ఏపీలో పరిశ్రమలకు అండగా ప్రత్యేక బోర్డు ఏర్పాటు
posted on Dec 11, 2014 5:45PM
.jpg)
రాష్ట్రంలో వేగంగా పరిశ్రమల స్థాపన కోసం ఎకనామిక్ డెవెలప్ మెంటు బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు దరఖాస్తు చేసుకొన్నవారికి అనుమతుల కోసం వివిధ శాఖల చుట్టూ తిరుగవలసిన అవసరం లేకుండా సింగిల్ విండో పద్దతిలో ఆ బోర్డు ద్వారానే అన్ని అనుమతులు జారీ చేయాలని, వివిధ శాఖలను సమన్వయ పరుస్తూ అనుమతులు మంజూరు ఎటువంటి జాప్యం జరగకుండా చూసే బాధ్యత ఆ బోర్డుకే అప్పజెప్పాలని ముఖ్యమంత్రి సూచించారు. భూమి, నీళ్ళు, విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణం, కాలుష్య నివారణ సంస్థ నుండి అనుమతులు పరిశ్రమలకు సబ్సీడీలు వంటి పనులన్నిటినీ ఆ బోర్డే స్వయంగా పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలు సూచనలమేరకు అధికారులు బోర్డు ఏర్పాటుకు అవసరమయిన సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో జరుగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఈ బోర్డు ఏర్పాటుకు ఆమోదం లభించవచ్చును.