన అవసరం ఏముంది అని అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu