కొత్త‌గా మ‌రో ముగ్గురికి, తెలంగాణాలో 44 పాజిటివ్ కేసులు!

తెలంగాణాలో క‌రోనా ప్ర‌మాద‌ ఘంటిక‌లు మారోమ్రోగుతున్నాయి.
తాజాగా వెల్లడైన మూడు పాజిటివ్ కేసుల్ని చూసినప్పుడు.. ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహ రించాల్సిన అవసరం ఉందని చెప్పాలి. వైరస్ సోకిన వారి నుంచి మరొకరికి వైరస్ సోకిన వారి సంఖ్య తెలంగాణలో తొమ్మిదికి చేరింది. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ ల సంఖ్య 44కు చేరింది.

తాజాగా పాజిటివ్ గా తేలిన మూడు కేసుల్లో రెండు ఒకే కుటుంబానికి చెందిన భార్యభర్తలవి. వారిద్దరూ డాక్ట‌ర్లే. మరొకరు నగర శివారుకు చెందిన వారు. అయితే వీరికి ఫారిన్ ట్రావెల్ హిస్టరీ లేకపోవటం ఆందోళనను కలిగించే అంశం.

దోమలగూడకు చెందిన 43 ఏళ్ల వైద్యుడికి.. అతడి సతీమణి 36 ఏళ్ల వైద్యురాలికి కరోనా సోకినట్లుగా గుర్తించారు. వీరిద్దరికి.. ప్రైమరీ కాంటాక్ట్ గా గుర్తించారు. కుత్భాల్లాపూర్ కు చెందిన మ‌రో వ్య‌క్తి కి కూడా పాజిటివ్ వ‌చ్చింది. ఇటీవల అతడు ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లుగా గుర్తించారు. ఈ మూడు కేసుల్లోనూ విదేశీ పర్యటనలు లేకుండా.. వేరే వారి నుంచి సోకటం ఆందోళ‌న క‌లిగించే అంశం. దీంతో.. వైరస్ సోకిన వారి నుంచి మరొకరికి వైరస్ సోకిన వారి సంఖ్య తెలంగాణలో తొమ్మిదికి చేరింది.