వెలుగులోకి ట్రంప్ చీకటి కోణం..!
posted on May 23, 2016 5:56PM
.jpg)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దిగినప్పటి నుంచి నోటీ ద్వారానో..చేతల ద్వారానో వివాదాలు రేకిత్తిస్తున్న డోనాల్డ్ ట్రంప్ గురించి మరో నిజం బయటకు వచ్చింది. మాఫియాడాన్ అంతోని ఫాట్ టోని సాలెర్నొతో ట్రంప్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ట్రంప్..ట్రంప్ టవర్, ట్రంప్ ప్లాజా నిర్మించడానికి మాఫియా డాన్ ఫాట్ టోనికి చెందిన కంపెనీలతో రహస్య ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రముఖ జర్నలిస్ట్ డేవిడ్ కే జాన్‌స్టన్ వెల్లడించారు. ఈ మేరకు జాన్‌స్టన్ పొలిటికో పత్రికలో ట్రంప్-మాఫియాడాన్ సంబంధాలపై విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించారు. ట్రంప్‌కు మాఫియాతో సంబంధాలున్నట్టు కథనాలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆయన మాఫియా లింకులు బయటకొచ్చాయి. అయితే ఈ కథనాన్ని ట్రంప్ కొట్టిపారేశారు. ఫ్యాట్ టోనితో తనకు సంబంధాలు లేవని, ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాన్ని ప్రచురించినందుకు జాన్‌స్టన్‌పై కేసు వేస్తానని హెచ్చరించారు.
.jpg)