హ్యాట్రిక్ సాధించినా ఓడిన కోల్ కత్తా

Publish Date:Apr 16, 2013

IPL 6 Kings XI Punjab beat Kolkata Knight Riders by 4 runs, Kings XI Punjab v Kolkata Knight Riders, Game 20 IPL 6, IPL 2013 Kings XI Punjab stun Kolkata Knight Riders

 

వెస్ట్ ఇండీస్ బౌలర్ సునీల్ నరైన్ ఐపిఎల్-6లో మొట్టమొదటి హ్యాట్రిక్ సాధించినా కోల్ కత్తా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ చేతిలో పరాజయం పాలైంది. టాస్ గెలిచి కోల్ కత్తా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాంటింగ్ కు దిగిన గిల్ క్రిస్ట్, మన్ దీప్ సింగ్ కుదురుగా ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. గిల్ క్రిస్ట్ (7)ను శ్రీలంక బౌలర్ సేననాయకే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు పంపాడు. మన్ దీప్ సింగ్ 30 బంతుల్లో 41 పరుగులు (6   బౌండరీలు) చేసి కల్లీస్ బౌలింగ్ లో బిస్లా క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. తరువాత పంజాబ్ బ్యాట్స్ ఎవరూ క్రీజ్ లో నిలవలేకపోయారు. వొహ్రా ను17 పరుగులకు బాలాజీ క్యాచ్ అండ్ బౌల్ చేశాడు. నరైన్ బౌలింగ్ లో డేవిడ్ హస్సీ 17 బిస్లా క్యాచ్ ద్వారా, అజహర్ మహమూద్ 0 క్యాచ్ అండ్ బౌల్,  గురుకిరీత్ 0 ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఐపిఎల్-6 లో మొట్టమొదటి హ్యాట్రిక్ సాధించాడు. చివరి ఓవర్లలో సీజన్ లో మొదటిసారిగా ఆడుతున్న గోని బ్యాంటింగ్ కు దిగి 18 బంతుల్లోనే 42 పరుగులు (4 బౌండరీలు, 3 సిక్సర్లు)తో చెలరేగి ఆడడంతో పంజాబ్ కింగ్స్ కు గౌరవప్రదమైన స్కోరు 20ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ప్రవీణ్ కుమార్ 1, పియూష్ చావ్లా 11 నాటౌట్, ఆవానా 0 నాటౌట్ గా నిలిచారు. కలీస్ 3, నరైన్ 3, సేననాయకే 2, లక్ష్మీపతి బాలాజీ 1 వికెట్లు తీశారు. తరువాత ఇన్నింగ్స్ ప్రారంభించిన కోల్ కత్తా నైట్ రైడర్స్ కు తోలిబంతికే ఎదురుదెబ్బ తగిలింది. ప్రవీణ్ కుమార్ బౌలింగ్ లో బిస్లా 0పరుగులకే గిల్ క్రిస్ట్ క్యాచ్ పట్టండంతో పెవిలియన్ చేరాడు. తరువాత అజహర్ మహమద్ బౌలింగ్ లో కల్లీస్ 1ను మన్ దీప్ క్యాచ్ ద్వారా అవుట్ చేశాడు. గంబీర్ ఒక్కడే నిలకడగా ఆడుతూ 60 పరుగుల వద్ద గోని బౌలింగ్ లో గిల్ క్రిస్ట్ అద్భుత క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. గంభీర్, మోర్గాన్ 38 బంతుల్లో 47 పరుగులు మూడో వికెట్ కు 71 బంతుల్లో 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తివారీ 1, యూసఫ్ పఠాన్ 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు. చివర్లో రజత్ భాటియాను 6 బంతుల్లో 16 పరుగులు (2సిక్సర్లు) ఆవానా క్లీన్ బౌల్డ్ చేశాడు. సురేష్ నరైన్ 1నాటౌట్, లక్ష్మీపతి బాలాజీ 0 నాటౌట్ గా నిలిచారు. నిర్ణీత కోల్ కత్తా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 153 పరుగలు చేసి 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మన్ ప్రీత గోనీ 4-0-18-1 పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 18 బంతుల్లో 42 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.