సింగపూర్ పర్యటనలో చంద్రబాబు స్పీడ్ మామూలుగా లేదుగా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సింగపూర్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా చంద్రబాబు  మంగళవారం (జులై 29) మూడో రోజు  షెడ్యూల్ దాదాపు పది సమావేశాలతో బిజీబిజీగా ఉంది. ఏపీని ఏఐ హబ్ గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఉన్న సీబీఎన్ మంగళవారం (జులై 29) ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు.  ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలతో ఏఐ సింగపూర్ భాగస్వామగా  పని చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని  కోరారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐ శిక్షణా కార్యక్రమాలు, ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాములు, స్కిల్ డెవలప్‌మెంట్ మాడ్యూల్స్ అమలు చేయాలని  ప్రతిపాదించారు. ప్రధానంగా వైద్యం, వ్యవసాయం, విద్య, పౌర సేవల విషయంలో ఏఐ వినియోగంపై చంద్రబాబు మోహన్ కంకణవల్లితో చర్చించారు.  

ఎస్ఐఎ ఇంజినీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్‌జీ జాన్ లిన్ విలిన్‌తోనూ చంద్రబాబు సభేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల నిర్మాణం, అభివృద్ధి ప్రణాళికలను జాన్ లిన్ విలిన్‌కు ముఖ్యమంత్రి వివరించారు. ఎంఆర్‌ఓ విధానం ద్వారా కొత్తగా నిర్మించే విమానాశ్రయ ప్రాజెక్టుల్లో భాగస్వామి కావాలని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ నూతనంగా తీసుకువచ్చిన పారిశ్రామిక అనుకూల విధానాల గురించి కూలంకుషంగా వివరించారు.  విమానయాన రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ఏపీలో పర్యటించి పెట్టుబడులపై ఆలోచన చేయాలని సీఎం కోరారు.

చంద్రబాబు ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన ఎస్ఐఎ ఇంజినీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్..  తర్వలోనే రాష్ట్రానికి తమ కంపెనీ ప్రతినిధులను పంపిస్తామన్నారు.  ఇంకా ఐటీ, ఎలక్ట్రా నిక్స్, ఫిన్‌టెక్ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో  కూడా సీఎం వరుస భేటీలలో పాల్గొంటారు. అలాగే   క్యారియర్, విల్మర్, టీవీఎస్, మురాటా సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమై చర్చించ నున్నారు. ఇంకా  సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగ రత్నం, మాజీ ప్రధాని లీ హ్సియన్ లూంగ్‌ల‌తో కూడా సీఎం చంద్ర‌బాబు  మంగళవారం (జులై 29) భేటీ  కానున్నారు.  

ఇక ఏపీలో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీగూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ఆధారిత, క్లౌడ్ ఆధారిత సేవలు, డిజిటల్ ఇండియా లక్ష్యాలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో  కూడా సీఎం భేటీ అవుతారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu