ఏపీకి ఓ 500 మిలియన్ డాలర్లు అప్పు రెడీ
posted on Dec 11, 2014 2:49PM
(2).jpg)
వైజాగ్ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని విభజన బిల్లులో హామీ ఇవ్వబడింది. ఆ తరువాత వచ్చిన మోడీ ప్రభుత్వం కూడా దానికి హామీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు సిద్దంగానే ఉంది. ఇవ్వన్నీ చూసిన ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా రాష్ట్రానికి ఓ 500 మిలియన్ డాలర్లు అప్పు ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. ఆ బ్యాంక్ ఉన్నతాధికారులు, ఆ బ్యాంక్ భారతదేశ డైరెక్టర్ తెరిసాకో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి రాష్ట్రంలో ఉన్న పోర్టులతో ఈ పారిశ్రామిక కారిడార్లను కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు నిర్మించదలచుకొంటే దాని కోసం మేము అప్పిచ్చేందుకు రెడి అంటూ చెప్పేశారు. అందుకు బాబుగారు కూడా ఒకే అనేసినట్లు సమాచారం. వీలయితే వైజాగ్ లో పరిశ్రమల స్థాపనకు కూడా మీరు ఓ చెయ్యి వేస్తే బాగుంటుందని చంద్రబాబు వారిని కోరినట్లు సమాచారం. వారు ఇదే పనిమీద ఈనెల 20, 21 తేదీలలో వైజాగ్ మరియు చిత్తూరు జిల్లాలలో పర్యటించబోతున్నారుట.