హస్తినకు చంద్రబాబు.. కారణమేంటంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం (సెప్టెంబర్12) హస్తిన బయలుదేరి వెళ్లనున్నారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ లో కీలక భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆయన శుక్రవారం (సెప్టెంబర్ 12) జరగనున్న ఉపరాష్ట్రపతి సీపీ చంద్రశేఖర్ ప్రమాణ స్వీకార కర్యక్రమంలో పాల్గొననున్నాయి. ఇందుకోసమే చంద్రబాబు వెడుతున్నారు. ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీయే కూటమి పార్టీల నేతలే కాకుండా విపక్ష పార్టీలకు చెందిన నేతలూ హాజరౌతారు. రాష్ట్రపతి కార్యాలయంలో జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తిగా రాజకీయాలకు అతీతం. ఇక విషయానికి వస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా తెలుగుదేశం కీలకంగా వ్యవహరించింది.  ఏపీ ఎన్డీఏ ఎంపీలందర్నీ మంత్రి లోకేష్ సమన్వయం చేశారు. ఇందు కోసం ఆయన స్వయంగా ఢిల్లీకి వెళ్లారు.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబునాయుడు ఉపరాష్ఠ్రపతి ప్రమాణస్వకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెడుతున్నారు. అయితే ఈ హస్తన పర్యటన సందర్భంగా చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల హస్తిన వెళ్లి ప్రధాని నరేంద్రమోడీతో దాదాపు ముప్పావుగంట సేపు భేటీ అయ్యారు. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పలు అంశాలపై మోడీతో చర్చించారు. అయితే ఆ సందర్భంగా నారా లోకేష్ కేంద్ర మంత్రులతో భేటీ కాలేదు. ఇప్పుడు చంద్రబాబు హస్తిన పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ కావడాన్ని లోకేష్, మోడీ భేటీకి కొనసాగింపుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu