విశాఖలో రూ.1818కోట్ల తో ఏషియన్ పెయింట్స్ సంస్థ
posted on Dec 11, 2014 5:29PM
.jpg)
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం నిర్వహించిన ఒక సమావేశంలో పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జే.యస్.వి.ప్రసాద్ ఇంతవరకు తమ శాఖ రూ. 3000కోట్ల పెట్టుబడులతో వివిధ రకాల పరిశ్రమల స్థాపనకు అనుమతించిందని తెలియజేసారు. వాటిలో విశాఖలో రూ.1818కోట్ల పెట్టుబడితో ఏషియన్ పెయింట్స్ సంస్థ, గుజరాత్ అంబుజ ఎక్స్ పోర్ట్స్ సంస్థ రూ.240 కోట్ల పెట్టుబడితో కర్నూలు జిల్లాలో జొన్నగింజల ప్రాసెసింగ్ పరిశ్రమ, శ్రీ రామ్ వెంచర్స్ వారి అద్వర్యంలో యూనివర్సల్ కోక్ మరియు పవర్ లిమిటడ్ సంస్థ రూ.725 కోట్ల పెట్టుబడితో నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం వద్ద నాన్-రికవరీ-కోక్ ఓవెన్ ప్లాంట్, ఆ సంస్థకు అనుబంధంగా 35 మెగావాట్స్ సామర్ధ్యం గల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇవి కాక, షాహీ ఎక్స్ పోర్ట్స్ సంస్థ కుప్పం, పలమనేరు, చిత్తూరు, హిందూపురంలలో రూ. 150కోట్ల పెట్టుబడితో నాలుగు దుస్తుల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. కేవలం ఈ నాలుగు పరిశ్రమల ద్వారా దాదాపు 11,000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ పరిశ్రమలన్నీ కార్యకలాపాలు మొదలుపెట్టినట్లయితే దాదాపు 13000మందికి ప్రత్యక్షంగా మరో అంతమందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని తెలిపారు.