మోడీకి జగన్ లేఖ.. ఆలోపు కలవడానికి సమయం ఇవ్వండి
posted on Oct 17, 2015 3:10PM

ఒక పక్క ఏపీ శంకుస్థాపన కార్యక్రమాలతో సీఎం చంద్రబాబు బిజీగా ఉంటే మరోపక్క ఏపీ ప్రతిపక్షనేత, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖలు రాస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే జగన్ చంద్రబాబుకు తనను శంకుస్థాపన కార్యక్రమానికి పిలవద్దని.. పిలిచినా రానని.. మళ్లీ రాలేదని విమర్శించవద్దని లేఖ రాశారు. అయినా చంద్రబాబు మాత్రం తమ బాధ్యతగా మంత్రులకు జగన్ ను పిలవమని ఆదేశించారు. అయితే జగన్ ఈ రోజు మళ్లీ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఈ నెల 22న జరగబోయే ఏపీ శంకుస్థాపన కార్యక్రమం జరిగే లోపు తనను కలవడానికి సమయం ఇవ్వాలని జగన్ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని మోడీ చెప్పారని.. ఇప్పుడు ప్రత్యేక హోదాపై చర్చించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఏపీ మంత్రలు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ను శంకుస్థాపన కార్యక్రమానికి పిలవడానికి తనను కలిసేందుకు సమయం ఇవ్వడంలేదని.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మాట్లడటానికి అవకాశం ఇవ్వడంలేదని మండిపడుతున్నారు.