పోస్టల్ స్టాంప్స్ పై మన తెలుగు వంటకాలు...

 

తెలుగింటి వంటలకు అరుదైన గౌరవం దక్కింది. ఇకపై ఇండియా పోస్ట్ ద్వారా మీరందుకునే పార్శిల్స్, కవర్స్‌పై మన తెలుగు వంటకాలు స్టాంపుల రూపంలో దర్శనమీయనున్నాయి. హైదరాబాద్ అంటే ముందు అందరికీ గుర్తొచ్చేది బిర్యానీనే. బిర్యానినీ పోస్టల్ స్టాంప్ గా ఆవిష్కరించారు. కుతుబ్ షాహీ సామ్రాజ్య స్థాపన, గోల్కొండ కోట నిర్మాణానికి త్వరలో 500 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా  అధికారులు ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ఆవిష్కరించారు. ఈ స్టాంపు మీద బిర్యానీ "ప్రత్యక్ష " మవుతుంది. బిర్యానీతో పాటు.. , ఆంధ్ర ప్రత్యేక వంటకాలు తిరుపతి లడ్డూ, ఇడ్లీ దోశ, పొంగల్ ఇంకా పలు రకాల వంటకాల చిత్రాలతో కూడిన స్టాంపులను ఇండియా పోస్ట్ ఆవిష్కరించింది. మొత్తానికి మన తెలుగు వంటకాలకు ఇలాంటి గౌరవం దక్కడం ఆనందించాల్సిన విషయమే.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu