ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి మరి కొద్ది గంటల్లో కౌంట్ డౌన్

మరో  ప్రతిష్ఠాత్మక  ప్రయోగానికి భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)  నాసాతో కలిసి చేయనున్న ఈ కీలక ప్రయోగానికి మంగళవారం (జులై 29) మధ్యాహ్నం నుంచి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.   జీఎస్ఎల్వీ – ఎఫ్ 16 రాకెట్‌ను బుధవారం (జులై 30) సాయంత్రం ప్రయోగించనుంది. ఈ రాకెట్ ద్వారా నింగిలోకి నిసార్ ఉపగ్రహాన్ని పంపించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.  

ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించిన 2,393 కిలోల బరువైన  నిసార్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్ట బోతున్నారు. ఈ ఉపగ్రహం భూమిని అణువణువూ స్కాన్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంది.   ఇక, జీఎస్ఎల్వీ – ఎఫ్ 16 రాకెట్‌ ప్రయోగం నేపథ్‌యంలో నాసా శాస్త్రవేత్తలు శ్రీహరి కోట చేరుకున్నారు. మంగళవారం (జులై 29) మధ్యాహ్నం 2 గంటల పది నిముషాలకు నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమౌతుంది. బుధవారం సాయంత్రం 5 గంటల 40 నిముషాలకు రాకెట్ ప్రయోగం జరుగుతుంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu