ఆస్తి కోసం మరదలిపై అత్యాచారం..

ఆస్తి కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారు అనడానికి నిత్యం వార్తల్లో ఎన్నో నిదర్శనాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అదే కోవలోకి మరో దుర్మర్గుడు చేరాడు. హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని ప్రగతి నగర్‌లో ఆస్తి కోసం సొంత మరదలిపై బావ అత్యాచారానికి పాల్పడ్డాడు. 

 

గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన అజయ్ మరదలికి అమరావతి ప్రాంతంలో ఆస్తి ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరుగుతుండటంతో..ఒక్కసారిగా ఆ భూమికి ధర పెరిగింది. దీంతో ఆ భూమిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని ప్లాన్ వేశాడు. బలవంతంగా లొంగదీసుకుంటే ఆ యువతి జీవితాంతం తాను చెప్పినట్టే వింటుందని భావించాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడి, ఫోటోలను తీశాడు. అనంతరం ఎవరికైనా చెప్పినా..ఆస్తి తన పేరిట రాయకపోయినా నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. దీంతో వేధింపులు భరించలేని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu