తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు

 

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు క్యాబినెట్ విస్తరణకు ఉండే అవకాశముంది. కొత్తగా మంత్రి వర్గంలో ముగ్గురు లేదా నలుగురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. . ఇప్పటికే ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు  సమాచారం అందజేసినట్లుగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం మంత్రి‌వర్గ విస్తరణపై రాజ్‌భవన్  నుంచి అధికారిక ప్రకటన రానున్నట్లుగా సమాచారం.  

అయితే, భర్తీ చేయబోయే మూడు మంత్రి పదవుల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి, మరొకటి బీసీ సామాజికవర్గానికి దక్కనుంది.ఇప్పటికే మంత్రి పదవి రేసులో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకట స్వామి‌, దేవరకొండ ఎమ్మెల్యే బాలు‌ నాయక్‌, ఇబ్రహీంపట్నం మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్తల్‌ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఉన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu