కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరిన చంద్రబాబు


 

ఏపీ నూతన రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇంటికెళ్లి మరీ ఆహ్వానిస్తానన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేసీఆర్ ను కలవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే చంద్రబాబు కార్యలయం నుండి అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ కోరినట్టు తెలుస్తోంది. ఈనెల 22న జరగబోయే శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ ని ఆహ్వానించి ఆహ్వాన పత్రికను అందించనున్నారు. దీంతో ఇప్పుడు వీరిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu